రూ. 79,000 కే హీరో Pleasure Plus Xtec Sports వేరియంట్ లాంచ్.. ఫీచర్లు అదరహో.!!
భారత మార్కెట్లో మరో కొత్త స్కూటర్ విడుదలైంది. ప్రముఖ ద్విచక్ర తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ నుంచి ఇప్పటికే అందుబాటులో ఉన్న తన ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ మోడల్‌కు స్పోర్ట్స్‌ను వేరియంట్‌ను జత చేసింది. Hero తన Pleasure Plus Xtec Sports వేరియంట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
హీరో మోటోకార్ప్ తన పోర్ట్‌ఫోలియోలో కొత్త Xtec స్పోర్ట్స్ వేరియంట్‌ను తీసుకురావడం ద్వారా ప్లెజర్ ప్లస్(Hero Pleasure Plus) లైనప్‌ను మరింతగా విస్తృతం చేసింది. భారత మార్కెట్లో ఈ స్కూటర్ ధర రూ. 79,738 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. ఈ మోడల్ Xtec లోని స్టాండర్ట్ ట్రిమ్ మరియు టాప్ ఎండ్ వేరియంట్లకు మధ్యన ఉంటుంది.

ఇక కొత్త Hero Pleasure Plus Xtec Sports వేరియంట్ డిజైన్, లుక్ విషయానికొస్తే.. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇందులో పెయింట్ స్కీమ్ మరియు గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణ. అబ్రాక్స్ ఆరెంజ్ బ్లూ కలర్ స్కీమ్‌లో అందుబాటులో ఉంటుంది. సైడ్ ప్యానెల్‌లు, ఫ్రంట్ ఆప్రాన్ మరియు ఫ్రంట్ ఫెండర్‌పై ఆరెంజ్ కలర్.. '18' సంఖ్యల స్లాష్‌లతో బ్లూ కలర్‌తో ప్రైమరీ షేడ్స్‌ను కలిగి ఉంటుంది.
ఇక హీరో Pleasure Plus Xtec Sports లో వీల్స్ మీదుగా ఆరెంజ్ పిన్‌స్ట్రైప్స్ మరియు బాడీ-కలర్ గ్రాబ్ రైల్ మరియు మిర్రర్‌లు.. స్పోర్ట్స్ వేరియంట్‌కు మరింత అదనపు ఆకర్షణను జోడిస్తాయి. ఈ ప్రత్యేకమైన డిజైన్ ఇంకా లుక్ ఆధారంగా స్పోర్స్ వేరియంట్.. Xtec లోని మిగతా వేరియంట్ల కంటే విభిన్నంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.

హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ స్పోర్ట్స్ వేరియంట్ ఇంజిన్ విషయానికొస్తే.. ఇది స్టాండర్డ్ మరియు Xtec కనెక్టెడ్ వెర్షన్ మాదిరిగానే ఉంటుంది. ఈ స్కూటర్ 110.9cc ఇంజన్‌తో పనిచేస్తుంది. 8bhp మరియు 8.7Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. CVT ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌తో జత చేయబడి ఉంటుంది.
ఎక్స్‌టెక్ స్పోర్ట్స్ వేరియంట్ మొత్తంగా 106 కిలోల బరువుతో ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 4.8 లీటర్లుగా ఉంది. ఇక స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. ఇందులో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు మోనోషాక్‌ను కలిగి ఉంటుంది. ఆకర్షణీయమైన 10-అంగుళాల వీల్స్‌పై నడుస్తుంది. బ్రేకింగ్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లను అమర్చారు.

హీరో Pleasure Plus Xtec Sports వేరియంట్‌లో ఫీచర్లను చూసుకుంటే.. LCDలో కాల్ మరియు SMS లను యాక్సెస్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సెమీ-డిజిటల్ కన్సోల్‌ను కలిగి ఉంటుంది. ఇంకా ఈ స్కూటర్ అసాధారణమైన ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్‌తో యువ రైడర్లను ఆకట్టుకుంటుంది.
దేశీయ మార్కెట్లో మోటార్ సైకిల్, స్కూటర్ విభాగంలో హీరో మోటోకార్ప్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇక యువ కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా కొత్త మోడళ్లను తీసుకువస్తుంది. ఈ క్రమంలో సంస్థ హీరో Pleasure Plus Xtec Sports వేరియంట్‌ను తీసుకువచ్చింది. ఈ స్కూటర్.. హోండా యాక్టివా 6G మరియు TVS జూపిటర్ వంటి దిగ్గజ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








