హోండా షైన్ 100 Vs కొత్త స్ప్లెండర్ ప్లస్ Xtec 2.0.. ఏది కొనాలో తేల్చుకోలేక పోతున్నారా?
తాజాగా హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 (Hero Splendor Xtec 2.0) బైక్‌ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ బైక్ ముఖ్యంగా పూర్తి స్మార్ట్ అప్‌గ్రేడ్‌లతో ఆ సంస్థ విడుదల చేసింది. భారత్‌లో హీరో కమ్యూటర్ స్ప్లెండర్ ప్లస్ బైక్‌కి మంచి డిమాండ్ ఉంది. మూడు దశాబ్దాలుగా టూ-వీలర్స్‌లో విభాగంలో ఈ బైక్ టాప్‌లో కొనసాగడం గమనార్హం. అయితే తాజాగా ఆ స్థానాన్ని హోండా దక్కించుకుంది. ఆ కంపెనీ లైనప్‌లోని హోండా షైన్ ప్రస్తుతం మార్కెట్‌లో దూసుకువెళ్తుంది. తాజాగా స్ప్లెండర్ బైక్‌ల ఆధిపత్యానికి హోండా షైన్ బ్రేక్ వేసింది.
హీరో మోటోకార్ప్ విడుదల చేసిన స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ హోండా షైన్ 100 (Honda Shine 100) బైక్‌కి గట్టి పోటీని ఇవ్వనుంది. హోండా షైన్ 100 ఇటీవల మూడు లక్షల యూనిట్లను సేల్ చేసి రికార్డు సృష్టించింది. తాజాగా పూర్తి అప్‌డేట్స్‌తో వచ్చిన హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 మరియు షైన్ 100 బైక్స్ పనితీరులు ఏ విధంగా ఉన్నాయి. వీటి ఫీచర్లు, మైలేజీ వివరాలు మీకోసం..

డిజైన్: ఈ రెండు కమ్యూటర్ మోటార్ సైకిళ్లు మునుపటి మోడళ్ల మాదిరిగానే ఉండనున్నాయి. అయితే డిజైన్ కంటే ఎక్కువగా వీటి పనితీరులో మార్పులు గమనించవచ్చు. రెండు బైకుల్లో తక్కువ బాడీవర్క్ ఉన్నాయి. వీటిని మెయింటైన్ చేయడం చాలా తక్కువ పని. స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 వెనుక భాగంలో గ్రాబ్ రెయిల్‌ని (సీటు ఆఖరు భాగం) అధికంగా వస్తుంది. కానీ షైన్‌లో సింగిల్ రెయిల్ మాత్రమే ఉంటుంది.
ఫీచర్లు: స్ల్పెండర్ ఎక్స్‌టెక్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఎల్ఈడీ హెడ్‌లైట్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ కోసం స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటితో స్ప్లెండర్ ఫుల్-ప్యాక్డ్ ఫీచర్లతో కూడిన వెర్షన్‌గా ఉంది. షైన్ 100 అనలాగ్ సెటప్‌తో మాత్రమే వస్తుంది. షైన్‌తో పోల్చితే స్ప్లెండర్‌లో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్: స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 బైక్ 100 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7.09bhp పవర్ మరియు 8.05nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. షైన్ 100 బైక్ 98.9 సీసీ, సింగిల్ సిలిండర్ మోటారుతో పనిచేస్తుంది. ఇది 7.28 bhp వద్ద 8.05 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. రెండు బైకుల్లో 4-స్పీడ్ గేర్ బాక్స్ కలవు.
ధర: టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్స్, రెండు వైపులా డ్రమ్ బ్రేక్స్, అల్లాయ్ వీల్స్‌తో ఈ రెండు బైక్స్ వస్తున్నాయి. ఇందులో ఎలాంటి తేడాలు లేవు. అయితే వీటి ధరల్లో చాలా వ్యత్యాసం ఉంది. స్ప్లెండర్ పల్స్ ఎక్స్‌టెక్ 2.0 ధర రూ.82,911 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), షైన్ 100 ధర రూ.64,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి.

చివరగా: ఈ రెండు బైకుల ధరల్లో తేడా సుమారు రూ. 18,000గా ఉంది. అయితే స్ల్పెండర్ మరిన్ని అధునాతన ఫీచర్లు ఉండగా.. షైన్‌లో సాధారణ ఫీచర్లు మాత్రమే ఉన్నాయి. ఎక్స్‌టెక్ 73 కి.మీ, షైన్ 65 కి.మీ మైలేజీని అందించనున్నాయి. ఫ్యామిలీ, ఇతర వాణిజ్య అవసరాల కోసం ఎక్స్‌టెక్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఆఫీస్ అవసరాల కోసం హోండా షైన్ 100 సరిపడా బైక్‌గా ఉండనుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








