Bajaj CNG Bike పండుగ సీజన్‌లో గుడ్‌న్యూస్.. తొలి సీఎన్‌జీ బైక్ రాబోతుంది.. ఎప్పుడంటే.??
ఇప్పటివరకూ మీరు పెట్రోల్‌తో నడిచే బైక్‌లు, ఎలక్ట్రిక్ టూ వీలర్లను చూసి ఉంటారు. కానీ సీఎన్‌జీ బైక్‌ను చూశారా.?? CNG(CNG Bike) లో కారు, ఆటో తెలుసు కానీ.. బైక్ ఏంటి అనుకుంటున్నారా.?? అవును త్వరలోనే దేశంలోనే తొలిసారిగా సీఎన్‌జీ పవర్‌తో నడిచే బైక్ రాబోతుంది. ప్రముఖ సంస్థ దీనిని విడుదల చేయబోతోంది.
ఆటో మొబైల్ మార్కెట్లో కొత్త ఉత్పత్తులకు కొదవ లేదు. నిత్యం సరికొత్త మోడళ్లతో కస్టమర్లను ఆకర్షిస్తూ తమ సేల్స్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాటిలో బజాజ్ ఆటో(Bajaj Auto) ఒకటి. బజాజ్ పల్సర్ బైక్, ప్లాటినా ఇంకా పలు మోడల్ బైక్‌లను విక్రయిస్తున్న ఈ దిగ్గజ సంస్థ.. త్వరలో సీఎన్‌జీ బైక్‌ను విడుదల చేయబోతోంది.

వచ్చే 3 నెలల్లో లేదా రానున్న పండుగ సీజన్‌లో ప్రపంచంలోనే తొలి CNG బైక్(Bajaj Bruzer 125)ను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు.. బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ తెలిపారు. సీఎన్‌జీ బైక్ ద్వారా వాహనదారులపై ఫ్యూయెల్ ఖర్చు 50 శాతం నుంచి 65 శాతం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
దేశంలో మధ్య తరగతి ప్రజలు కొత్త బైక్ కొనుగోలు చేయాలని భావించినప్పుడు చాలావరకు మొదటగా బజాజ్ మోడల్ బైక్‌లకే ప్రాధాన్యత ఇస్తారు. అంతలా ప్రజల్లో ఆదరణ సంపాదించుకుంది. ఈ మేరకు సంస్థ కూడా తన ఎగ్జిస్టింగ్ మోడల్ బైక్‌లను వివిధ అప్‌డేట్లతో రీలాంచ్ చేస్తోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ యువ రైడర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తోంది.

ఈ క్రమంలో వచ్చే త్రైమాసికంలో ప్రపంచంలోనే తొలి CNG బైక్‌ను విక్రయానికి తీసుకురానున్నట్టు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ వెల్లడించారు. భారత మార్కెట్లో ప్రముఖ టూ వీలర్ సంస్థలు హీరో, హోండా చేయలేని పనిని బజాజ్ ఇప్పుడు చేస్తోందని రాజీవ్ అన్నారు. తక్కువ ఫ్యూయెల్‌తో వాహనదారులు దీనిని నడపొచ్చని పేర్కొన్నారు.
అంతే కాకుండా బజాజ్ సీఎన్‌జీ బైక్ యజమానులకు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తగ్గుతాయని రాజీజ్ బజాజ్ తెలిపారు. ఇక పెట్రోల్ ఇంజిన్ బైక్‌తో పోలిస్తే సీఎన్‌జీతో నడిచే టూ వీలర్ నుంచి విడుదలయ్యే కాలుష్యం చాలా వరకు తగ్గుతుందని వివరించారు. బజాజ్ సీఎన్‌జీ బైక్ ద్వారా 50 శాతం కాలుష్యం తగ్గుతుందని పేర్కొన్నారు.

కాగా CNG బైక్‌ను వినియోగించినప్పుడు.. విడుదలయ్యే ఉద్గారాల్లో 90 శాతం నాన్-మీథేన్ హైడ్రోకార్బన్ ఉద్గారాలుంటాయని నివేదికలు చెబుతున్నాయి. దీని ద్వారా కాలుష్యంపై ప్రభావం ఉండదు. ఈ నేపథ్యంలో పర్యావరణ హితం కోసం బజాజ్ సీఎన్‌జీ బైక్‌ను తీసుకువస్తోంది. ఈ బైక్ అమ్మకానికి వస్తే పెట్రోల్ బైక్‌లకు సవాలుగా మారనుంది.
Bajaj Bruzer 125 పేరుతో సీఎన్‌జీ బైక్ విడుదల కానున్నట్లు సమాచారం. 125 cc కమ్యూటర్ మోటార్‌సైకిల్ ప్రధానంగా సెమీ-అర్బన్ మరియు రూరల్ మార్కెట్ లక్ష్యంగా మార్కెట్లోకి రానుంది. దీని ధర రూ. 80,000 నుంచి రూ. 85,000 మధ్య ఉంటుందని సమాచారం. అయితే పనితీరు పరంగా పెట్రోల్ బైక్‌ల పర్ఫామెన్స్ మాదిరిగా లేకపోయినా.. అధిక మైలేజ్ ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవచ్చు.

బజాజ్ బ్రూజర్ 125 ఒక కమ్యూటర్ మోటార్‌సైకిల్ కావడంతో దీని డిజైన్, నిర్మాణం సింపుల్‌గా ఉంటుందని తెలిస్తోంది. టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు ట్విన్-షాక్‌లు మరియు CBSతో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆప్షన్‌లు సమర్ధవంతంగా పనిచేస్తాయని రాజీవ్ బజాజ్ వెల్లడించారు. తక్కువ ధరలో సీఎన్‌జీ బైక్ విడుదలైనట్లయితే ఇది మార్కెట్లో విప్లవం సృష్టిస్తుందనే చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








