Hero Pleasure Plus Xtec Sports కొనాలనుకుంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్'(Hero MotoCorp) ఎట్టకేలకు మరో స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ డిజైన్ ఎలా ఉంది, ఫీచర్స్ ఏంటి? ఇంజిన్ వివరాలు వంటివి ఈ కథనంలో చూసేద్దాం..
హీరో మోటోకార్ప్ లాంచ్ చేసిన కొత్త స్కూటర్ 'ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ స్పోర్ట్స్' (Hero Pleasure Plus Xtec Sports Variant). ఈ స్కూటర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఫీచర్స్ కూడా దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటాయి. కొత్త కలర్ స్కీమ్ పొందిన ఈ ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ స్కూటర్ ధర కూడా తక్కువగానే ఉంటుంది.

ధర (Price): హీరో మోటోకార్ప్ లాంచ్ చేసిన కొత్త 'ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ స్పోర్ట్స్' వేరియంట్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 79738 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ కొత్త స్కూటర్ స్టాండర్డ్ మరియు టాప్ వేరియంట్లకు మధ్యలో ఉంటుంది. కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరిస్తూ.. ప్లెజర్ లైనప్ కూడా పెంచుతూనే ఉంది. కొత్త ప్లెజర్ స్కూటర్ కావాలనుకునే వారికి ఇది ఎంపిక అవుతుందని భావిస్తున్నాము.
డిజైన్ (Design): కొత్త హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ స్పోర్ట్స్ వేరియంట్ స్కూటర్ చూడగానే ఆకర్షించే డిజైన్ పొందుతుంది. ఇది ఆరెంజ్ స్లాష్‌లతో బ్లూ డామినేటెడ్ కలర్ స్కీమ్ పొందుతుంది. సైడ్ ప్యానెల్స్, ఫ్రంట్ ఆప్రాన్ మరియు ఫెండర్ మీద 18 అనే నెంబర్ కూడా ఉంటుంది. వీల్స్ మీద ఆరంజ్ కలర్ పిన్‌స్ట్రైప్‌లు, గ్రాబ్ రైల్ మరియు మిర్రర్‌లపై బాడీ కలర్ యాక్సెంట్‌లు ఈ స్కూటర్‌ను మరింత ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి.

పవర్‌ట్రైన్ (Powertrain): హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ స్పోర్ట్స్ వేరియంట్ స్కూటర్ 110.9 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 Bhp పవర్ మరియు 8.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. కేవలం 106 కిమీ బరువు కలిగిన ఈ స్కూటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 4.8 లీటర్ల వరకు ఉంటుంది. పనితీరు కూడా చాలా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము.
ఫీచర్స్ (Features): ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. హీరో కొత్త ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ స్పోర్ట్స్ స్కూటర్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌తో పాటు కాల్స్ మరియు ఎస్ఎమ్ఎస్ నోటిఫికేషన్‌ల కోసం బ్లూటూత్ కనెక్టివిటీని అందించే సెమీ డిజిటల్ కన్సోల్ పొందుతుంది. ఇది రాత్రి సమయంలో కూడా ప్రకాశవంతంగా ఉండటం వల్ల రైడర్ దీనిని గమనించవచ్చు. ఈ ఫీచర్స్ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

హార్డ్‌వేర్ (Hardware): కొత్త హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ స్పోర్ట్స్ స్కూటర్ 10 ఇంచెస్ వీల్స్ పొందుతాయి. ఈ స్కూటర్ యొక్క ముందువైపు టెలిస్కోపిక్ పోర్క్ మరియు వెనుక వైపు మోనోషాక్ ఉన్నాయి. ఇది మంచి హ్యాండ్లింగ్ అనుభూతిని అందిస్తుంది. మెరుగైన భద్రత కోసం కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో అనుసంధానించబడిన డ్రమ్ బ్రేక్ సిస్టమ్ ఇందులో ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








