హీరో మోటోకార్ప్‌ నుంచి మరో స్టైలిష్‌ బైక్‌ Mavrick 440 లాంచ్‌.. ధర రూ. 1.99 లక్షలు

హీరో మోటోకార్ప్‌ నుంచి మరో సరికొత్త బైక్‌ లాంచ్‌ అయింది. ఇటీవల జనవరిలో జరిగిన హీరో వరల్డ్‌ 2024 లో హీరో మోటోకార్ప్‌ తన స్టైలిష్‌ బైక్‌ Mavrick 440 ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ బైక్‌ను(Hero Mavrick 440 Launch) లాంచ్‌ చేస్తూ ధర, ఇతర ముఖ్యమైన వివరాలను వెల్లడించింది. బుకింగ్‌లు సైతం ప్రారంభమయ్యాయి.

హార్లే-డేవిడ్‌సన్ X440 తో ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా హీరో మావ్రిక్‌ 440 ని హీరో మోటోకార్ప్‌ రూపొందించింది. డిజైన్ విషయానికొస్తే.. ఆధునిక రోడ్‌స్టర్ స్టైలింగ్ మరియు 17-అంగుళాల చిన్న ఫ్రంట్ వీల్ మరియు లావుగా ఉన్న వెనుక టైర్‌తో సహా కొన్ని సాంకేతిక మార్పులతో వస్తుంది. ఈ బైక్‌ను ఆవిష్కరించిన నెల లోపే సంస్థ లాంచ్‌ చేస్తూ బైక్‌ ప్రియుల్లో భారీ అంచనాలను కలిగించింది.

Hero-Mavrick-440-Launched

ఫీచర్ల పరంగా Hero Mavrick 440 చాలా అడ్వాన్స్‌గా ఉంటుంది. పూర్తి LED లైట్లు, మరియు eSIM కనెక్టివిటీతో పాటు మొత్తంగా 35 ఫీచర్లను కలిగి ఉంది. వీటిని ఆపరేట్‌, కంట్రోల్‌ చేసేందుకు పూర్తి డిజిటల్ నెగటివ్ LCD క్లస్టర్‌ను సంస్థ అందిస్తోంది. ఇంకా గేర్ పొజిషన్ ఇండికేటర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఫ్యూయెల్‌ ఇండికేటర్‌, స్మార్ట్‌ ఫోన్‌ కనెక్టివిటీ వంటి రైడర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లతో వస్తుంది.

Hero Marvrick 440 లో పవర్‌ట్రెయిన్‌ విషయానికొస్తే.. ఇందులో హార్లే- డేవిడ్‌సన్‌ X440 మాదిరి 2V SOHC ఎయిర్-ఆయిల్ కూల్డ్ 440cc సింగిల్-సిలిండర్‌ను ఉపయోగించారు. స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా 6000 rpm వద్ద 27 bhp మరియు 4000 rpm వద్ద 36Nm శక్తిని ఉత్పత్తి చేస్తుందని సంస్థ తెలిపింది.

Hero-Mavrick-440-Launched

హీరో మావ్రిక్‌ 440 USD ఫోర్క్ మరియు గ్యాస్ ఛార్జ్డ్ ట్విన్ రియర్ షాక్‌లు, చిన్న 17-అంగుళాల ఫ్రంట్ వీల్ మరియు విస్తృత వెనుక టైర్‌తో వస్తుంది. వెట్ వెయిట్ అల్లాయ్ వీల్ వెర్షన్‌లో ఈ బైక్‌ 187 కిలోలు ఉంటుంది. ఇంకా స్పోక్‌ వీల్‌ వెర్షన్‌లో ఈ బైక్‌ బరువు 191 కిలోలుగా ఉంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13.5 లీటర్లు.

Mavrick 2100 mm పొడవు మరియు 175mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు 1388mm వీల్‌బేస్‌తో వస్తుండటం ద్వారా రైడింగ్‌ పరంగా వాహనదారుడికి మంచి అనుభూతిని ఇస్తుంది. సీటు ఎత్తు 803 మి.మీ కాగా బ్రేకింగ్‌ విషయానికొస్తే.. ముందు భాగంలో 320 మి.మీ ఫ్రంట్ డిస్క్, వెనుక భాగంలో 240 మి.మీ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

Hero-Mavrick-440-Launched

భారత మార్కెట్లో Hero Mavrick 440 మావ్రిక్ బేస్, మిడ్ మరియు టాప్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కాగా బేస్ వేరియంట్ రూ. 1.99 లక్షల ధరలో అందుబాటులో ఉండగా.. మిడ్ వేరియంట్ రూ. 2.14 లక్షల ధరకు కొనుగోలు చేయవచ్చు. టాప్ వేరియంట్ రూ. 2.24 లక్షల వద్ద ఉంది. ఇవన్నీ ఎక్స్‌- షోరూమ్‌ ధరలని గమనించాలి.

హీరో మావ్రిక్‌ 440 బైక్‌ బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కస్టమర్లకు సంస్థ బంపర్‌ ఆఫర్‌ అందిస్తోంది. మార్చి 15లోపు Mavrick 440ని బుక్ చేసుకున్న కస్టమర్‌లు రూ. 10,000 విలువైన కస్టమైజ్డ్ యాక్సెసరీస్ కిట్ మరియు సరుకులను గిఫ్ట్‌గా పొందవచ్చు.

ఏప్రిల్‌లో బైక్‌ డెలివరీలు ప్రారంభం కానున్నాయి. కస్టమర్లు సమీప డీలర్‌షిప్‌ లేదా సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఈ బైక్‌ను బుక్‌ చేసుకోవచ్చు. భారత మార్కెట్లో మావ్రిక్ 440.. ట్రయంఫ్ స్పీడ్ 400, హోండా CB300R, KTM 390 డ్యూక్, రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 319, మరియు హార్లే-డేవిడ్సన్ X440 వంటి స్టైలిష్‌ బైక్‌లతో పోటీ పడనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 14, 2024, 11:30 [IST]
English summary
Hero motocorp launches mavrick 440 bookings open price features specs details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+