ఇలాంటి బండిని ఎప్పుడూ చూసి ఉండరు.. అదిరిపోయే లుక్‌తో హీరో నుంచి మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్
హీరో మోటోకార్ప్(Hero Motocorp) వినూత్నంగా మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. దీంతో ఈ త్రీ వీలర్(Hero Three Wheeler E Scooter) స్కూటర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ స్కూటర్ ఎలా ఉండనుంది. ఇందులోని ఫీచర్లు ఏంటి.?? ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
భారత మార్కెట్లో ప్రముఖ టూ వీలర్ తయారీదారు హీరో మోటోకార్ప్ ప్రస్తుతం ఒకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. Vida V1 పేరుతో ఇ స్కూటర్ మోడల్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ మోడల్‌ను హీరో త్రీ-వీలర్‌గా అభివృద్ధి చేసి విడుదల చేయనుంది. తాజాగా హీరో వరల్డ్ 2024 ఈవెంట్‌లో ఈ స్కూటర్‌ను ఆవిష్కరించింది.

హీరో విడా వి1(Hero Vida V1 Based Trike Concept) ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధారంగా ఈ మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సంస్థ అభివృద్ధి చేస్తోంది. అయితే డిజైన్ పరంగా ఇందులో పెద్దగా మార్పులు చేయలేదు. ముందు భాగంలో ఒకే చక్రానికి బదులుగా రెండు చక్రాలను అందించారు. త్రీ వీలర్ కావడంతో ఈ ఇ-స్కూటర్‌లో కనిపించే అతి పెద్ద మార్పు ఇదే..
అంతే కాకుండా హీరో త్రీ వీలర్ ఇ-స్కూటర్‌లో ఫ్రంట్ వీల్ యొక్క సస్పెన్షన్ సెటప్‌ను మార్చినట్లుగా తెలుస్తోంది. కాగా హీరో కంపెనీ ఈ వాహనాన్ని కాన్సెప్ట్ మోడల్‌గా మాత్రమే సిద్ధం చేసింది. అయితే సరికొత్త ఇ స్కూటర్‌ను ఎప్పుడు విడుదల చేస్తుందనే సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు. త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

హీరో విడా స్వే(Hero Vida Sway) పేరుతో ఈ త్రీ వీలర్ ఇ స్కూటర్‌ను హీరో మోటోకార్ప్ త్వరలో విడుదల చేయనుంది. ఇది ఒక ట్రైక్(Hero Vida Sway Trike) రకం వాహనం. కాగా ప్రపంచంలోని కొన్ని ఇతర దేశాల్లో ఈ స్కూటర్‌కు మంచి ఆదరణ లభిస్తుండటంతో.. భారత్‌లోనూ దీన్ని తీసుకురావాలని సంస్థ భావిస్తోంది.
హీరో తీసుకువస్తున్న ఈ విడా స్వే ట్రైక్ స్కూటర్ ద్వారా చాలా ప్రయోజనాలు ఉండనున్నాయి. దీనిపై ప్రయాణిస్తున్నప్పుడు కింద పడే అవకాశం ఉండదు. అంతే కాకుండా స్టెబిలిటీ ఉంటుంది. ఈ స్కూటర్ మోడల్‌ను విడా V1 Pro మోడల్‌ను పోలి ఉంటుంది. బాడీ ప్యానెల్‌లు, హెడ్‌లైట్ మరియు పెయింట్ ఫినిషింగ్ వీటన్నిటినీ ఈ రెండు స్కూటర్లలో చూడవచ్చు.
హీరో విడా స్వే ట్రైక్ స్కూటర్‌లో రెండు ముందు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు అందించారు. దీని ద్వారా అద్భుతమైన బ్రేకింగ్‌ను పొందవచ్చు. విడా స్వేలో ఇలాంటి అనేక ఇతర ఫీచర్లను చూడవచ్చు. అయితే ఇందులోని పూర్తి స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించలేదు. త్వరలోనే పూర్తి సమాచారం అందుబాటులోకి రానుంది.
అదేవిధంగా, హీరో మోటోకార్ప్ బైక్ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభం అవుతుంది.. ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే సమాచారం స్పష్టంగా తెలియదు. కానీ ఈ త్రీ వీలర్ స్కూటర్‌ను ఆవిష్కరించడంతో.. హీరో విడా స్వే ఇప్పటికే ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రీమియం ఫీచర్లను ఇష్టపడే వారిని ఈ స్కూటర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








