స్పోర్ట్స్ బైక్‌ను మించిన స్కూటర్లను చూశారా.??.. అడ్వెంచరస్ రైడింగ్‌లో వీటికి తిరుగు లేదు.!!
స్పోర్ట్స్ బైక్ అంటే ఇష్టపడని యూత్ ఉండరు. ఖరీదు ఎక్కువైనా సరే వాటిపై అడ్వెంచరస్ రైడ్ చేయాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ ఆ కలలను చాలా మంది నెరవేర్చుకోలేరు. ఎందుకంటే అంత ధర పెట్టి కొనే స్తోమత లేని వారు.. వెనుకడుగు వేస్తారు. అయితే ఈ స్కూటీల ద్వారా స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న ఫీలింగ్‌ను ఆస్వాదించవచ్చు.
భారత మార్కెట్‌లో స్పోర్ట్స్ బైక్(Scooters List More Powerful Than Sports Bikes)ను మించిన కెపాసిటీతో స్కూటర్లు ఉన్నాయని మీకు తెలుసా.. వీటిపై మీరు రైడింగ్‌కు వెళ్తే ఇక ఆ బైక్‌ల ఊసు ఎత్తరేమో.. ఇంతకీ ఆ స్కూటర్లేంటి.?? వాటి పర్ఫామెన్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారా.?? ఆ స్కూటర్ల సమాచారం ఈ కథనంలో అందిస్తున్నాం.

అప్రిలియా SRV 850: స్పోర్ట్స్ బైక్ తరహా రైడింగ్ అనుభూతిని అందించే ఉత్తమ స్కూటర్ Aprilia SRV 850. ఈ స్కూటర్ 2012 నుంచి 2016 మధ్యలో మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ ఇటాలియన్ బ్రాండ్ V ట్విన్ ఇంజన్‌తో పనిచేస్తుంది. దాదాపు 76 hp శక్తిని మరియు 76 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
BMW C 650 GT: 2012 సంవత్సరంలో జర్మన్ బ్రాండ్ నుంచి అరంగేట్రం చేసిన స్కూటర్ BMW C 650 GT. దీనిని స్టీల్ ట్యూబింగ్ మరియు అల్యూమినియం భాగాల మిశ్రమంతో రూపొందిన ఛాసిస్ ఆధారంగా రూపొందించారు. ఇది 647 సీసీ, ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 60hp శక్తిని మరియు 62 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా X- ADV: గ్లోబల్ మార్కెట్లో జపనీస్ ఆటోమేకర్ హోండా విక్రయిస్తున్న ది బెస్ట్ స్కూటర్ Honda X-ADV. ఇది ఆఫ్- రోడ్ సామర్థ్యంతో పనిచేస్తుంది. ఈ స్కూటర్ 745 CC, ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 57 hp శక్తిని మరియు 69 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
సుజుకి బర్గ్‌మాన్ 650: జపనీస్ ఆటో మేకర్ సుజుకి విక్రయిస్తున్న మ్యాక్సీ స్కూటర్ Burgman 650. రైడర్ సౌకర్యం కోసం దీనిని పెద్దదిగా రూపొందించారు. 2003 లో లాంచ్ అయిన ఈ స్కూటర్.. 650 cc సమాంతర ట్విన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 56 hp శక్తిని మరియు 61 nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కిమ్కో AK550: స్పోర్టీ డిజైన్‌తో మ్యాక్సీ- స్కూటర్‌గా విడుదలైన Kymco AK550.. యూత్ ఫేవరెట్ స్కూటర్. ఇది 550 CC ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ స్కూటర్ 55 bhp శక్తిని మరియు 56.64 nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
హోండా సిల్వర్ వింగ్: 2003 లో మార్కెట్‌లో లాంచ్ అయిన Honda Silver Wing.. పర్ఫామెన్స్, డిజైన్, లుక్ పరంగా స్పోర్ట్స్ బైక్‌ను తలపిస్తుంది. ఈ బ్రాండ్ 582 CC వాటర్ కూల్డ్ ట్విన్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. పవర్‌ట్రెయిన్ 48 HP పవర్ మరియు 53 NM గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








