ఓలా S1X కంటే తక్కువ ధరలో GT ఫోర్స్ ఇ కొత్త స్కూటర్లు లాంచ్.. ధర చూస్తే వెంటనే కొనేస్తారు

ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీదారులలో ఒకటైన GT ఫోర్స్, భారత మార్కెట్లో అమ్మకానికి సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లను పరిచయం చేసింది. ఏకంగా నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లను విడుదల చేసింది. అవి జీటీ వెగాస్, జీటీ రైడ్ ప్లస్, జీటీ వన్ ప్లస్ ప్రో మరియు జీటీ డ్రైవ్ ప్రో. ధరలు, ఫీచర్లు పూర్తి వివరాలు ఈ కథనంలో..

జీటీ ఫోర్స్ హై-స్పీడ్ వెర్షన్ మరియు లో-స్పీడ్ వెర్షన్ రెండూ మిక్స్డ్ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇది రూ. 55,555 నుండి రూ. 84,555 వరకు ధరలలో సంస్థ తీసుకువచ్చింది. పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఈ స్కూటర్లను సునాయాసంగా నడపవచ్చని GT ఫోర్స్ పేర్కొంది.

GT-Force-New-Electric-Scooters-Launch

అత్యంత సరసమైన ధరలో అందుబాటులో ఉన్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ముఖ్యంగా గృహిణులు, కళాశాలకు వెళ్లే విద్యార్థులు, ఐటీ కంపెనీ ఉద్యోగులు, ఇతర కార్యాలయ సిబ్బంది ఇలా ప్రతి ఒక్కరూ వినియోగించేలా ఈ వాహనాలను సిద్ధం చేసినట్లు జీటీ ఫోర్స్ వెల్లడించింది. ఇక ఒక్కో స్కూటర్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే..

GT వెగాస్: ఇది తక్కువ వేగంతో రూపొందించబడిన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో PLDC మోటారు వినియోగించారు. దీని గరిష్ఠ వేగం గంటకు 25 కిమీ మాత్రమే కావడంతో చాలా తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి. దీనికి రిజిస్ట్రేషన్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం ఉండకపోవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 1.5 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. ఈ బ్యాటరీ ప్యాక్‌ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4-5 గంటలు మాత్రమే తీసుకుంటుంది. ఇది ఫుల్ ఛార్జింగ్‌పై 70 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. అలాగే, ఇది 150 కిలోల వరకు వస్తువులను మోయగలదు. స్కూటర్ మొత్తం బరువు 88 కిలోలు మాత్రమే.

GT వెగాస్ స్కూటర్ ఖరీదు రూ. 55,555 ఉంది ఈ ఇ-స్కూటర్ మోడల్‌ను ఆరెంజ్, రెడ్ మరియు గ్రే కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా, GT వేగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై 5 సంవత్సరాల లేదా 60,000 కి.మీ వారంటీని సంస్థ అందిస్తోంది.

GT రైడ్ ప్లస్: ఇది చాలా స్లిమ్ స్పోర్టీ లుక్‌తో కూడిన ఇ-స్కూటర్ మోడల్. ఇందులో 2.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగిించారు. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 95 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. దీని గరిష్ఠ వేగం కూడా గంటకు 25 కిమీ మాత్రమే. కాబట్టి దీన్ని నడపడానికి కూడా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం ఉండకపోవచ్చు.

GT రైడ్ ప్లస్ ధర మార్కెట్లో రూ. 65,555 ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ బ్లూ, సిల్వర్ మరియు గ్రే కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం బరువు 90 కిలోలు కాగా ఇందులో అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

GT One Plus Pro: GT ఫోర్స్ విడుదల చేసిన స్కూటర్లలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఇది. ఇది గంటకు 70 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. అలాగే, ఇది 180 కిలోల వరకు బరువును మోయగలదు. అలాగే, పూర్తి ఛార్జింగ్‌పై 110 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది.

GT One Plus Pro స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 నుండి 5 గంటలు మాత్రమే తీసుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ధర రూ. 76,555 ఉంది. కలర్స్ విషయానికొస్తే బ్లాక్, బ్లూ మరియు బ్రౌన్ కలర్ ఆప్షన్‌లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది.

GT Drive Pro: జీటీ ఫోర్స్ విడుదల చేసిన అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ జీటీ డ్రైవ్ ప్రో. ధర రూ. 84,555 ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్‌పైై 110 కి.మీ రేంజ్ ఇస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 70 కి.మీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 2.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 15, 2024, 19:36 [IST]
English summary
Gt force launches new 4 electric scooters at affordable prices check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+