మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌.. సిటీలో ఉండే వారికి బెస్ట్‌ ఆప్షన్‌!!

భారతదేశంలో లభించే ఎలక్ట్రిక్ టూవీలర్స్‌లో ఎక్కువగా స్కూటర్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే బైకుల సంఖ్యను మాత్రం వేళ్ల మీద లెక్కించవచ్చు. స్కూటర్లతో పోల్చితే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్‌లను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేయడం లేదు. బ్యాటరీ, మోటార్‌ ఇతర పరికరాల అమరిక స్కూటర్లలో సులువుగా చేయవచ్చు. ఇవి బైక్‌లో చొప్పించడం చాలా కష్టం. అందుకే ఎక్కువగా ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌లో స్కూటర్లు పుట్టుకొస్తున్నాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే తాజాగా కొత్త ఎలక్ట్రిక్ బైకులు కూడా మార్కెట్‌లో అడుగుపెడుతున్నాయి. జీటీ ఫోర్స్‌ ఈవీ నుంచి జీటీ టెక్సా ఈవీ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ పూర్తి వివరాలు ఈ కథనంలో మీ కోసం..

జీటీ ఫోర్స్ ఈవీ భారతదేశంలో గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. తాజాగా జీటీ లైనప్‌లో టెక్సా ఈవీ బైక్‌ని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఆ కంపెనీకి దేశంలో గల రెండు తయారీ కేంద్రాల ద్వారా నెలకు 5,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ఈ సంస్థ కలిగి ఉంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఎలక్ట్రిక్ బైక్‌ని రూపొందించినట్లు ఆ సంస్థ తెలిపింది.

GT-Texa-EV-Bike-Launches-In-India

ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కంపెనీ జీటీ లైనప్స్‌లో వెగాస్, జీటీ రైడ్ ప్లస్, జీటీ వన్ ప్లస్ ప్రో మరియు జీటీ డ్రైవ్ ప్రో వంటి మోడళ్లను విక్రయిస్తుంది. తాజాగా ఈ కంపెనీ తూసుకువచ్చిన జీటీ టెక్సా ఈవీ ముఖ్యంగా రద్దీగా ఉండే నగర రోడ్లకు రోజువారీ వినియోగానికి ఇది అనువుగా ఉంటుందని జీటీ ఫోర్స్‌ తెలిపింది. జీటీ టెక్సా 3.5 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది.

ఈ బైక్‌ ఫుల్‌ ఛార్జ్‌పై 120-130 కిలోమీటర్ల పరిధిని అందించనుంది. ఈ బ్యాటరీ ఇన్సులేటెడ్ BLDC (Brushless Direct Current) ద్వారా మోటారుకు శక్తినిస్తుంది. ఈ శక్తి బైక్‌ని గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నడిపిస్తుంది. ఆటోకట్‌తో కూడిన మైక్రో ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 4-5 గంటల్లో ఈ బైక్‌ని ఫుల్‌ ఛార్జ్ చేయవచ్చు. ఈ బైక్ 180 కిలోల లోడ్‌ని మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

GT-Texa-EV-Bike-Launched

జీటీ టెక్సా ఎలక్ట్రిక్ బైక్‌ని 18 డిగ్రీల వంపు ఉన్న రోడ్లపై కూడా నడపవచ్చు. నలుపు లేదా ఎరుపు రంగుల్లో ఈ-బైక్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రయాణీకుల భద్రత కోసం ముందు మరియు వెనుక డిస్క్ బ్రేకులతో వస్తుంది. అదనపు భద్రత కోసం ఈ బైక్ లో ఇ-ఎబిఎస్ కంట్రోలర్ కూడా ఉంది. రిమోట్ లేదా కీతో బైక్‌ని స్టార్ట్ చేయవచ్చు.

17.78 సెంటీమీటర్ల ఎల్ఈడీ డిస్ప్లేతో హ్యాండిల్‌బార్‌ మధ్యలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ డిస్ప్లే ద్వారా రైడర్ అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. డిజిటల్ స్పీడోమీటర్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్‌, టెయిల్‌లైట్‌, టర్న్ సిగ్నల్ ల్యాంప్స్, డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ బరువు కేవలం 120 కిలోలు మాత్రమే. ఈ బైక్ ధర రూ. 1.19 లక్షల (Ex-Showroom) వద్ద కొనుగోలు చేయవచ్చు.

GT-Force-GT-Texa-EV-Bike

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, June 26, 2024, 16:44 [IST]
English summary
Gt force launches new gt texa ev motorcycle at rs 1 19 lakhs full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+