Hero Splendor Electric ఎలక్ట్రిక్ వెర్షన్‌లో హీరో స్ప్లెండర్ బైక్!!.. టెస్ట్ రన్ వైరల్ ఫొటోలు చూశారా.??
భారత మార్కెట్లో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్. కాగా ఇప్పుడు హీరో మోటోకార్ప్ పూణేలో తమ హీరో స్ప్లెండర్(Hero Splendor) ఎలక్ట్రిక్ వెర్షన్ ప్రోటోటైప్‌ను స్పాట్ టెస్ట్ నిర్వహిస్తున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. పూర్తి సమాచారం ఈ కథనంలో..
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. ఐసీఈ వాహనాలకు ప్రత్యామ్నాయంగా కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో స్టార్టప్ కంపెనీలతో పాటు ప్రముఖ ఆటో కంపెనీలు సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టి సత్తా చాటుతున్నాయి. ఆకర్షించే డిజైన్, సరికొత్త ఫీచర్లతో మార్కెట్లో పోటాపోటీగా ఆటో కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి.

కాగా హీరో మోటోకార్ప్ నుంచి మధ్య తరగతి ప్రజల ఫేవరెట్ బైక్ హీరో స్ప్లెండర్ ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతోంది. భారత మార్కెట్లో కమ్యూటర్ బైక్ సెగ్మెంట్‌లో మంచి డిమాండ్‌ను ఏర్పరుచుకుంది. ప్రతి ఏటా హీరో మోటోకార్ప్‌కు చెందిన బైక్ విక్రయాల్లో స్ప్లెండర్ వాటా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటీవల ఈ బైక్ ఎలక్ట్రిక్ వెర్షన్ పూణె రోడ్లపై స్పాట్ టెస్ట్ నిర్వహిస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
హీరో స్ప్లెండర్ బైక్ ఎలక్ట్రిక్ వెర్షన్ స్పాట్ టెస్ట్‌కు సంబంధించిన ఫొటోలను టీం బీహెచ్‌పీ షేర్ చేసింది. త్వరలో ఈ బైక్ ఎలక్ట్రిక్ రూపంలో విడుదల కావచ్చని వెల్లడించింది. అయితే ఇది నిజం కాదని తర్వాత తెలిసింది. అదేంటి అనుకుంటున్నారా.. అయితే GoGo A1 అనేది ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌లను విక్రయించే సంస్థ. హీరో స్ప్లెండర్‌పై ఈ సంస్థ నిర్వహిస్తున్న పరీక్ష ఇదేనని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కస్టమర్లు ఎలక్ట్రిక్ టూ వీలర్(Hero Splendor Electric Version)ను కొనుగోలు చేయాలని అనుకుంటే అందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయడం లేదంటే.. ఇప్పటికే మీరు వినియోగిస్తున్న ICE బైక్ లేదా స్కూటర్‌ను ఎలక్ట్రిక్ వాహనంగా మార్చుకోవచ్చు.
ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌లను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా సాధారణ ఇంజిన్ వాహనాలను EVలుగా మార్చుకోవచ్చు. పెట్రోల్ స్కూటర్లు మరియు బైక్‌లను EVలుగా మార్చే కన్వర్షన్ కిట్‌లను అందించే సంస్థ GoGo A1. కాగా ఈ కంపెనీ హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్స్ మరియు స్కూటర్ ఇండియా ఉత్పత్తుల కోసం ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌లను రూపొందించి అందిస్తోంది.

ఈ నేపథ్యంలో GoGo A1 Hero Splendor బైక్ కోసం కొత్త ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌ను అభివృద్ధి చేసే ప్రక్రియలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పూణె వీధుల్లో స్ప్లెండర్ బైక్‌ను కంపెనీ ట్రయల్ రన్ నిర్వహించినట్లుగా సమాచారం. ఈ టెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది.. ధర ఎంత అనే వివరాలు అందుబాటులో లేవు.
GoGo A1 ఈ సమాచారాన్ని త్వరలోనే ప్రకటించనుందని తెలుస్తోంది. హీరో స్ప్లెండర్ బైక్ విషయానికొస్తే ఇది.. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాల్లో ఒకటి. కాబట్టి హీరో మోటోకార్ప్ స్ప్లెండర్(Hero Motocorp) బైక్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేస్తే, కస్టమర్లకు బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు.

కాగా ఇప్పటికే అనేక IC ఇంజిన్ వాహనాల ఎలక్ట్రిక్ వెర్షన్లు ఇప్పటికే భారతీయ మార్కెట్‌లో హవా కొనసాగిస్తున్నాయి. హీరో మోటోకార్ప్ మాజీ భాగస్వామి మరియు ప్రస్తుత ప్రత్యర్థి హోండా కూడా భారత మార్కెట్లో హోండా యాక్టివా స్కూటర్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications