హల్ చల్ చేయడానికి అలాంటోడు మళ్లీ వస్తున్నాడు.. ఈ సారి ఎంట్రీ ఇస్తే వార్ వన్‌ సైడ్ అవుద్ది!

ఇండియా మార్కెట్లో పోటీ కారణంగా టాప్ కంపెనీలు పోటా పోటీగా కొత్త బైకులను విడుదల చేస్తున్నాయి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా లేటెస్ట్ ఫీచర్లతో ఇవి కొనుగోలుకు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇండియాలో టాప్ కంపెనీల జాబితాలో ఉన్న హీరో మోటోకార్ప్ త్వరలో కరిష్మా XMR 250(karizma-xmr250) బైక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ బైకు‌ను లాంచ్ చేయడానికి ముందు హీరో ప్రస్తుతం జరుగుతున్న EICMA 2024 ఈవెంట్‌లో అందరి ముందు ప్రదర్శించి దాని డిజైన్‌ను ప్రపంచానికి చూపించింది. హీరో మోటోకార్ప్ నుంచి 2000 ప్రారంభంలో మొదటగా కరిష్మా బైక్ మార్కెట్లోకి వచ్చింది. దీని పనితీరు కారణంగా దేశంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న బైకులలో స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవల మార్కెట్లో పోటీ వాతావరణం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇతర ప్రత్యర్థి కంపెనీలకు ధీటుగా తన అస్త్రాన్ని తిరిగి రంగంలోకి దింపుతుంది.

ఇటలీలోని మిలాన్‌లో జరుగుతున్న EICMA ఈవెంట్‌లో ప్రపంచంలోని చాలా బైక్ కంపెనీలు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తుండగా, హీరో మోటోకార్ప్ కూడా తన రాబోయే కరిష్మా XMR 250ని ప్రేక్షకుల ముందు ప్రదర్శించింది. దీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. 210 సీసీతో ఈ బైక్ ఉండగా, ఇప్పుడు వస్తున్న కొత్త మోడల్ అధునాతన 250 సీసీ భారీ ఇంజిన్‌తో వస్తుంది.

Hero Motocorp Unveils Karizma Xmr250

కొత్త కరిష్మా XMR 250 బైక్‌లో కొత్తగా లిక్విడ్-కూల్డ్, 4-వాల్వ్, డీఓహెచ్‌సీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ని అమర్చారు. ఈ భారీ ఇంజిన్ గరిష్టంగా 29.6 bhp పవర్, 25 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే ఈ ఇంజిన మరింత అప్‌డేట్‌గా వచ్చింది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న 250 సీసీ ఇంజిన్ బైకులకు కరిష్మా XMR గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

దీనిలో ఉన్న అన్ని ఫీచర్లు కూడా అధునాతనమైనవి. TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ LED హెడ్‌లైట్‌లు, LED DRLలు, ల్యాప్ టైమర్, ట్రాక్ టైమర్, ఎత్తు సర్దుబాటు చేయగల క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, స్ప్లిట్ సీట్ సెటప్, డ్యూయల్-ఛానల్ ABS సిస్టం, స్పోర్టీ‌ లుక్‌ను కలిగి ఉన్న ఈ బైకులో ముందు, వెనుక 17 అంగుళాల వీల్స్ ఉన్నాయి.

Hero Motocorp Karizma Xmr250

ఎత్తు పల్లాలు ఉన్న ప్రాంతాల్లో సాఫీగా వెళ్లడానికి మెరుగైన సస్పెన్సన్‌ను ఈ కొత్త బైకులో అందించారు. ఈ ఇంజిన్‌కు 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. దీంతో రైడర్లు తమ బైక్‌ను మరింత వేగంతో తీసుకెళ్లవచ్చు. స్పోర్ట్స్ మోడల్ ఫెర్ఫామెన్స్ కావాలనుకునే వారికి ఈ బైక్ చాలా మంచి ఆప్షన్ అవుతుంది. చాలా మంది ఈ బైక్ కోసం వెయిట్ చేస్తున్నారు.

గతంలో చాలా మందికి కరిష్మా బైకులంటే చాలా పిచ్చి. దేశవ్యాప్తంగా దీని డిమాండ్ ఓ రేంజ్‌లో ఉండేది. కానీ కొద్ది కాలం తర్వాత హీరో మోటోకార్ప్ కరిష్మా ఉత్పత్తిని నిలిపివేసింది. ఇప్పుడు కొత్తగా 250 సీసీ ఇంజిన్ వేరియంట్‌లో రాబోతుంది. గత మోడల్‌కు మాదిరిగానే ఈ కొత్త బైకు కూడా ప్రజల నుంచి మంచి ఆదరణ సంపాదించుకుంటుందని అంచనా.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, November 6, 2024, 18:00 [IST]
English summary
Hero motocorp unveils karizma xmr 250 in eicma 2024 event check all details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+