Affordable Bikes: తక్కువ ధర.. ABS ఫీచర్.. న్యూ ఇయర్‌లో కొత్త బైక్ కొనాలంటే వీటిపై ఓ లుక్కేయండి.!!
కొత్త సంవత్సరం 2024 మొదలైంది. న్యూ ఇయర్ సందర్భంగా చాలా మంది కొత్త నిర్ణయాలు, లక్ష్యాలను పెట్టుకుంటుంటారు. అందులో ఎక్కువగా వ్యక్తిగత అవసరాలే ఉంటాయి. కొత్త ఇల్లు కట్టాలని ప్లాన్ చేయడం లేదంటే కొత్త వాహనం కొనాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఈ న్యూ ఇయర్‌లో కొత్త బైక్ కొనాలి అనుకుంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..
దేశీయ మార్కెట్లో చాలా రకాల బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయమైన ఫీచర్లు, డిజైన్, అధునాతన టెక్నాలజీతో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ABS(Anti Lock Braking System) ఫీచర్. సడెన్ బ్రేక్ వేసినప్పుడు రైడర్లు ప్రమాదానికి గురి కాకుండా ఈ ఫీచర్ కాపాడుతుంది. ఏబీఎస్ ఫీచర్‌తో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్(Most Affordable Bikes) బైక్‌ల గురించి ఈ కథనంలో..

బజాజ్ ప్లాటినా(Bajaj Platina): భారత మార్కెట్లో అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్‌లలో బజాజ్ ప్లాటినా ఒకటి. ఈ బైక్ లీటర్‌కు 73 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇందులో ABS ఫీచర్ ప్రధానంగా ఉంది. ఈ బైక్ సరసమైన ధరలో లభిస్తుంది. ధర రూ. 79,821(ఎక్స్ షోరూమ్).
హోండా యూనికార్న్(Honda Unicorn): మార్కెట్లో చాలా కాలంగా అందుబాటులో ఉన్న బైక్ హోండా యూనికార్న్. 162 సీసీ ఇంజిన్‌తో ఈ బైక్ పనిచేస్తుంది. 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్, ABS ఫీచర్‌తో ఉన్న బైక్ ధర రూ. 1.09 లక్షలు (ఎక్స్ షోరూమ్).

టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160(TVS Apache RTR 160): భారత మార్కెట్లో స్పోర్టీ డిజైన్‌తో అందుబాటులో ఉన్న బైక్ టీవీఎస్ అపాచీ RTR 160. 159 సీసీ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఏబీఎస్ ఫీచర్‌తో ఉన్న ఈ బైక్ ప్రారంభ ధర రూ. 1.20 లక్షలు(ఎక్స్ షోరూమ్).
యమహా FZS- FI: దేశంలో యమహా బైక్‌లకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. స్పోర్టీ లుక్, డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ క్రమంలో నేక్డ్ స్పోర్ట్ లుక్‌తో ఉన్న బైక్ యమహా FZS-FI. ఈ బైక్ 149 సీసీ ఫ్యూయెల్ ఇంజెక్ట్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. సింగిల్ సిలిండర్‌ను కలిగి ఉంది. ఈ బైక్‌లో ABS ఫీచర్‌ను చూడవచ్చు. యమహా FZS-FI బైక్ ప్రారంభ ధర రూ. 1.16 లక్షలు.

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్(Hero Xtreme 160R): దేశీయ మార్కెట్లో అతి పెద్ద ద్విచక్ వాహన శ్రేణిలో ఒకటి హీరో ఎక్స్‌ట్రీమ్. ఈ బైక్ ధర రూ. 1.21 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉంది. 163 సీసీ, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ABS ఫీచర్‌తో ఈ బైక్ టాప్ స్పెక్‌లో కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








