టెంప్టింగ్ ఫీచర్లతో తక్కువ ధరలో హీరో సరికొత్త డాకర్ ఎడిషన్.. యూత్ పడిపోవడం ఖాయం..
ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్(Hero Motorcorp) భారత్‌లో అగ్రసంస్థగా ఉంది. ఈ కంపెనీ నుంచి విడుదలైన బైకులు, స్కూటర్లకు దేశంలో మంచి డిమాండ్ ఉంటుంది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో హీరో టూవీలర్స్‌ను కనిపిస్తూనే ఉంటాయి. ఇండియాలో అత్యధికంగా టూవీలర్స్‌ను సేల్ చేస్తున్న కంపెనీల లిస్ట్‌లో ఈ కంపెనీ మొదటి స్థానంలో ఉంటుంది. ముఖ్యంగా హీరో ఉత్పత్తులు మైలేజ్‌కు పెట్టింది పేరు. మధ్యతరగతి కస్టమర్లకు అందుబాటులో ఉండే ధరలోనే బైకులు, స్కూటర్లను విడుదల చేస్తుంది. రోజువారీ ప్రయాణాలకు హీరో ఉత్పత్తులు అత్యంత ప్రసిద్ధి చెందినవి. అయితే ఇటీవల సాధారణ మోడళ్లనే కాకుండా సూపర్ స్పోర్ట్స్ తరహా బైకులపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇప్పటికే హీరో, స్పోర్ట్స్ మోడల్ తరహా బైకులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి మిగతా కంపెనీలకు చెందిన సూపర్ స్పోర్ట్స్ బైకులకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి మోడళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
ఈ నేపథ్యంలో దాన్ని క్యాష్ చేసుకుని సాధారణ మోడళ్లతో పాటు స్పోర్ట్స్ మోడళ్ల పరంగా ఎక్కువ మార్కెట్ వాటాను సాధించడానికి హీరో కొత్తగా ఎక్స్‌పల్స్ 200 4వి ప్రో డాకర్ ఎడిషన్(Xpulse 200 4V pro dakar edition)ను విడుదల చేసింది. దీని ధర రూ.1.67 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ బైకును కొనుగోలు చేయాలనుకుంటున్న వారు వెంటనే బుక్ చేసుకోవడం ఉత్తమం.

ఎక్స్‌పల్స్ 200 4వి ప్రో డాకర్ ఎడిషన్‌ను కంపెనీ ప్రత్యేకంగా ప్రో వేరియంట్ ఆధారంగా తయారు చేసింది. ధర కూడా దీని కంటే రూ.3000 ఎక్కువగా ఉంటుంది. కొత్త డాకర్ ఎడిషన్ డిజైన్ సూపర్ స్పోర్ట్స్ బైకుల మాదిరిగా ఉంది. అడ్వాంచర్స్‌ను ఎక్కువగా ఇష్ట పడేవారు ఈ మోడల్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. కొత్త బైక్ ట్యాంక్‌పై డాకర్ లోగో, సైడ్, టెయిల్ ప్యానెల్‌లలో కొత్త గ్రాఫిక్స్‌ను కలిగి ఉంటుంది.
దీని ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, ప్రో డాకర్ ఎడిషన్‌లో 199.6cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. ఇది 8,500rpm వద్ద 18.9 bhp పవర్‌ను, 6,500rpm వద్ద 17.35 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ముందు 21-అంగుళాలు, వెనుక 18-అంగుళాల వైర్-స్పోక్డ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. రైడింగ్ సమయంలో స్కిడ్ కాకుండా ఉండటానికి రెండు వీల్స్‌కు డిస్క్ బ్రేకులను అందించారు.

ఫీచర్లు కూడా రైడర్లకు మంచి రైడింగ్ అనుభవాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి. USB ఛార్జర్, మూడు రైడిండ్ మోడ్స్, ర్యాలీ-శైలి విండ్‌షీల్డ్, ప్రకాశవంతమైన వెలుతురు ఇచ్చే హెడ్‌లైట్ సెటప్, మెరుగైన ఇండికేటర్లు ఈ బైకులో ఉన్నాయి. ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతాల్లో కూడా రయ్ మంటూ దూసుకుపోతుంది. ప్రధానంగా ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక మెరుగైన మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను అమర్చారు.
రైడర్లకు అదనపు రక్షణ అందించడానికి ఎక్స్‌పల్స్ 200 4వి ప్రో డాకర్ ఎడిషన్‌లో ABS సిస్టంను అందించారు. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 270mmగా ఉంది. ఇప్పుడు బుకింగ్స్ తెరిచే ఉన్నాయి. బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ త్వరలో డెలివరీలు ప్రారంభిస్తుంది. అధునాతనంగా ఉన్న బైక్ ఎన్ని సేల్స్ సాధిస్తాయో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








