హీరో Vida V1 Plus ఇ స్కూటర్‌ మళ్లీ వచ్చేసింది.. భారీ డిస్కౌంట్‌తో మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు.!!

భారత మార్కెట్లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. ఆకర్షణీయమైన మోడళ్లు, అప్‌డేట్లతో ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకట్టుకుంటోంది. కాగా హీరో మోటోకార్ప్‌ ఎలక్ట్రిక్‌ సెగ్మెంట్‌లో కూడా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. Vida మోడల్‌తో వాహన ప్రియులకు చేరువైంది. కాగా ప్రస్తుతం ఈ సంస్థ Vida V1 Plus ని రీలాంచ్‌ చేసింది.

దేశంలో హీరో మోటోకార్ప్‌(Hero Motocorp) విడా ఇ-స్కూటర్‌లో V1 ప్లస్ మరియు V1 ప్రో అనే 2 వేరియంట్‌లలో విడుదల చేసింది. అయితే, వివిధ కారణాల వల్ల V1 ప్లస్ మోడల్‌ను సంస్థ నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ Vida V1 Plus స్కూటర్‌ను లాంచ్‌ చేయడంతో కొత్త స్కూటర్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది గుడ్‌ న్యూస్‌ అనే చెప్పొచ్చు.

Hero-Vida-V1-Plus-Relaunch

కాగా Vida V1 Plus ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ-లెవెల్ మోడల్ కాగా.. Hero Vida V1 Pro టాప్-ఎండ్ మోడల్‌గా సంస్థ లాంచ్‌ చేసింది. అయితే నిలిపివేసిన విడా వీ1 ప్లస్‌ ఇ స్కూటర్‌ను మళ్లీ చాలా సరసమైన ధరలో సంస్థ విడుదల చేసింది. ఇప్పుడు హీరో విడా వి1 ప్లస్ ఇ-స్కూటర్‌ను రూ. 1.15 లక్షలు(ఎక్స్‌-షోరూమ్‌) ధరతో ప్రవేశపెట్టింది.

Vida V1 Pro ధర రూ.1.45 లక్షలుగా ఉంది. Vida V1 ప్లస్ ఇ-స్కూటర్ ధరను ఫేమ్ II సబ్సిడీ మరియు పోర్టబుల్ ఛార్జర్‌తో కలిపి హీరో మోటోకార్ప్‌ నిర్ణయించింది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో అదనపు సబ్సిడీ కారణంగా అదే ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 97,800 ఎక్స్-షోరూమ్‌గా ఉండటం విశేషం. ఈ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయని గమనించాలి.

Hero-Vida-V1-Plus-Relaunch

మరింత సమాచారం కోసం హీరో మోటోకార్ప్‌ అధికారిక షోరూమ్‌ని సందర్శించవచ్చు. కాగా ఒక్క బ్యాటరీ ప్యాక్‌ మినహా ఫీచర్లు, డిజైన్‌ పరంగా V1 Pro మరియు V1 Plus ఒకే మాదిరిగా ఉన్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో కొత్త విడా వీ1 ప్లస్‌ ఇ స్కూటర్‌ మార్కెట్లో ఏథర్‌ 450 ప్లస్‌ మరియు ఓలా ఎస్‌1 ఎయిర్‌కు ప్రత్యక్ష పోటీనివ్వనుంది.

ఇక కొత్త Hero Vida V1 Plus ఇ-స్కూటర్‌ 3.44 kWh (kWh) బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్‌తో వస్తుంది. దీనిని పూర్తిగా ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇక టాప్‌ వేరియంట్‌ Vida V1 Pro పెద్ద 3.94 (kWh) బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండగా.. పూర్తి ఛార్జ్‌పై 110 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను క్లెయిమ్‌ను చేస్తుంది.

Hero-Vida-V1-Plus-Relaunch

Hero Vida V1 Plus మరియు V1 Pro ఇ-స్కూటర్లలో అదే 6 కిలోవాట్ (kW) ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించారు. విడా వీ1 ప్లస్‌ గంటకు 80 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 3.4 సెకన్లలో గంటకు 40 కిమీ వేగాన్ని అందుకునేలా దీనిని రూపొందించారు.

ఫీచర్ల విషయానికొస్తే పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్, LED లైటింగ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌, యాంటీ థెఫ్ట్‌ అలారం, జియో ఫెన్సింగ్‌, రిమోట్‌ ఇమ్మోబిలైజేషన్‌ వంటి అధునాత ఫీచర్లను Hero Vida V1 Plus ఇ స్కూటర్‌ కలిగి ఉంది.

ఇక అమ్మకాల పరంగా హీరో మోటోకార్ప్ ఇ స్కూటర్‌ సేల్స్‌ ఆశాజనకంగా ఉన్నాయి. కొత్త సంవత్సరం మొదలయ్యాక జనవరిలో 1,494 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను సంస్థ విక్రయించింది. అయితే 2023 జనవరిలో.. 1,750 యూనిట్లు విక్రయించగా.. 6.46 శాతం క్షీణతను నమోదు చేసింది. ఈ క్రమంలో విడా వీ1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మళ్లీ విడుదల చేయడంతో కస్టమర్లు పెరుగుతారని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.

More from DriveSpark

Article Published On: Friday, March 1, 2024, 15:43 [IST]
English summary
Hero vida v1 plus e scooter relaunched in india price battery range features details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+