Hero Surge పేరుకి ఒకటే వెహికిల్ రెండు లాభాలు.. అతికిస్తే ఆటో.. తీసేస్తే స్కూటర్!!
భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో వినూత్న ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హీరో ఆధారిత స్టార్టప్ సర్జ్.. 2 ఇన్ 1 ఫంక్షనాలిటీతో కూడిన S32 (Hero Surge S32) వాహనాన్ని ఆవిష్కరించింది. ఈ వాహనాన్ని స్కూటర్ లేదా కార్గో గా ఉపయోగించవచ్చు.
భారత్‌లో తొలిసారిగా ఈ తరహా వాహనం : S32 వాహనంలో (Hero Surge Convertible EV) సర్జ్ స్టార్టప్ ప్రత్యేక సౌకర్యాలను కల్పించింది. ఇప్పటికే ఈ తరహా వాహనాలు విదేశాల్లో కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే భారత్‌లో ఈ తరహా వాహనాలను తాజాగా ఆవిష్కరించారు. త్వరలోనే కొనుగోలుకు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

ఇప్పటి నుంచి త్రీవీలర్‌లోనూ : ఇప్పటి వరకు కేవలం ద్విచక్ర వాహనాలను మాత్రమే తయారుచేసిన హీరో తాజాగా సర్జ్ ద్వారా త్రీ వీలర్ కార్గో వాహనాల తయారీలోనూ భాగస్వామ్యం ఉంటుందని తెలుస్తోంది. మైడెన్ S32 ఎలక్ట్రిక్ వాహనం యువ పారిశ్రామికవేత్తలను దృష్టిలో ఉంచుకొని సర్జ్ స్టార్టప్ ఈ వాహనాన్ని తయారుచేసినట్లు తెలుస్తోంది.
మూడు నిమిషాల్లోనే రెండు వాహనాలను కనెక్ట్ చేయవచ్చు : సర్జ్ స్టార్టప్ ఆవిష్కరించిన Surge S32 ఎలక్ట్రిక్ వాహనం స్కూటర్ లేదా త్రీవీలర్‌గా మార్చడం చాలా సులభం. ఇందుకు మూడు నిమిషాల సమయం మాత్రమే సరిపోతుందని సంస్థ చెబుతోంది. ఈ వాహనం ద్వారా ప్రీమియం ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. అందుకోసం అనేక సౌకర్యాలను కల్పించింది.

సాఫ్ట్ సిటింగ్ మరియు అద్భుతమైన ఫీచర్లను అందించింది. విండ్ స్క్రీన్, విండ్ స్క్రీన్ వైపర్‌ను కలిగి ఉంది. వర్షాకాలంలో సురక్షిత ప్రయాణాన్ని అందించేందుకు డోర్లు కూడా అందించింది. ద్విచక్ర వాహనానికి 3kW మోటార్‌ను అమర్చించింది. ఇది 4bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. త్రీవీలర్ కోసం 10kW మోటార్‌ను అందించింది. ఈ మోటార్ 13.4bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
రెండు వేర్వేరు బ్యాటరీలు : హీరో సర్జ్ S32 EV ద్విచక్ర వాహనం కోసం 3.5kWh బ్యాటరీ, త్రీవీలర్ కోసం 11kWh బ్యాటరీని ప్యాక్‌ను అందించింది. ఈ వాహనాన్ని కార్గో అవసరాల కోసం వినియోగించినప్పుడు 500 కిలోల వరకు బరువును మోయగలదు. ఈ వాహనం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.

మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది : సర్జ్ స్టార్టప్‌కు చెందిన S32 లోడ్ ఆటో, ప్యాసింజర్ ఆటో, కేజ్డ్ వెహికల్ వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే వాహనం ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందనే సమాచారాన్ని సంస్థ వెల్లడించేదు. మరియు ధర వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








