యూత్‌కు ఇది పెద్ద గుడ్‌న్యూస్.. అతి తక్కువ ధరలో అడ్వెంచర్ బైక్.. అదిరిపోయే ఫీచర్లతో త్వరలో లాంచ్!
ప్రపంచంలోనే కాకుండా భారత్‌లో కూడా అడ్వెంచర్ బైక్‌లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే టాప్ తయారీ కంపెనీలు ఈ తరహా మోడళ్లను అధికంగా విడుదల చేయగా, ప్రముఖ కంపెనీ హీరో మోటోకార్ప్(Hero Motocorp) నుంచి త్వరలో ఇలాంటి బైక్ ఒకటి విడుదల కాబోతుంది. ఈ మోడల్ పేరు 'ఎక్స్‌పల్స్ 210 (Xpulse 210)'. తాజాగా దీనిని కంపెనీ EICMA 2024 ఈవెంట్‌లో ఆవిష్కరించింది. ఈ షోలో కనిపించిన అడ్వెంచర్ బైక్ చూడటానికి స్టైలీష్‌గా ఉంది. దీని రూపం చూడగానే సాహసాలను కోరుకునే వారికి సరిగ్గా సరిపోయేలా ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోడల్ ఏ విధంగా అయితే ఆదరణ సంపాదించిందో కొత్త ఎక్స్‌పల్స్210 సైతం ఈ విభాగంలో ఎక్కువ డిమాండ్ బైకుగా సరికొత్త రికార్డులను సాధిస్తుందని కంపెనీ అంచనా వేస్తుంది.
హీరో మోటోకార్ప్ చాలా కాలంగా ఎక్స్‌పల్స్ 210ని మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. కంపెనీ దీనికి సంబంధించిన పలు అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది. ఇటీవల నివేదికల ప్రకారం ఈ బైక్ రానున్న నెలల్లో మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త హీరో ఎక్స్‌పల్స్ 210 బైక్‌కి సంబంధించిన కొత్త టీజర్ ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతుంది.

హీరో ఎక్స్‌పల్స్ 210లో కొత్త LED హెడ్‌ల్యాంప్‌లతో పాటు H-ఆకారపు LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌ల సెటప్ ఉంది. ఈ బైక్ ఇటీవల లడఖ్‌లోని ఖర్దుంగ్‌లా సమీపంలో కనిపించింది. దీనిలో అమర్చిన ఇంజిన్ లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చింది. ఇది 210 cc సింగిల్-సిలిండర్, DOHC ఇంజిన్‌ను కలిగి ఉంది. బైక్ ఇంజిన్ 24.5 bhp పవర్, 20.4 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
హైవే రైడింగ్‌లు, కొండ ప్రాంతాల్లోని రోడ్లపై సైతం ఎక్స్‌పల్స్ చాలా ఈజీగా ప్రయాణిస్తుంది. రైడింగ్ వేగం కంట్రోల్ కోసం ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇంకా ఈ బైక్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పాటు 4.2-అంగుళాల TFT కన్సోల్, పూర్తి LED డిస్‌ప్లేను కలిగి ఉంది. ముందు ఓడోమీటర్, టాకోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, క్లస్టర్ స్పీడోమీటర్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

ఇంకా, డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. అలాగే, ఇది ప్రధానంగా అడ్వెంచర్‌లకు ప్రసిద్ధి మోడల్ కావడంతో దీనిలో మెరుగైన సస్పెన్షన్‌ను అందించారు. ముందు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్‌ను అమర్చారు. దీంతో ఎత్తైన కొండ ప్రాంతాల్లో కూడా రైడింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఎంత దూరం రైడింగ్ చేసిన అలసట కాకుండా చూడటానికి మెత్తని సీటును అందించారు.

కఠినమైన ప్రాంతాల్లో బైక్ వేగాన్ని కంట్రోల్ చేయడానికి బ్రేకింగ్ కోసం స్విచ్ చేయగల ABSతో ఇరువైపులా డిస్క్ బ్రేక్‌లను అందించారు. ఇది 220 mm అధిక గ్రౌండ్ క్లియరెన్స్, సర్దుబాటు హ్యాండిల్‌బార్‌ను కలిగి ఉంటుంది. ఆఫ్-రోడ్ సామర్థ్యం కోసం బైక్ ర్యాలీ కిట్‌ను అందిస్తున్నారు. ఇది డ్యూయల్-పర్పస్ టైర్‌లతో ముందు 21-అంగుళాలు, వెనుక 18-అంగుళాల స్పోక్డ్ వీల్స్‌పై నడుస్తుంది. అన్ని వాతావరణ పరిస్థితులకు ఈ బైక్ అనుకూలంగా ఉంటుంది.

ఈ బైకులో కాల్, SMS అలర్ట్స్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీని, అలాగే టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఇతర కనెక్టివిటీ ఫీచర్‌లను అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మోడల్‌ను పలు రకాలుగా టెస్టింగ్ చేసిన తరువాత ఈవెంట్‌లో ప్రదర్శించారు. దీని ధర కూడా అతి తక్కువలో ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు ప్రత్యేకంగా పేర్కొంటున్నాయి. ధర తక్కువగా ఉండటం వలన ఈ మోడల్ మార్కెట్లో పెను తుఫాను సృష్టించే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications








