Hero Mavrick 440 మోటార్‌సైకిల్‌ ఆవిష్కరణ.. ఆకర్షణీయ డిజైన్‌ సహా కీలక ఫీచర్లు..!

హీరో మోటాకార్ప్‌ ఇవాళ జరిగిన హీరో వరల్డ్‌ ఈవెంట్‌తో Hero Mavrick 440 మోటార్‌ సైకిల్‌ను ఆవిష్కరించింది. హీరో- హార్లే డేవిడ్‌సన్‌ భాగస్వామంలో ఇదివరకే ఒక మోడల్‌ అందుబాటులోకి రాగా.. హీరో మావ్రిక్‌ 440 రెండవది. ఈ బైక్‌ హార్లే డేవిడ్‌సన్‌ X440 ఆధారంగా హీరో కొత్త బైక్‌ను రూపొందించారు. ఇదే ఈవెంట్‌లో కొత్త ఎక్స్‌ట్రీమ్ 125R బైక్‌ను లాంచ్‌ చేసింది.

మూడు వేరియంట్లలో హీరో Mavrick 440 బైక్‌ : హీరో Mavrick 440 మోటార్‌ సైకిల్‌ మూడు వేరియంట్లు సహా 5 రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఫ్యూయల్‌ ట్యాంక్‌, LED DRLలతో కూడిన హెడ్‌ల్యాంప్ వైడ్‌ హ్యాండిల్‌ బార్‌, స్కూప్‌ అవుట్‌ సింగిల్‌ పీస్‌ సీట్లు, బైక్‌ టెయిల్‌ ఆకర్షణీయంగా ఉంటుంది. ట్యూనింగ్‌ ఫోర్క్‌, స్టైల్‌ అల్లాయ్‌ వీల్స్‌ ఎగ్జాస్ట్‌ ఆకట్టుకుంటాయి.

Hero Maverick 440 Motorcycle unveiled in india

హీరో Mavrick 440 మోటార్‌ సైకిల్‌ కీలక ఫీచర్లు : హీరో మావ్రిక్‌ 440 బైక్‌ LCD ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లేలో మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌, టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌, కాల్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో వస్తుంది. కనెక్టివిటీ యాప్‌లను మొబైల్ యాప్‌ ద్వారా కనెక్ట్‌ చేసుకోవచ్చు.

హార్లే డేవిడ్‌సన్‌ X440 440cc సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌/ ఆయిల్‌కూల్డ్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 2000rpm వద్ద 90 శాతం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే హీరో Mavrick 440.. హార్లే డేవిడ్‌సన్‌ కంటే భిన్నమైన సస్పెన్షన్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. 43mm టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ ఫోర్క్‌లు, వెనుకవైపు మోనోషాక్‌ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది. డ్యూయల్‌ ఛానల్‌ ABSతో ముందు, వెనుకవైపు డిస్క్‌ బ్రేకులను కలిగి ఉంటుంది.

Hero Mavrick 440 bike unveiled in hero world event

హీరో Mavrick 440 బైక్‌ ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానున్నాయి. డెలివరీలు ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానున్నాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, జావా 350, హోండా CB350, హార్లే డేవిడ్‌సన్‌ X440 వంటి మోటార్‌సైకిళ్లతో పోటీపడనుంది. హీరో ప్రీమియా డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ ద్వారా విక్రయించబడుతుంది. ఇదే నెట్‌వర్క్ హార్లే డేవిడ్‌సన్‌ X440, హీరో కరిజ్మా XMR, vida V1 వంటి బైక్‌లను ఇదే నెట్‌వర్క్ విక్రయిస్తోంది.

హీరో Mavrick 440 ధర అంచనా : హీరో Mavrick 440 మోటార్‌ సైకిల్‌ ధర సుమారు రూ.2 లక్షల ఉంటుంందని భావిస్తున్నారు. ఈ బైక్‌ ముందస్తు బుకింగ్‌ లు ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈబైక్ గురించి మరిన్ని స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Hero Mavrick 440 bike unveiled in hero world event 2024

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 23, 2024, 16:45 [IST]
English summary
Hero mavrick 440 bike unveiled and bookings to open from february 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+