Hero Xtreme 125R హీరో మోటోకార్ప్‌ నుంచి స్టైలిష్‌ బైక్‌ ఎక్స్‌ట్రీమ్‌ 125R లాంచ్‌.. ధర రూ. 95,000

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్‌ నుంచి మరో కొత్త బైక్‌ నేడు మార్కెట్లోకి విడుదలైంది. స్టైలిష్‌ లుక్‌లో కొత్త ఎక్స్‌ట్రీమ్‌ 125ఆర్‌(Hero Xtreme 125R) బైక్‌ను హీరో వరల్డ్‌ ఈవెంట్‌లో లాంచ్‌ చేసింది. 125 సీసీ సెగ్మెంట్‌లో ఈ బైక్‌ ప్రత్యర్థి కంపెనీ మోడల్‌ టీవీఎస్‌ రైడర్‌ 125 కి గట్టి పోటీనివ్వనుంది.

దేశంలో హీరో మోటోకార్ప్‌ బైక్‌లకు మంచి ప్రజాదరణ ఉంది. తక్కువ ధరలో అధిక పనితీరుతో ఉండటంతో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఈ బైక్‌లను ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో హీరో మోటోకార్ప్‌ నుంచి మరో బడ్జెట్‌ ఫ్రెండ్లీ బైక్‌ లాంచ్‌ అయింది. 125 సీసీ సెగ్మెంట్‌లో పోటీగా వస్తున్న హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125R ను సంస్థ రూ. 95,000(ఎక్స్‌-షోరూమ్‌) ధరతో విడుదల చేసింది.

Hero-Xtreme-125R

హైపర్‌ స్టైలిష్‌ డిజైన్‌ లుక్‌తో సాంప్రదాయక కమ్యూటర్‌ బైక్‌లతో పోలిస్తే విభిన్నంగా ఎక్స్‌ట్రీమ్‌ 125R విడుదలైంది. డిజైన్‌ విషయానికొస్తే.. రేజర్‌ షార్ప్‌ స్టైలింగ్‌తో హెడ్‌ల్యాంప్‌ అప్‌ఫ్రంట్‌తో ఈ బైక్‌కు ఆకర్షణీయమైన లుక్‌ను జోడిస్తుంది. ఇరువైపులా LED టర్న్‌ ఇండికేటర్లు, లో స్లంగ్‌ హెడ్‌ల్యాంప్‌, పైన DRL తో బ్యూటిఫుల్‌గా ఉంటుంది.

స్పోర్టీ లుక్‌తో కనిపించేలా Hero Xtreme 125R లో ఫ్యూయెల్‌ ట్యాంక్‌ను రూపొందిండంతో పాటు స్ప్లిట్‌ సీట్లు, స్ప్లిట్‌ గ్రాబ్‌ రైల్స్‌తో కూడి ఉంటుంది. ఇంజిన్‌ విషయానికొస్తే.. 125 CC సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 8,250 rpm వద్ద 11.39 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

Hero-Xtreme-125R

కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125Rలో ముందు వైపు 37mm టెలిస్కోపిక్‌ ఫోర్క్‌లు, వెనుకవైపు మోనో షాక్‌ను కలిగి ఉంది. బ్రేకింగ్‌ను పరిశీలిస్తేయ. ఫ్రంట్‌ డిస్క్‌, వెనుక భాగంలో డ్రమ్‌ బ్రేక్‌ లేదా డిస్క్‌ ఆప్షన్‌తో వస్తుంది. ఇందులో సింగిల్‌ ఛానల్‌ ABSను స్టాండర్డ్‌గా అందించారు. అయితే కస్టమర్లు డ్యూయల్‌ ఛానల్‌ ABS తో కూడా ఈ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. 99,500(ఎక్స్‌-షోరూమ్‌).

Hero-Xtreme-125R

ఫీచర్ల పరంగా హీరో ఎక్స్‌ట్రీమ్‌ 125ఆర్‌లో ఒక LCD యూనిట్‌తో కూడిన డిజిటల్‌ కన్సోల్‌ ప్యాక్‌తో వస్తుంది. హీరో వరల్డ్‌లో హీరో మోటోకార్ప్‌ ఈ సరికొత్త బైక్‌ను లాంచ్‌ చేసింది. బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ బైక్‌ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు. దీంతో పాటు హీరో వరల్డ్‌లో సంస్థ Marvic 440, Xoom 125R, Xoom 160 లను పరిచయం చేసింది.

Hero-Xtreme-125R

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 23, 2024, 13:46 [IST]
English summary
Hero xtreme 125r stylish bike launched in india price specs features details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+