30 ఏళ్ల 'హీరో స్ప్లెండర్' ప్రస్థానంలో భారీ అప్‌డేట్.. ఏంటో తెలిస్తే మీ పాత బైక్‌ని అమ్మేసి దీనినే కొంటారు!
దేశంలో బడ్జెట్ ధరలో మంచి మైలేజీ అందించే బైక్ ఏదైనా ఉంది అంటే వెంటనే స్ప్లెండర్ ప్లస్ అని చెప్పేస్తారు. హీరో మోటోకార్ప్ అందుబాటులో ఉన్న ఈ బైక్ దేశంలో అత్యంత విశ్వసనీయమైన టూవీలర్ బైక్‌గా ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఈ బైక్ మార్కెట్‌లో టాప్ ఉండటానికి మైలేజీ, ధర అనేవి ముఖ్య కారణంగా ఉన్నాయి. ఈ కంపెనీ నుంచి అందుబాటోలో ఉన్న బైకుల్లో హీరో ఇప్పటికీ టాప్‌లోనే కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ బైక్‌ని ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే దేశంలో నంబర్ వన్ ట్రస్టెడ్ బైక్‌గా స్ప్లెండర్ ప్లస్ అవతరించింది. తాజాగా ఈ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ (Splendor Xtec)ని కొత్త అప్‌డేట్‌తో హీరో మోటోకార్ప్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..
స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్‌ని ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో కంపెనీ తీసుకువచ్చింది. ఈ బైక్‌లలో ఇప్పటి వరకు ఫ్రంట్ డిస్క్‌ని అందించ లేదు. తొలిసారిగా ఫ్రంట్‌లో డిస్క్ బ్రేక్‌ని అందిస్తూ మార్కెట్‌లో విడుదల చేసింది. అయితే ఇతర డిజైన్, ఇంజిన్, ఫీచర్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటు ఉన్న బైక్స్ వలె ఉండనుంది. ఇందులో కేవలం ఫ్రంట్ డిస్క్ మాత్రమే అదనం.

ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్‌తో అప్‌డేట్ చేసిన ఈ బైక్ ధర రూ.83,461 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ డిస్క్ బ్రేక్ ఫీచర్ కేవలం స్ప్లెండర్ ప్లస్ Xtec వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. డిస్క్ బ్రేక్ ఆప్షన్ లేకుండా దీని ధర కేవలం రూ. 79,911 (ఎక్స్-షోరూమ్) మాత్రమే కస్టమర్లు తమకు నచ్చిన ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు. డిస్క్ బ్రేక్ అనేది కంపల్సరీ కాదు.
ఈ హీరో స్ల్పెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 7.9bhp పవర్, 8.05nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. దీని సీటు డిజైన్ చాలా ఫ్లాట్‌గా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ 73 కి.మీ మైలేజీ వరకు అందిస్తుంది.

ఈ బైక్ మొత్తం 3 కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. బ్లాక్ స్పార్కింగ్ బ్లూ, బ్లాక్ టోర్నడో గ్రే, బ్లాక్ రెడ్ అనే కాంబినేషన్స్‌తో ఈ కొత్త మోటార్ సైకిల్ కొనుగోలు చేయవచ్చు. LED హెడ్‌ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, i3S స్టార్ట్/స్టాప్ సిస్టమ్, బైక్ సైడ్ స్టాండ్ కటాఫ్ సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది.
ఈ బైక్ ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. టాప్ వేరియంట్‌లో 240 మిమీ డిస్క్ బ్రేక్, 130 మిమీ డ్రమ్ బ్రేక్ సిస్టమ్ కలదు. దీని ముందు భాగంలో ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక 5-స్టెప్స్ అడ్జస్టబుల్ డ్యూయల్-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. కొత్త డిస్క్ బ్రేక్ 1.6 కిలోల బరువు కలదు. ఈ బైక్ మొత్తం బరువు 113.6 కిలోలుగా ఉంటుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








