ఫ్లిప్‌కార్ట్‌లో టూవీలర్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్.. షోరూమ్ కంటే చాలా తక్కువ ధరలో ఇంటికే ఆర్డర్‌ పెట్టుకోండి!

దేశంలో ఆన్‌లైన్ షాపింగ్‌కి జనాలు అలవాటు పడిపోయారు. ఉప్పు నుంచి పప్పు వరకు అన్నింటిని ఇంట్లోనే ఒక్క క్లిక్‌లో ఆర్డర్ చేయవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్‌ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) సంస్థలు సాధారణంగా పండుగ సీజన్‌లో ప్రత్యేక డిస్కౌంట్స్‌తో సేల్స్‌ని నిర్వహిస్తాయి. అందులో భాగంగా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ నేటి నుంచి బిగ్ బిలియన్ డేస్ (Flipkart Big Billion days 2024)ని నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో తక్కువ ధరలో తమకు కావాల్సిన వస్తువులను జనాలు కొనుగోలు చేయవచ్చు.

తక్కువ ధరకు ఎక్కువ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఈ సేల్‌లో ఉంటుంది. గాడ్జెట్స్ నుంచి గృహోపకరణాల వరకు అన్నింటిని బిగ్ బిలియన్ డేస్‌లో తక్కువ ధరలో కొనుగోలుదారులు దక్కించుకోవచ్చు నిత్యావసర వస్తువులతో పాటు వాహనాలు కూడా ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరలో లభిస్తాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు కూడా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్‌లో ఆకర్షణీయమైన ధరలతో అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు ఈ కథనంలో..

Flipkart Big Billion days Sale 2024 Two Wheelers Discount

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌ దేశంలో ఇప్పుడు 700కి పైగా నగరాల్లో విస్తరించి ఉంది. ఇది 12,000 పిన్ కోడ్స్‌ని కవర్ చేస్తుంది. ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో పాటు, ఇతర క్యాష్‌బ్యాక్‌, ఈఎంఐ డీల్స్‌తో పాటు HDFC డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా అదనపు డిస్కౌంట్లు కస్టమర్లు పొందుతారు. కాబట్టి తక్కువ ధరలో టూవీలర్స్‌తో పాటు, టూవీలర్స్‌ని కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్ ద్వారా హీరో, బజాజ్, టీవీఎస్ మోటార్, ఓలా ఎలక్ట్రిక్, బజాజ్ చేతక్, జావా, యెజ్డీ, ఏథర్ ఎనర్జీ, హీరో విడా వంటి పలు ప్రముఖ కంపెనీల నుంచి ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయవచ్చు. పెట్రోల్‌తో నడిచే కమ్యూటర్ బైక్స్‌, ప్రీమియం స్పోర్ట్స్ బైక్స్‌తో సహా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వరకు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు.

లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేని మోడళ్ల నుంచి హై పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వరకు ఈ సేల్‌లో మంచి తక్కువ ధరకే మోటార్‌సైకిల్స్‌ని నేరుగా ఇంటికే ఆర్డర్‌ పెట్టుకోవచ్చు. ఆన్‌లైన్‌లో టూవీలర్స్‌ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 2024 ఆగస్టులో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ దాదాపు ఆరు రెట్లు పెరిగిందని ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పేర్కొంది. అన్ని రకాల వాహనాల్లో ఈ పెరుగుదల కనిపించింది.

ఈ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్‌లో అనేక ఆఫర్లు ఉన్నాయి. వీటిలో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. సూపర్ కాయిన్స్‌ ద్వారా ఇతర బ్యాంక్స్‌ ద్వారా ప్రత్యేక డీల్స్, లాయల్టీ రివార్డులు పొందే అవకాశం ఉంది. గత ఏడాది జరిగిన సేల్‌ లోనూ తక్కువ ధరలో టూవీలర్స్‌ లభించాయి. ఈ ఏడాది అంతే మొత్తంలో డిస్కౌంట్స్‌ ఉన్నాయి.

ఈ సేల్‌లో 3 కంపెనీల ద్విచక్ర వాహనాలను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. హీరో స్ల్పెండర్ ప్లస్ ధర రూ.76,306 నుంచి రూ.67,999కు తగ్గనుంది. అదేవిధంగా హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125ఆర్ ధర రూ.95,800 నుంచి రూ.79,999కు తగ్గింది. అదేవిధంగా, బజాజ్ చేతక్ 3202 ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా సుమారు రూ .17,000 తక్కువ ధరకు లభిస్తుంది.

మీరు పండుగ సీజన్‌లో ద్విచక్ర వాహనాన్ని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, షోరూమ్‌కి వెళ్లి తనిఖీ చేసి ఆ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయండి. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఆకర్షణీయమైన ధరతో వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో వెహికిల్స్‌ కొనడం వల్ల ఆ కంపెనీలు అందించే అన్ని సర్వీసులు లభిస్తాయి. కాబట్టి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి.

More from DriveSpark

Article Published On: Thursday, September 26, 2024, 7:20 [IST]
English summary
Flipkart big billion days sale 2024 discounts and cashbacks on two wheelers
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+