Gogoro Pulse స్పోర్టీ లుక్‌, హైటెక్‌ ఫీచర్ల ప్యాక్‌తో గొగొరో పల్స్ ఇ స్కూటర్‌ ఆవిష్కరణ

భారత మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ పరిచయమైంది. తైవాన్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ స్టార్టప్‌.. గొగోరో దాని అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. కొత్త పల్స్ ఇ స్కూటర్‌(Pulse E Scooter)ను ప్రీమియం లుక్‌, అధిక పనితీరుతో త్వరలో లాంచ్‌ చేస్తున్నట్లు గొగొరో(Gogoro) వెల్లడించింది.

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల హవా నడుస్తోంది. అర్బన్‌ ప్రయాణికులే లక్ష్యంగా స్టార్టప్‌లు ఈ రంగంలో అడుగుపెట్టి సరికొత్త ఫీచర్లు, మోడళ్లతో అధునాతన స్కూటర్లను ప్రవేశపెడుతున్నాయి. అంతే కాకుండా అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ స్టైలిష్‌ డిజైన్‌, ఆకర్షణీయమైన ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.

Gogoro-Pulse-E-Scooter-Unveil

ఈ క్రమంలో ఎలక్ట్రిక్‌ సెగ్మెంట్‌లో మరో స్టార్టప్‌ గొగొరో.. కొత్త పల్స్‌ ఇ స్కూటర్‌ను తీసుకువచ్చింది. స్మార్ట్‌గా కనిపించేలా.. ఆకర్షణీయమైన పనితీరుతో రైడర్ల కోసం దీనిని సంస్థ అందిస్తోంది. స్టైలింగ్‌ బ్రాండ్‌లో పల్స్‌ ఇ స్కూటర్‌ తిరుగులేనిదిగా రానుంది. ఇక ఇందులోని ఫీచర్లు, డిజైన్‌, బ్యాటరీ ప్యాక్‌ విషయానికొస్తే..

గొగొరో పల్స్‌ ఇ స్కూటర్‌.. ఫాసియా మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్‌ను కలిగి ఉంటుంది. ఈ యూనిట్ 13 సింగిల్ LEDలను కలిగి ఉండటంతో పాటు.. స్పీడ్‌, విజిబిలిటీ ఆధారంగా ఆటోమేటిక్‌గా ఎల్‌ఈడీ హెడ్‌లైట్ల కాంతి సర్దుబాటు చేయబడుతుుంది. టెయిల్‌ లైట్లతో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

Gogoro-Pulse-E-Scooter-Unveil

ఫీచర్ల పరంగా గోగోరో పల్స్ ఇ స్కూటర్‌లో.. స్నాప్‌డ్రాగన్ QWM2290 ప్రాసెసర్ ద్వారా ఆధారితమైన 10.25-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ డ్యాష్‌బోర్డ్‌ను అమర్చారు. సాధారణ రైడ్ డేటాతో పాటు రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లతో టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను ఈ డ్యాష్‌బోర్డ్‌ ప్రదర్శిస్తుంది. బ్లూటూత్‌ కనెక్టివిటీ ద్వారా అనేక రకాల ఫీచర్లను ఈ క్లస్టర్‌ ద్వారా ఉపయోగించుకోవచ్చు.

పవర్‌ట్రెయిన్‌ పరంగా కొత్త పల్స్‌ ఇ స్కూటర్‌.. ఎయిర్-కూల్డ్ హైపర్ డ్రైవ్ H1 మోటార్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ మోటార్ గరిష్టంగా 9kW పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా 3 సెకన్లలో 0 నుంచి 50 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

Gogoro-Pulse-E-Scooter-Unveil

రైడర్‌ అవసరాలకు అనుగుణంగా పల్స్‌ ఇ స్కూటర్‌లో ఆరు రైడింగ్ మోడ్‌లను గొగొరో ప్రవేశపెట్టింది. సిటీ, టూరింగ్, ట్రాక్, రేంజ్, డర్ట్ మరియు కస్టమ్ రైడింగ్‌ మోడ్‌లను రైడర్లను సద్వినియోగం చేసుకోవచ్చు. అంతేకాకుండా పల్స్‌ ఇ స్కూటర్‌లో స్టాండర్డ్‌గా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను సంస్థ అందిస్తోంది.

New Pulse E Scooter ను గోగోరో ఈ ఏడాది భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. లాంచ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారాన్ని సంస్థ వెల్లడించలేదు. కాగా ధర, రేంజ్‌కు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. కానీ పల్స్‌ ఇ స్కూటర్‌ స్టైలింగ్‌ మరియు స్పెసిఫికేషన్లను చూస్తే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రియులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Gogoro-Pulse-E-Scooter-Unveil

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, February 15, 2024, 11:01 [IST]
English summary
Gogoro unveils new pulse e scooter with sporty and high tech features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+