కేవలం రూ. 64,990 లకే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. దీనిని నడిపేందుకు లైసెన్స్‌, డాక్యూమెంట్స్‌ అవసరం లేదు..!!

దేశంలో ఎలక్ట్రిక్‌ కార్లు, బైక్‌ల వినియోగం పెరుగుతోంది. అందుకు తగినట్లుగానే కొత్త కొత్త ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ మార్కెట్‌లో అడుగు పెడుతున్నాయి. తాజాగా ఫుజియామా సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. థండర్ ప్లస్ (థండర్+) పేరుతో ఈ స్కూటర్‌ని మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టింది.

ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్‌లలో ఫుజియామా మంచి మార్కెట్‌ని కలిగి ఉంది. మార్కెట్‌లో మార్పులకు అనుగుణంగా దీనిని సంస్థ రూపొందిస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విభాగంలో సరికొత్త ఆవిష్కరణలతో స్కూటర్లను ఈ సంస్థ ప్రవేశ పెడుతోంది. తాజాగా తన కొత్త థండర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ మార్కెట్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఈ స్కూటర్‌కి సంబంధించిన ఫీచర్లు, రేంజ్‌, స్పెసిఫికేషన్‌ వివరాలు మీకోసం..

Fujiyama-Electric-Thunder-Plus-Scooter

2 వేరియంట్స్‌: ఈ సంస్థ తీసుకువచ్చిన థండర్ ప్లస్ స్కూటర్‌ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. అవి థండర్ VLRA మరియు థండర్ LIగా సంస్థ తెలిపింది. ఈ రెండు స్కూటర్లు లో-స్పీడ్‌ వెహికిల్‌ విభాగంలో అందుబాటులో ఉండనున్నాయి. థండర్ ప్లస్‌ స్కూటర్‌ LI వేరియంట్ ధర రూ. 64,990తో ప్రారంభం కానుంది.

ఫుజియామా థండర్ ప్లస్ ఇ స్కూటర్: గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఈ స్కూటర్‌పై వెళ్లవచ్చు. ఈ స్కూటర్‌లో 250 వాట్ల మోటార్ ను ఉపయోగించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇందులో 48వీ 28ఏహెచ్ వీఎల్ఆర్ఏ బ్యాటరీని అందించారు. ఇది తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావడంతో దీనిని నడిపేందుకు రిజిస్ట్రేషన్ నంబర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.

థండర్ LI వేరియంట్: ఇది కూడా స్లో స్పీడ్ వేరియంట్. థండర్ వీఎల్ఆర్ఏ వేరియంట్ మాదిరిగానే 250 వాట్ల మోటార్‌ని ఉపయోగించారు. ఇది కూడా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. పైన తెలిపిన విధంగా ఈ స్కూటర్‌కి కూడా లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ వంటి డాక్యుమెంట్లు అవసరం లేదు. అయితే LI వేరియంట్‌ ఫుల్ ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

ఇందులోని 60వీ 30ఏహెచ్ వీఎల్ఆర్ఏ బ్యాటరీని ఉపయోగించారు. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పట్టనుంది. ఈ రెండు స్కూటర్లలో అధునాతన సాంకేతిక ఫీచర్లను వినియోగించారు. దీంతో ఈ స్కూటర్‌లో అన్ని రకాల ఫీచర్లు గమనించవచ్చు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్లతో కూడిన ఎల్ఈడీ హెడ్‌లైట్స్‌, రిమోట్ లాక్ అండ్ అన్లాక్ ఫీచర్లతో ఈ స్కూటర్లు వస్తున్నాయి.

Fujiyama-Electric-Thunder-Plus-Scooter

అంతే కాకుండా యాంటీ థెఫ్ట్ టెక్నాలజీ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. USB ఛార్జింగ్ పోర్ట్ మరియు రైడర్‌కి రక్షణగా నిలిచే మరికొన్ని ఫీచర్లు గమనించవచ్చు. భారతీయ మార్కెట్‌లో ఫుజియామా తన ఎలక్ట్రిక్ స్కూటర్లను రెండు వేరియంట్లలో అందిస్తోంది. ఫుజియామా స్పెక్ట్రా మరియు కొత్త థండర్ ప్లస్‌లు లో-స్పీడ్‌ స్పీడ్ సెగ్మెంట్లలో ఉండగా.. క్లాసిక్ మరియు ఓజోన్ మోడళ్లు హై-స్పీడ్ ఆప్షన్ కింద సంస్థ విక్రయిస్తోంది.

క్లాసిక్ మోడల్ కంపెనీకి ప్రధాన ఉత్పత్తిగా ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. ఇందులో 3000 వాట్ల మోటారును ఉపయోగిస్తారు. ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో 2.05 కిలోవాట్ల బ్యాటరీ ఉంది. ఈ స్కూటర్‌ సేల్స్‌ రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కంపెనీ ఇతర సరికొత్త ఉత్పత్తులపై దృష్టి సారిస్తోంది.

సరసమైన మరియు అత్యాధునిక EVలను అందించాలనే లక్ష్యంతో ఫుజియామా పనిచేస్తోంది. దీనికి 100+ ప్రత్యేక డీలర్‌షిప్‌లు, 280+ కస్టమర్ టచ్‌పాయింట్‌లు ఉన్నాయి. కేవలం 10 నెలల్లో 28,000 యూనిట్లకు ఈ సంస్థకు చెందిన స్కూటర్లు సేల్‌ అయ్యాయి. 2028 నాటికి 25 దేశాలకు పైగా తమన మార్కెట్‌ని విస్తరించాలనే ప్రణాళికతో సంస్థ దూసుకుపోతుంది. తాజాగా విడుదల చేసిన లో-స్పీడ్‌ స్కూటర్లతో తన మార్కెట్‌ పెరుగుతుందని సంస్థ ఆశిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 16, 2024, 13:58 [IST]
English summary
Fujiyama electric launches slow speed thunder plus electric scooter features and spec details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+