యూత్‌కు ఇక పండగే.. అతి తక్కువ ధరలో అడ్వెంచర్ బైక్‌.. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌కు గట్టి పోటీ తప్పదు!

ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్(Hero Motocorp) అడ్వెంచర్ బైక్‌ల విభాగంలో తన మార్కెట్‌ను పెంచుకోడానికి కొత్తగా 'ఎక్స్‌పల్స్ 210 (Xpulse 210)'అనే మోడల్‌ను తీసుకురావాలని చూస్తుంది. ఈ బైకును ఇటీవల జరిగిన EICMA 2024 మోటార్‌సైకిల్ ఈవెంట్‌లో కంపెనీ ఆవిష్కరించింది. ఇది స్పోర్ట్స్ మోడల్ లుక్‌ను కలిగి ఉంది. అడ్వెంచర్‌లు కోరుకునే వారికి బాగా సెట్ అవుతుంది. ప్రస్తుతం యూత్ ఎక్కువగా సాహసాలను కోరుకుంటున్నారు. దీంతో ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్, ఇతర కంపెనీలకు చెందిన మోడళ్లు వాటి ఫెర్ఫామెన్స్‌తో అందరిని ఆకట్టుకుంటున్నాయి. అయితే హీరో కంపెనీ మాత్రం కొంత వెనుకబడి ఉంది. కాబట్టి తన మార్కెట్‌ను పెంచుకోడానికి అడ్వెంచర్‌లకు అనుకూలంగా ఉండే ఎక్స్‌పల్స్ 210‌ను తీసుకొస్తుంది. హిమాలయన్ మోడల్ ఏ విధంగా క్లిక్ అయిందో కొత్త ఎక్స్‌పల్స్210 సైతం ఎక్కువ డిమాండ్ బైకుగా నిలుస్తుందని కంపెనీ అంచనా వేస్తుంది.

ఇంజిన్: ఎక్స్‌పల్స్ 210 హైవే రైడింగ్‌లు, కొండ ప్రాంతాల్లోని రోడ్లపై సైతం సాఫీగా ప్రయాణిస్తుంది. ఇది 210 cc సింగిల్-సిలిండర్, DOHC ఇంజిన్‌ను కలిగి ఉంది. 24.5 bhp పవర్, 20.4 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేగం కంట్రోల్ కోసం ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌‌ను జత చేశారు. లాంగ్ రైడింగ్, పర్వత ప్రాంతాల్లో కూడా భారీ ఇంజిన్‌తో ఎక్స్‌పల్స్ రయ్ మంటూ దూసుకుపోతుంది.

Hero Xpulse 210 Adventure Bike Design

డిజైన్: దీని సీటు చాలా సౌకర్యవంతంగా మెత్తగా ఉంటుంది. డిజైన్ డాకర్ బైకుల మాదిరిగా ఉంది. కొండ ప్రాంతాల్లో గుంతలు, మట్టి రోడ్లపై కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించడానికి మొత్తని సీటు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ముందు, వెనుక డిజైన్ యువతను కట్టిపడేసేలా ఉంది. వరద ప్రాంతాల్లో కూడా దూసుకెళ్లడానికి 220 mm గ్రౌండ్ క్లియరెన్స్, అడ్జస్టబుల్ హ్యాండిల్‌బార్‌ను అందించారు.

ఫీచర్లు: ముందు LED హెడ్‌ల్యాంప్‌లతో పాటు H-ఆకారపు LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌ల సెటప్‌ ఉంది. ఈ బైక్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో వస్తుంది. 4.2-అంగుళాల TFT కన్సోల్‌, పూర్తి LED డిస్‌ప్లే, ఓడోమీటర్, టాకోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, క్లస్టర్ స్పీడోమీటర్, ఫోన్ కాల్, sms అలర్ట్‌లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్, డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ మొదలగునవి ఉన్నాయి.

ఎక్స్‌పల్స్ 210 ప్రధానంగా అడ్వెంచర్‌లకు ప్రసిద్ధి చెందిన మోడల్ కావడంతో కంపెనీ మెరుగైన సస్పెన్షన్‌ను అందించింది. ముందు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పర్వత ప్రాంతాల్లో రైడింగ్‌ ఈజీ అవుతుంది. ఆఫ్-రోడ్ సామర్థ్యం కోసం బైక్ ర్యాలీ కిట్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ఆఫ్-రోడ్ సామర్థ్యం కోసం బైక్ ర్యాలీ కిట్‌ను అందిస్తున్నారు.

ఇది డ్యూయల్-పర్పస్ టైర్‌లతో ముందు 21-అంగుళాలు, వెనుక 18-అంగుళాల స్పోక్డ్ వీల్స్‌పై రన్ అవుతుంది. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఈ బైక్ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ పేర్కొంటుంది. అడ్వెంచర్‌ బైక్ అయినప్పటికి కూడా ఇది చాలా తక్కువ ధరలో లభిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ధర తక్కువగా ఉండటం వలన ఇతర మోడళ్లకు పోటీగా మార్కెట్లో పెను తుఫాను సృష్టించే అవకాశం ఉంది

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, November 11, 2024, 10:30 [IST]
English summary
Hero xpulse 210 adventure bike design and all top specifications details check here
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+