మీ భార్యకు గిఫ్ట్‌ ఇవ్వదగిన మంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఇదిగో వివరాలు..

ప్రస్తుతం టూ-వీలర్స్‌ వినియోగం దేశంలో పెరిగిపోతున్నాయి. స్కూటర్స్‌, మోటార్‌ సైకిల్స్‌, ఫ్రీమియం బైక్స్‌, ఇతర మోపెడ్‌ వంటి టూవీలర్స్‌ని జనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా బడ్జెట్‌లో బైక్స్‌ లేదా స్కూటర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. మన జీవన విధానంలో బైక్‌ ఓ భాగం అయిపోయింది. ప్రతీ చిన్న పనికి సైతం బైక్స్‌ని వినియోగిస్తున్నారు. తాజాగా ట్రెండ్‌ మారుతోంది. మహిళలు సైత స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకు క్రమంగా పెరుగుతుంది. బైకులతో పోలిస్తే స్కూటర్లు గేర్‌లెస్‌ కావడంతో మహిళలతో సహా అన్ని వయసుల వారు వీటిని ఇష్టపడతారు. ప్రస్తుతం చాలా కంపెనీలు స్కూటర్లను అందిస్తున్నాయి. అందులో ముఖ్యంగా హీరో నుంచి విడా1 ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. ఈ స్కూటర్‌కి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్లు, ఇతర ఫీచర్లు ఈ కథనంలో మీ కోసం..

హీరో కంపెనీ నుంచి వచ్చిన విడా లైనప్‌లో మంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్లు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి హీరో విడా1 ప్లస్‌, విడా 1ప్రో గా ఉన్నాయి. ఈ హీరో విడా వి1 ప్లస్ మోడల్‌లో 3.44 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు రేంజ్ అందిస్తుంది.

Vida-V1-Electric-Scooter-Price

ఇక విడా వి1 ప్రో వేరియంట్ 3.94 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లో అందుబాటులోకి రానుంది. ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల రేంజ్‌ని (మైలేజీ) అందిస్తుంది. ఈ రెండు మోడళ్లు ఒకే 6 కిలోవాట్ల (కిలోవాట్) ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటాయి. వీటి గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లుగా ఉంది.

కేవలం 3.4 సెకన్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్ల బరువు సుమారు 125 కిలోలు. ఈ హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్లలో ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ లైటింగ్, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఎకో, రైడ్, స్పోర్ట్, కస్టమ్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్‌ ఉన్నాయి.

Vida-V1-Electric-Scooter

కలర్స్: హీరో విడా మోడల్స్ మ్యాట్ అబ్రోక్ ఆరెంజ్, మ్యాట్ పెర్ల్ వైట్, మ్యాట్ స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ సియాన్ వంటి 5 ఆకర్షణీయమైన కలర్స్లో లభిస్తుంది. భద్రత కోసం, ఇది డిస్క్ మరియు డ్రమ్ బ్రేకులు మరియు 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది. ఇక వీటి ధరలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పవచ్చు. ఇతర ఎలక్ట్రిక్‌ స్కూటర్లతో పోల్చితే సరసమైన ధరలో హీరో ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఉన్నాయి.

ఈ స్కూటర్‌ ధరలు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉన్నాయి. టీవీఎస్ ఐక్యూబ్ ఇ-స్కూటర్ హీరో విడా వేరియంట్స్ గట్టి పోటీని ఇస్తున్నాయి. ఈ ఐక్యూబ్ స్కూటర్‌ ఐక్యూబ్, ఐక్యూబ్ S మరియు ఐక్యూబ్‌ ST అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ .94,999 నుండి రూ .185,373 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, July 6, 2024, 14:18 [IST]
English summary
Hero vida v1 electric scooters best buy for women price and specifications details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+