Hero Karizma CE001 హీరో మోటోకార్ప్‌ నుంచి కరిజ్మా CE స్పెషల్‌ ఎడిషన్‌.. స్పెషల్‌ ఫీచర్లు ఇవే.!!

హీరో మోటోకార్ప్‌ నుంచి తాజాగా హీరో వరల్డ్‌ 2024 లో మరో బైక్‌ పరిచయం అయింది. భారత మార్కెట్లో కరిజ్మా CE ను ప్రత్యేక ఎడిషన్‌గా ప్రవేశపెట్టింది. ఈ బైక్‌ను పరిమిత సంఖ్యలో మాత్రమే ఉత్పత్తి చేయనుంది. కరిజ్మా XMR హీరో మోటోకార్ప్ విక్రయించే ముఖ్యమైన ద్విచక్ర వాహన (బైక్) మోడళ్లలో ఒకటి.

హీరో వరల్డ్ అనే ప్రోగ్రామ్ ద్వారా హీరో మోటోకార్ప్‌ ఈ బైక్‌ను ప్రదర్శించింది. కరిజ్మా CE001 పేరుతో స్పెషల్‌ ఎడిషన్‌ను ప్రారంభించింది. హీరో మోటోకార్ప్ వ్యవస్థాపకుడు బ్రిజ్‌మోహన్ లాల్ ముంజాల్ 100వ జన్నదినోత్సాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక ఎడిషన్‌ను రూపొందించి ప్రారంభించింది. కాగా ఈ బైక్ చాలా పరిమిత సంఖ్యలో అంటే దాదాపు 100 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అవుతాయి.

Hero-Karizma-CE001

హీరో కరిజ్మా CE001(Hero Karizma CE001).. 100 యూనిట్లు వచ్చే జూలై నెలలో అమ్మకానికి రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్పెషల్ ఎడిషన్‌కు, రెగ్యులర్ ఎడిషన్ కరిష్మాకు పెద్దగా తేడాలు ఏమీ లేవని గమనించాలి. కాగా స్పెషల్ ఎడిషన్ క్వార్టర్ ఫెయిరింగ్‌తో రూపొందించారు. ఇందులో క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్ అందించలేదు. అయితే, కరిష్మా XMR క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్‌ను ఉపయోగిస్తుంది.

దీనితో పాటు, ఈ హీరో కరిజ్మా CE001(Hero Karizma CE Special Edition) స్పెషల్‌ ఎడిషన్‌లో బ్రిజ్మోహన్ ముఖం కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇంజిన్ విషయానికి వస్తే, ఈ బైక్‌లో 210 సీసీ సింగిల్ సిలిండర్ మోటార్ ఉపయోగించారు. ఇది గరిష్ఠంగా 25.5 PS శక్తిని మరియు 20.4 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

Hero-Karizma-CE001

సాధారణ కరిజ్మా XMR వేరియంట్‌లో కూడా ఇదే ఇంజిన్‌ని ఉపయోగించారు. ఈ బైక్‌లో బ్రేకింగ్‌ విషయానికొస్తే.. ముందు చక్రంలో 300 mm డిస్క్ మరియు వెనుక చక్రంలో 230 mm డిస్క్ ఉన్నాయి. సస్పెన్షన్ సెటప్‌ విషయానికొస్తే కరిజ్మా CE 001 స్పెషల్‌ ఎడిషన్‌ బైక్ UST ఫోర్క్ మరియు గ్యాస్ చార్జ్డ్ మోనోషాక్‌ను కలిగి ఉంటుంది.

అదేవిధంగా, కరిజ్మా CE మరియు కరిజ్మా XMR రెండూ స్పెసిఫికేషన్ల పరంగా ఒకేలా ఉంటాయి. కరిష్మాపై ప్రొజెక్టర్-శైలి LED హెడ్‌ల్యాంప్‌లు అందించారు. ఇందులో ఆటోమేటిక్ ఆన్ మరియు ఆఫ్ ఫీచర్‌ను చూడవచ్చు. అంతే కాకుండా, హజార్డ్ స్విచ్, బ్యాక్-లైట్ స్విచ్ గేర్, LED టైల్‌లైట్, LED టర్న్ ఇండికేటర్లు ఇంకా కొత్త LCD డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు.

ఈ స్క్రీన్ బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. ఈ సదుపాయంతో సెల్ ఫోన్‌ను స్క్రీన్‌కు కనెక్ట్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఈ స్క్రీన్ ద్వారా సెల్ ఫోన్‌కు వచ్చే కాల్స్, మెసేజ్‌లను కూడా తెలుసుకునే వీలు ఉంటుంది. ఇది కాకుండా, ఈ స్క్రీన్ నావిగేషన్, గేర్ పొజిషన్, ట్రిప్ మీటర్ మరియు మైలేజ్‌ గురించి పూర్తి వివరాలను ప్రదర్శిస్తుంది.

ఆసక్తి గల కస్టమర్లు హీరో కరిజ్మా CE001 ను Hero Motorcorp వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అయితే దీన్ని ఎలా విక్రయిస్తారనే దానిపై స్పష్టత లేదు. ప్రత్యేక ఎడిషన్‌ కావడంతో ఈ బైక్‌ను రాఫెల్ లేదా వేలం ద్వారా విక్రయించవచ్చని తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, January 26, 2024, 13:54 [IST]
English summary
Hero karizma ce001 special edition showcased at hero world 2024 limited to 100 units
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+