సెలబ్రిటీలే కాదు మీరు ఫేమస్ హార్లే డేవిడ్‌సన్ లగ్జరీ బైక్‌ని కొనచ్చు.. మీ దగ్గర ఇంత డబ్బుంటే సరిపోతుంది!

ఇండియాలో లగ్జరీ బైకుల వాడకం క్రమంగా పెరుగుతుంది. ప్రజల ఆదాయ స్థితుల్లో మార్పులు రావడంతో చాలా మంది ఎక్కువ ధరల్లో లభించే బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. భారత్ ఒకప్పుడు సాధారణ బైకులకు మాత్రమే పేరుగాంచింది. అలాంటి సమయంలో ఖరీదు ఎక్కువగా ఉండే బైకులను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో వీటి డిమాండ్ చాలా వరకు తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు మారిపోయాయి. నగరాల నుంచి మొదలుకుని చిన్న గ్రామాల్లో కూడా లగ్జరీ బైకులు కంటపడుతున్నాయి. వీటి డిజైన్, భారీ ఇంజిన్ సామర్థ్యం, ఫీచర్లతో అందరి మనసులను దోచుకుంటున్నాయి. ఇండియన్ మార్కెట్లో లగ్జరీ బైకుల వినియోగం పెరగడంతో అంతర్జాతీయ కంపెనీలు క్యూ కట్టి బైకులకు దేశీయంగా లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా లగ్జరీ బైకుల తయారీ సంస్థ హార్లే డేవిడ్‌సన్‌(Harley Davidson) భారత మార్కెట్‌పై కన్నేసి కొత్త మోడళ్లను తీసుకొస్తుంది.

సాధారణంగా హార్లే డేవిడ్‌సన్‌ బైకులు అత్యంత ఖరీదుతో ఉంటాయి. వీటిని ఎక్కువగా ధనవంతులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల పిల్లలు, క్రికెటర్లు, సెలబ్రిటీలు వంటి వారు కొనుగోలు చేస్తుంటారు. వీటి ధరలు చెల్లించడం అంటే మామూలు మధ్యతరగతి వారికి సాధ్యపడదు. అందుకే ఇవి ఎక్కువగా ధనవంతుల చేతుల్లో మాత్రమే కనబడుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో కంపెనీ ఆలోచన ధోరణి మారింది. అందరికీ అందుబాటు ధరలో మోడళ్లను తీసుకొస్తుంది.

Harley Davidson X440 Features

ఈ నేపథ్యంలో కంపెనీ భారతీయ వినియోగదారుల కోసం అందుబాటు ధరలో 'హార్లే డేవిడ్‌సన్‌ ఎక్స్440(Harley-Davidson X440)' బైక్‌ను తీసుకొచ్చింది. ఇది చాలా తక్కువగా రూ.2.39 లక్షల ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. గరిష్టంగా అయితే రూ. 2.79 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) కొనుగోలుకు లభిస్తుంది. ఈ రేంజ్‌లో హార్లీ డేవిడ్‌సన్ బైకు లభించడం అంటే మామూలు విషయం కాదు.

ఇప్పటికే ఇండియా మార్కెట్లో అమ్ముడవుతున్న లోకల్ కంపెనీల లగ్జరీ బైకులన్నీ కూడా ఇంచుమించు ఇదే ధరలో అందుబాటులో ఉండగా, అంతర్జాతీయ బ్రాండ్ అయిన హార్లీ డేవిడ్‌సన్ తన బైకును దేశీయ వినియోగదారుల కోసం ఈ ధరకు అందిస్తుండటంతో ఇది భారతీయ కస్టమర్లకు బాగా చేరువయ్యే అవకాశం ఉంది. బ్రాండ్‌కు తగ్గట్టుగానే ఇది అదిరిపోయే లుక్‌ను కలిగి ఉంది.

Harley Davidson X440 Price Features All Details

హార్లే డేవిడ్‌సన్‌ ఎక్స్440 ముదురు సిల్వర్, డార్క్ రెడ్ కలర్‌తో పాటు సహా మరిన్ని అనేక ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 440cc పెట్రోల్ ఇంజిన్‌ ఆప్షన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 27.37 bhp పవర్, 38 nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, లీటర్ పెట్రోల్‌పై దాదాపు 35 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

ఈ బైక్‌లో చాలా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో బ్లూటూత్ కనెక్టివిటీ, LED - లైటింగ్ సెటప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కాల్, మ్యూజిక్ కంట్రోల్, ఎంత దూరం ప్రయాణించిన కూడా ఇబ్బంది లేకుండా ఉండే మెత్తని సీటు, యాంబియంట్ లైట్, ఎత్తుపల్లాలు ఉన్న రోడ్లపై కూడా ప్రయాణించేలా ముందు 43mm USD డ్యూయల్ కార్ట్రిడ్జ్ ఫోర్క్స్, వెనుక ట్విన్ షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది.

Harley Davidson X440 Launch

బైక్ బరువు 190.5 కిలోలుగా ఉంది. దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 13.5 లీటర్లుగా ఉంది. హార్లే డేవిడ్‌సన్‌ నుంచి ఎక్స్440 మోడల్ మాత్రమే కాకుండా ఇండియాలో స్పోర్ట్‌స్టర్ ఎస్ అనే వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ. 16.49 లక్షలు ఎక్స్-షోరూమ్. ఇది 1252 cc పెట్రోల్ ఇంజిన్‌తో, లీటర్ పెట్రోల్‌కు దాదాను 19.6 km మైలేజీని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 20, 2024, 16:22 [IST]
English summary
Harley davidson x440 bike price features and all details check here
Read more on: #harley davidson #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+