Fujiyama EV Classic రూ. 79,999 కే క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 120 కి.మీ రేంజ్, బుకింగ్స్ ఓపెన్
భారత మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్(Electric Scooter) పరిచయమైంది. ఫుజియామా ఈవీ అనే సంస్థ తన సరికొత్త క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌ను పరిచయం చేసింది. అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందించేలా ఈ ఈవీని సిద్ధం చేసినట్లు సంస్థ వెల్లడించింది. ధర, ఫీచర్లు పూర్తి సమాచారం ఈ కథనంలో..
ఫుజియామా EV(Fujiyama EV Classic Electric Scooter) ప్రవేశపెట్టిన క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చినట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్.. అర్బన్ కమ్యూటర్లకు తమ రైడింగ్ అనుభూతిని మరో లెవెల్‌కు తీసుకెళ్తుందని తెలిపింది. మోటార్ మాత్రమే కాకుండా ఇందులో అందించిన ఫీచర్లు కూడా చాలా అధునాతనంగా ఉన్నాయి.

ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అత్యంత వేగంగా ఛార్జింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్లు ఫుజియామా పేర్కొంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. డిజైన్ పరంగా ఇందులో ట్విన్-బ్యారెల్ టైప్ LED లైట్ సెటప్ అందించారు. రోడ్డుపై స్పష్టమైన విజిబిలిటీ కోసం ముందు మాత్రమే కాకుండా రెండు వైపులా కూడా ప్రకాశించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ట్విన్-బారెల్ టైప్ ఎల్‌ఈడీ సెటప్ ద్వారా.. రాత్రిపూట కూడా సురక్షితమైన ప్రయాణాన్ని అందించేలా సంస్థ ఫుజియామా ఈవీ క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించింది. మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం ఇందులో కాంబి డ్రమ్ బ్రేక్ సిస్టమ్‌ను అందించారు. ఫీచర్స్ పరంగానే కాదు, లుక్ పరంగా కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అధునాతనంగా ఉంది.
క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ముందు భాగమే ఇందుకు నిదర్శనం. ముందు వైపున మాత్రమే కాకుండా స్కూటర్‌కు అన్ని వైపులా మరింత బలమైన బాడీ ప్యానెల్స్‌ను ఉపయోగించారు. కాగా Fujiyama EV Classic లో 3000 వాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది గరిష్ఠంగా గంటకు 60 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఫుల్ ఛార్జింగ్‌పై 120 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది.
Fuziyama EV Classic స్కూటర్‌లో అత్యుత్తమ రేంజ్‌ను అందించడం కోసం 2.05 kWh బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించారు. ఇది IoT ప్రారంభించబడిన లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్. ఇక ధర విషయానికొస్తే ఫుజియామా క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 79,999 ధరతో ప్రవేశపెట్టింది. భారత్‌లో ఈ స్కూటర్ బుకింగ్‌లను కూడా సంస్థ ప్రారంభించింది.
కస్టమర్లు రూ. 1,999 అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే, ఆ వివరాలను సంస్థ ప్రకటించలేదు. త్వరలో ఈ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఉన్న అధిక డిమాండ్ కారణంగా అతి తక్కువ ధరలో వస్తున్న Fujiyama EV Classic.. పోటీని ఏ మేరకు తట్టుకుంటుందో వేచి చూడాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








