హోండా యాక్టివా ఆధిపత్యానికి చెక్.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో కొత్త స్కూటర్‌ని లాంచ్ చేసిన హీరో మోటోకార్ప్
టూ-వీలర్ విభాగంలో హీరో మోటోకార్ప్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. అయితే స్కూటర్ విభాగంలో మాత్రం ఆ సంస్థ ఇప్పటికీ వెనుకంజలోనే కొనసాగుతుంది. హోండా లైనప్‌లోని యాక్టివాకు హీరో నుంచి విడుదల చేసిన స్కూటర్లు ఏమాత్రం పోటీని ఇవ్వలేక పోతున్నాయి. హోండా యాక్టివాకు గట్టి పోటీ ఇస్తున్న మోడళ్లలో హీరో జామ్ స్కూటర్స్ ఉన్నాయి. హీరో మోటోకార్ప్ జూమ్ సిరీస్‌లో సరికొత్తగా జూమ్ కాంబాట్ ఎడిషన్‌ని విడుదల చేసింది. ఈ స్కూటర్‌పై మార్కెట్‌లో భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. దీనిని మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టడం వెనుక హీరో మోటోకార్ప్ భారీ ప్రణాళికతో వచ్చిందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో హోండా యాక్టివాకు ఈ స్కూటర్ సవాల్‌ని విసురుతుందని భావిస్తున్నారు.
జూమ్ కాంపాక్ట్ ఎడిషన్ జూమ్ స్కూటర్ మోడల్ యొక్క టాప్-ఎండ్ ఎంపిక అయిన జెడ్ఎక్స్ వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. ఈ స్కూటర్ మోడల్ ను జెడ్ఎక్స్ వేరియంట్ నుండి స్వీకరించినప్పటికీ, అలంకరణలోని ఇతర అన్ని వేరియంట్లను నాశనం చేసే విధంగా దీనిని రూపొందించారు.

కొత్త జూమ్ కాంబాట్ ఎడిషన్ 'మ్యాట్ షాడో గ్రే' కలర్‌రో అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు ఈ స్కూటర్‌లో పసుపు బ్లాక్ కలర్ షేడ్‌లో ఈ స్కూటర్ అందుబాటులో ఉండేది. తాజా కాంబాట్ ఎడిషన్ షాడో గ్రే కలర్‌లో సరికొత్తగా కనిపించనుంది. ఈ కలర్ ఆప్షన్ స్కూటర్ ప్రియులకు అమితంగా ఆకట్టుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ స్పెషల్ ఎడిషన్ ఇప్పటి వరకు వచ్చిన జూమ్ స్కూటర్ల కంటే భిన్నంగా కనిపిస్తుంది. ఇందులో 110.9 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలదు. ఇది 7,250 ఆర్ పిఎమ్ వద్ద 8.2 బిహెచ్ పి పవర్ మరియు 5,750 ఆర్ పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

జూమ్ స్కూటర్ లోని అన్ని ఆప్షన్లలోనూ ఇదే ఇంజిన్ ఉంటుంది. జూమ్ కాంపాక్ట్ ఎడిషన్ స్టైల్ మరియు ఇంజిన్ పరంగా చూస్తే మునపటి మోడళ్ల మాదిరిగానే ఉంటాయి. జూమ్ జెడ్ఎక్స్ వేరియంట్ కార్నరింగ్ లైట్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో సెల్ ఫోన్ కు వచ్చే కాల్స్, టెక్స్ట్ మెసేజ్ లను కూడా చూడొచ్చు.
జూమ్ స్కూటర్‌లో 'హెచ్' ఆకారంలో ఉండే లైట్, ప్రొజెక్టర్ టు హెడ్లైట్, 'హెచ్' ఆకారంలో ఉండే ఎల్ఈడీ టెయిల్‌లైట్, ముందు భాగంలో డిస్క్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, USB సెల్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, లార్జ్ స్టోరేజ్ ఎల్ఈడీ లైట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా మరెన్నో అదనపు ఫీచర్లు ఈ స్కూటర్‌లో సంస్థ అందించింది.

హీరో మోటోకార్ప్ జూమ్ కాంబాట్ ఎడిషన్‌ని సాధారణ జూమ్ స్కూటర్ల కంటే రూ. 1000 తగ్గించింది. ప్రస్తుతం దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 80,967గా ఉండనుంది. యాక్టివాకు పోటీగా ఉన్న స్కూటర్ మోడళ్లలో జూమ్ ఒకటి. ఇది కచ్చితంగా యాక్టివా సేల్స్‌ని తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ స్కూటర్‌తో సేల్స్ భారీగా పెరుగుతాయని హీరో భావిస్తోంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








