హీరో బైక్‌లపై ఇండియన్స్ క్రేజ్.. ఏప్రిల్‌లో ఏకంగా 5.33 లక్షల టూ వీలర్లు సేల్
భారత మార్కెట్లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. గత నెల విక్రయించిన టూ వీలర్ సేల్స్ రిపోర్ట్ వెల్లడైంది. కాగా గతేడాది ఏప్రిల్ నెల విక్రయాలతో పోలిస్తే హీరో మోటోకార్ప్ ఈ సారి గణనీయమైన వృద్ధిని సాధించింది. మరి ఈ నెల ఏప్రిల్‌లో ఎన్ని హీరో బైక్‌లు సేల్ అయ్యాయి. పూర్తి సమాచారం ఈ కథనంలో..
భారత మార్కెట్‌లో హీరో మోటోకార్ప్(Hero Motocorp Sales In April) బైక్‌లు అత్యధిక ప్రజాదరణ పొందుతున్నాయి. సేల్స్ పరంగా ప్రతి నెలా మంచి విక్రయాలతో దూసుకుపోతుంది. అంతేకాకుండా కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా సంస్థ ఎప్పటికప్పుడు ఆధునిక ఫీచర్లతో విడుదలైన అనేక టూ వీలర్లు మార్కెట్లో పాపులర్ అయ్యాయి.

ఈ క్రమంలో హీరో మోటోకార్ప్ కంపెనీ 2024 ఏప్రిల్ నెలలో ద్విచక్ర వాహన విక్రయాల నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, హీరో మోటోకార్ప్ గత నెలలో 5,33,585 యూనిట్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా గతేడాది ఏప్రిల్‌లో 3.96 లక్షల యూనిట్లను సంస్థ విక్రయించగా.. ఈ సారి 34.7 శాతం వృద్ధిని సాధించింది.
ఇక ఈ ఏడాది మార్చి నెలలో 4,90,415 హీరో బైక్‌లు అమ్ముడయ్యాయి. దీని ద్వారా ఏప్రిల్‌లో 9 శాతం వృద్ధిని సాధించింది. ఇక దేశీయంగా హీరో మోటోకార్ప్.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 4,96,542 యూనిట్లను విక్రయించగా.. గతేడాది ఏప్రిల్‌లో 3,68,830 యూనిట్లను విక్రయించింది. ఇక స్కూటర్ల విక్రయాలు గత నెలలో 37,043 యూనిట్లు ఉండగా.. ఏప్రిల్ 2023లో 27,277 యూనిట్లుగా ఉన్నాయి.

ఇక ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ పరంగా కూడా హీరో మోటోకార్ప్ ఆశాజనకమైన సేల్స్‌ను పొందింది. కాగా ఇప్పటికే Hero భారతదేశంలోని 100 కంటే ఎక్కువ నగరాల్లో 2000 ఛార్జింగ్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ప్రసిద్ధ EV తయారీ సంస్థ ఈథర్‌తో చేతులు కలిపింది.
మార్కెట్లో కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా ఇప్పటికే పలు బైక్‌లను విడుదల చేసిన హీరోకు చెందిన ప్రముఖ మోడళ్లలో మార్విక్ ఒకటి. హార్లే డేవిడ్‌సన్ X440 ఇంజిన్ ఆధారంగా హీరో మావ్రిక్ 440 బైక్‌ను సంస్థ లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన లుక్స్ మరియు మంచి పనితీరుతో ఈ బైక్ మెల్లగా భారతీయులకు ఫేవరెట్‌గా మారింది.

ఇటీవలే సంస్థ ఈ కొత్త హీరో మావ్రిక్ 440 బైక్ డెలివరీని ప్రారంభించగా.. ఈ బైక్ ధర రూ.1.99 లక్షలుగా ఉంది. బేస్, మిడ్ మరియు టాప్ అనే మూడు వేరియంట్లలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. మావ్రిక్ ప్రత్యేకంగా హీరో ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తుండగా.. ఆసక్తి గల కస్టమర్లు బుక్ చేసుకోవచ్చు.
Hero Mavrick 440.. హార్లే డేవిడ్‌సన్ X440 మాదిరిగా అదే 440 cc సింగిల్-సిలిండర్ ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 27 bhp పవర్ మరియు 4,000 rpm వద్ద 36 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిటీ కమ్యూటింగ్ మరియు హైవే కమ్యూటింగ్ రెండింటిలోనూ రైడర్‌కు గొప్ప అనుభూతిని ఇస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








