మొదలైన Hero Mavrick 440 బైక్ డెలివరీస్.. బుక్ చేసుకున్న వారికి పండగే!
గత కొన్ని రోజులకు ముందు దేశీయ విఫణిలో లాంచ్ అయిన హీరో మోటోకార్ప్ కంపెనీ యొక్క 'మావ్రిక్ 440' డెలివరీలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ పవన్ మంజూల్ గురుగ్రామ్‌లోని హీరో ప్రీమియం అవుట్‌లెట్‌లో కస్టమర్లకు 'కీ'లను అందించారు.
కొత్త హీరో మావ్రిక్ 440 బైక్ ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయింది. మిడిల్ వెయిట్ సెగ్మెంట్‌లో అడుగుపెట్టిన ఈ బైక్ మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ మరియు అత్యాధునిక టెక్నాలజీ వంటి వాటిని పొందుతుంది. ఈ బైక్ ప్రారంభ రూ. 1,99,000 కాగా, మిడ్ వేరియంట్ ధర రూ. 2,14,000 మరియు టాప్ వేరియంట్ ధర రూ. 2,24,000 (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది.

హీరో మావ్రిక్ 440 కంపెనీ యొక్క మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా చాలా భిన్నంగా చూడగానే ఆకర్శించే డిజైన్ పొందుతుంది. మొదటి బ్యాచ్ డెలివరీ పొందిన కస్టమర్లతో ఎవరైతే మార్చి 15 లోపల మావ్రిక్ 440 బుక్ చేసుకున్నారో.. వారికి 'వెల్‌కమ్ టు మావ్రిక్ క్లబ్ ఆఫర్' లభిస్తుంది. దీనికింద కస్టమర్లు రూ. 10000 విలువైన కస్టమైజ్డ్ యాక్ససరీస్ మరియు మర్చండైజ్ కిట్ వంటి వాటిని అందుకుంటారు.
హీరో మావ్రిక్ 440 బైక్ 440 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6000 rpm వద్ద 27 Bhp పవర్ మరియు 4000 rpm వద్ద 36 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ మరియు స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో లభిస్తుంది. దీంతో బైక్ ఉత్తమ పనితీరుని అందిస్తుంది.

మూడు వేరియంట్లలో లభించే హీరో మావ్రిక్ 440 బైక్ ఐదు కలర్ ఆప్షన్స్ పొందుతుంది. ఆర్కిటిక్ వైట్ (బేస్ వేరియంట్), సెలెస్టియల్ బ్లూ మరియు ఫియర్‌లెస్ రెడ్ (మిడ్ వేరియంట్), ఫాంటమ్ బ్లాక్ మరియు ఎనిగ్మా బ్లాక్ (టాప్ వేరియంట్). ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇందులో కష్టమర్ తనకు నచ్చిన కలర్ బైక్ కొనుగోలు చేసుకోవచ్చు.
కంపెనీ ఈ బైక్ యొక్క డిజైన్ మరియు పర్ఫామెన్స్ మీద మాత్రమే కాకుండా.. సౌకర్యవంతమైన రైడింగ్ అందించడం మీద కూడా దృష్టి పెట్టింది. ఈ బైకులోని స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ మరియు ఈసిమ్ బేస్డ్ కనెక్టివిటీ ద్వారా రియల్ టైమ్ ఇన్ఫర్మషన్ వంటి ఫీచర్స్ ఉండటం వల్ల రైడర్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు. వీటితో పాటు మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి.

హీరో మావ్రిక్ 440 బైక్ సుదూర ప్రాంతాలకు మాత్రమే కాకుండా రోజు వారీ వినియోగానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మంచి రైడింగ్ పొజిషన్, విశాలమైన సీటు, విశాలంగా ఉండే లెగ్‌రూమ్, ఆప్టిమైజ్డ్ గ్రాబ్ రైల్స్ వంటివి ఈ బైకులో ఉంటాయి. ఇవన్నీ ఉండటం వల్ల ఈ బైక్ ఒక్క చూపుతోనే వాహన ప్రేమికుల మనసు దోచేస్తుంది. ఈ కారణంగానే ఎక్కువమంది ఈ బైక్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








