రూ. 82,911 లకే కొత్త స్ప్లెండర్‌ ప్లస్‌ బైక్‌ విడుదల.. 73 కి.మీ మైలేజీ, సరికొత్త స్మార్ట్ ఫీచర్స్‌

దేశంలో హీరో స్ప్లెండర్ బైక్‌లకి క్రేజ్ ఎక్కువ. ఎక్కువ మైలేజీ అందించడంతోపాటు సరసమైన ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉండడం వల్ల హీరో మోటోకార్ప్‌లోని ఈ బైకులు టూ-వీలర్‌ బైక్స్‌ విభాగంలో మంచి మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నాయి. దేశంలోని టూ-వీలర్ బైక్స్‌లో గత మూడు దశాబ్దాలుగా హీరో స్ప్లెండర్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా ప్రజలు ఈ బైక్‌ని కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల ఈ బైక్ సేల్స్‌లో ఇప్పటికీ టాప్ లోనే ఉంది. హీరో మోటోకార్ప్‌కి అతిపెద్ద సేల్స్ లైనప్‌గా హీరో స్పెండర్ ప్లస్ ఉంది. తాజాగా స్ప్లెండర్‌ ప్లస్‌ ఎక్స్‌టెక్‌ 2.0 బైక్‌ని ఆ సంస్థ విడుదల చేసింది. ఈ సరికొత్త బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

ఈ బైక్‌ని హీరో మోటోకార్ప్‌ తాజాగా మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ధరను రూ.82,911 (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించింది. కొత్త హీరో స్ల్పెండర్ ప్లస్ ఎక్స్‌టెక్‌ 2.0లో 100 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలదు. ఈ ఇంజిన్ 7.09 bhp వద్ద 8.05nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

Hero-Splendor-Plus-Xtec

ఈ ఇంజిన్ 4-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు ఉన్నాయి. అదే సమయంలో రెండు వైపులా డ్రమ్ బ్రేకులను గమనించవచ్చు. ఈ కొత్త బైక్‌లో అధునాతన ఫీచర్లతో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్‌ క్లస్టర్‌ ఉంది. స్ప్లెండర్‌ ప్రియులను ఈ బైక్‌ ఏమాత్రం నిరాశకు గురిచేయందు. హైచ్‌ ఆకారంలోని ఎల్ఈడీ హెడ్‌లైట్‌ ఫుల్ కలర్‌ఫుల్‌గా ఈ బైక్‌ కనిపించనుంది.

కొత్త హీరో స్ప్లెండర్‌ ప్లస్ ఎక్స్‌టెక్‌ 2.0 ధర ప్రస్తుత మోడల్ కంటే రూ. 3,000 మాత్రమే ఎక్కువగా ఉంది. ఈ బైక్‌ హోండా షైన్ 100కి ప్రత్యర్థిగా ఉంటుంది. హోండా షైన్ 100 (Shine 100) ఇటీవల 3 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. సరికొత్త హీరో స్ప్లెండర్‌ ప్లస్ ఎక్స్‌టెక్‌ 2.0 బైక్ రాకతో హోండా షైన్ 100 అమ్మకాలు కాస్త నెమ్మదించే అవకాశం ఉంది.

Hero-Splendor-Plus-Xtec-Bike-Launched

హీరో స్ప్లెండర్‌ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్ సైకిళ్లలో ఒకటిగా ఉంది. హీరో స్ప్లెండర్ 1994లో భారతదేశంలో లాంచ్ అయింది. హీరో స్ల్పెండర్ లాంచ్ చేసి 30 ఏళ్లు అవుతోంది. హీరో స్ప్లెండర్‌ ప్లస్ ఎక్స్‌టెక్‌ మెరుగైన సేఫ్టీని అందించడానికి హజార్డ్ లైట్లతో వస్తుంది. ఈ బైక్ ఇంజిన్ ఐ3ఎస్ (i3S) టెక్నాలజీతో వస్తుంది. ఇక ఫైనల్‌గా ఈ బైక్‌ లీటరుకు 73 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుంది.

ఈ సరికొత్త స్ల్పెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0లో అనేక ఫీచర్లను గమనించవచ్చు. ఎకో ఇండికేటర్, రియల్ టైమ్ మైలేజీ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్‌లను డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్‌ కన్సోల్‌లో చూపిస్తుంది. USB ఛార్జింగ్ పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా ఈ బైక్‌లో సంస్థ మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న స్ప్లెండర్‌ బైకుల కంటే ఇందులో అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

Hero-Splendor-Plus-Xtec

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, May 31, 2024, 17:37 [IST]
English summary
Hero splendor plus xtec 2 0 launched at rs 82911 features and specifications details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+