తగ్గిన గోదావరి స్కూటర్ల ధరలు.. మళ్లీ ఈ ఆఫర్ వచ్చేది కష్టం గురూ!
పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో వాహనాల తాయరీ సంస్థలు ఒక్కొక్కటిగా డిస్కౌంట్‌లను ప్రకటిస్తున్నాయి. మాన్‌సూన్ (Monsoon Offer), ఫ్రీడమ్ ((Independence Day Offers), ఇతర వార్షిక ఆఫర్లతో మార్కెట్‌ని ఒడిసి పట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక్కో కంపెనీ రూ. 5000 నుంచి 2.5 లక్షల వరకు డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి. ప్రస్తుతం మాన్‌సూన్, ఫ్రీడమ్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ఆ తర్వాత దసరా, దీపావళి, క్రిస్‌మర్ ఆఫర్లను అందించనున్నారు. వాస్తవానికి పండుగ సీజన్‌ని టార్గెట్ చేస్తూ కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తాయి. అయితే ఇప్పుడు ఆఫర్లు ముందుగానే వచ్చేశాయ్. దేశంలోని ఎలక్ట్రిక్ టూవీలర్, త్రీ వీలర్స్‌ని ఉత్పత్తి చేస్తున్న వాహన తయారీ సంస్థ గోదావరి ఎలక్ట్రిక్ (Godavari Electric) కూడా మాన్‌సూన్ ఆఫర్‌ని ప్రకటించింది. ఆ వివరాలు ఈ కథనంలో..
గోదావరి ఎలక్ట్రిక్ సంస్థ ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీ ఆధారిత ద్విచక్ర వాహనాలు మరియు త్రీ వీలర్లను తయారు చేస్తుంది. ఈ సంస్థ నుంచి ఇబ్లూ బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఆ కంపెనీ లైనప్‌లోని ఇబ్లూ ఫియో, ఇబ్లూ ఫియో ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై క్యాష్ డిస్కౌంట్ ఆఫర్‌ని ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను రూ.10,000 తగ్గించింది.

మాన్‌సూన్ ధమాకా ఆఫర్ పేరుతో ఈ తగ్గింపుని అందిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు ఇబ్లూ స్కూటర్లను కంపెనీ విక్రయిస్తుంది. ఇందులో ఇబ్లూ ఫియో ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్ని వారాల క్రితమే మార్కెట్‌లో లాంచ్ కావడం గమనార్హం. రూ. 10,000 డిస్కౌంట్‌తో రూ .99,999 లుగా ఉన్న వీటి ధరలు రూ .89,999 లకు తగ్గాయి. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు.
అయితే ఈ మాన్‌సూన్ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే ఉండనుంది. ఈ క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ ఆగస్టు 31, 2024 వరకు అందుబాటులో ఉంటుందని గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ డీలర్‌షిప్ షోరూమ్‌లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

ఇటీవల విడుదలైన ఐబ్లూ ఫియో ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఢిల్లీలో జరిగిన 2024 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఈ స్కూటర్ 2.36 kWh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 110 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఈ స్కూటర్‌ని ఫుల్ ఛార్జ్ చేయడానికి 5 గంటల 25 నిమిషాలు పడుతుంది. ఇందులో ఎకానమీ, నార్మల్, పవర్ అనే మూడు రైడ్ మోడ్స్ ఉన్నాయి.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సియాన్ బ్లూ, వైన్ రెడ్, జెట్ బ్లాక్, డెలీ గ్రే, ట్రాఫిక్ వైట్ కలర్ ఆప్షన్‌లో కొనుగోలు చేయవచ్చు. దీనిలో కాంబీ బ్రేక్ సిస్టమ్ అందించారు. దీని ద్వారా హై స్పీడ్‌లోనూ స్కూటర్‌ని కంట్రోల్ చేయవచ్చు. సైడ్ స్టాండ్ అలర్ట్, 12 ఇంచెస్ వీల్స్, వస్తుంది. ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి.

7.4 ఇంచెస్ డిజిటల్ ఫుల్ కలర్ డిస్‌ప్లే, బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్‌కి కనెక్ట్ చేసుకుని యాక్సెస్ చేయవచ్చు. ఇందులో నావిగేషన్‌ని కూడా అందించారు. మొబైల్ ఫోన్‌ని ఛార్జ్ చేసుకునే పోర్ట్ సదుపాయం కూడా ఉంది. అంతే కాకుండా దీని సీటు కింద 28 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. బయటకు వెళ్తే సరుకులను ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకువెళ్లవచ్చు.
ఈ గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ దేశంలో 74 డీలర్‌షిప్ షోరూమ్‌లను కలిగి ఉంది. 2025 మార్చి నాటికి వీటి సంఖ్యను 100కు పెంచాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ కంపెనీ లైనప్‌లోని ఫియో స్కూటర్‌పై 3 ఏళ్లు లేదా 40,000 కి.మీ.. అలాగే ఫియో ఎక్స్‌పై 3 సంవత్సరాలు లేదా 30 వేల కిలోమీటర్ల వారంటీని అందిస్తుంది.


Click it and Unblock the Notifications








