రూ. 1.11 లక్షలకే స్పోరీ లుక్‌తో 'హీరో ఎక్స్‌ట్రీమ్‌ 160R 2V' బైక్‌ విడుదల.. పలర్స్‌ N150, FZల కంటే ధర తక్కువ!

హీరో మోటోకార్ప్ సరికొత్త అప్‌గ్రేడ్స్‌తో బైక్‌లను ప్రవేశపెడుతుంది. ఆ కంపెనీ లైనప్‌లోని హీరో ఎక్స్‌ట్రీమ్‌ బైక్స్‌కి ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా హీరో ఎక్స్‌ట్రీమ్‌ 160R 2V (Hero Xtreme 160R 2V) ని లాంచ్ చేసింది. ఇందులో 2V అంటే ఇంజిన్ సిస్టమ్‌లో 2 వాల్వ్‌లు ఉంటాయి. హీరో మోటోకార్ప్ నుంచి అందుబాటులో ఉన్న మోటార్‌సైకిళ్లలో ఇది అత్యంత స్టైలిష్ బైక్‌గా ఉంటుంది. జనాలు కూడా ఈ సిరీస్‌ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ బైక్‌ నేరుగా బజాజ్ పల్సర్ 150కి పోటీ ఇస్తుంది. హీరో మోటోకార్ప్‌లో స్టైలిష్ లుక్, శక్తివంతమైన ఇంజిన్‌ కలిగిన బైక్‌ కొనుగోలు చేయాలనుకుంటే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పవచ్చు.

ఈ కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్‌ 160R 2V ధర రూ .1.11 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. సింగిల్ బ్లాక్ కలర్‌ వేరియంట్‌లో ప్రవేశపెట్టిన ఈ బైక్ చూపరులను కట్టి పడేస్తుంది. మంచి స్పోర్టీ లుక్‌, తక్కువ ధరలో బైక్‌ కావాలని చూసే వారికి ఇది సరిపోతుంది. దీని వెనుక భాగం డ్రమ్ బ్రేక్‌తో వస్తుంది. ఈ కొత్త ఎక్స్ ట్రీమ్ 160ఆర్ 2V లోని టాప్‌-5 ఫీచర్లు మీకోసం..

Hero Xtreme 160R 2V

డిజైన్ అప్‌డేట్స్: ప్రస్తుత హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V మాదిరిగానే, కొత్త ఎక్స్‌ట్రీమ్ 160R 2V టెయిల్ లైట్, సింగిల్ పీస్ సీట్‌తో కొత్త డిజైన్‌ని కలిగి ఉంటుంది. రైడర్ సౌకర్యానికి అనుగుణంగా సీటింగ్ పొజిషన్‌ని కొద్దిగా సవరించారు. అదేవిధంగా వెనుక సీటు ప్యాసింజర్ సీటు ఎత్తుతో పాటు కొద్దిగా పొడవును తగ్గించారు.

పవర్‌ట్రెయిన్: కొత్త ఎక్స్‌ట్రీమ్‌ 160R 2V 163.2 సీసీ, సింగిల్ సిలిండర్, 2 వాల్వ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 8,500 rpm వద్ద 15 bhp పవర్ 6,500 rpm వద్ద 14 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. డైమండ్ ఫ్రేమ్‌లో డిజైన్ చేసిన ఈ బైక్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌ 12 లీటర్ల కెపాసిటీతో వస్తుంది.

Hero Xtreme 160R 2V Price

సస్పెన్షన్ & డైమెన్షన్స్‌: ఎక్స్‌ట్రీమ్ లోని సస్పెన్షన్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్‌, వెనుక భాగంలో మోనోషాక్‌తో వస్తుంది. కొత్త ఎక్స్‌ట్రీమ్ 160R 2V 145 కిలోల బరువుని కలిగి ఉంటుంది. ఇక టైర్లు ఎక్స్‌ట్రీమ్ 160R 4V మాదిరిగానే ఉంటాయి. డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవు.

సింగిల్-ఛానల్ ఏబీఎస్‌: ఎక్స్‌ట్రీమ్‌ 160R 4V డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌ని పొందుతుంది. కొత్త బైక్ సింగిల్-ఛానల్ ఏబీఎస్‌తో వస్తుంది. బైక్ వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉండటంతో సింగిల్-ఛానల్ ఏబీఎస్‌ని మాత్రమే అందించగలరు. ఈ మార్పుతో 4V కంటే 2V ధర సుమారు రూ.28,000 చౌకగా లభిస్తుంది.

Hero Xtreme 160R 2V Launch

ధర: కొత్త హీరో ఎక్స్ ట్రీమ్ 160R 2V ధర రూ .1.11 లక్షలు మాత్రమే ఉంటుంది. బజాజ్ ఆటో ఎన్ 150, యమహా FZ వంటి వాటికి పోటీగా ఉంటుంది. పల్సర్ N150 ధర రూ .1.25 లక్షలు యమహా FZ ధర రూ .1.17 లక్షల నుంచి రూ .1.30 లక్షల మధ్య ఉంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, September 16, 2024, 11:07 [IST]
English summary
Hero xtreme 160r 2v stealth motorcycle top 5 things details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+