ఈ స్కూటర్లపై షాపింగ్‌కి వెళ్తే క్యారీ బ్యాగ్స్‌తో పని లేదు.. వీటిలో స్పేస్ చాలా ఎక్కువ గురూ
ఎక్కువ బూట్ స్పేస్ (సీటు కింద స్థలం) అందించే స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. మంచి ఫీచర్లు, రేంజ్‌తో పాటు మంచి అన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రతీ రోజు మార్కెట్‌లోకి స్కూటర్లు విడుదల అవుతున్నాయి. అందులో ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఉన్నాయి.
ప్రస్తుత జీవితంలో టూ-వీలర్ అనేది సర్వసాధారణం అయ్యింది. ప్రతీ ఇంట్లో టూ-వీలర్ అందుబాటులో ఉంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దేశంలో పూర్తి స్మార్ట్ అప్‌గ్రేడ్‌లతో టూ-వీలర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఈ ఫీచర్లు ఎక్కువ. దేశంలో ఎక్కువ బూట్ స్పేస్‌తో అందుబాటులో ఉన్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితా మీకోసం..

రివర్ ఇండీ (43-లీటర్): ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిలో అత్యధిక బూట్ స్పేస్‌ని ఈ స్కూటర్ కలిగి ఉంది. అత్యధిక బూట్ స్పేస్ థీమ్‌తో రివర్ కంపెనీ ఈ స్కూటర్‌ని ప్రవేశ పెట్టింది. ఇందులో 43 లీటర్ల బూట్ స్టోరేజ్ ఉంది. కొత్త రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.25 లక్షలుగా ఉంది. ఇందులో పూర్తి అప్‌డేట్స్‌తో కూడిన స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.
ఏథర్ రిజ్టా (34 లీటర్లు): ఏథర్ నుంచి కొత్తగా లాంచ్ అయిన స్కూటర్ ఇది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సుమారు 34 లీటర్ల బూట్ స్పేస్‌ని కలిగి ఉంది. ఏథర్ రిజ్టా స్కూటర్ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అవి S మరియు Z వేరియంట్లు. S వేరియంట్ 2.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 123 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

రెండో బ్యాటరీ ఆప్షన్ విషయానికి వస్తే ను పరిశీలిస్తే, అథర్ రిజ్టా జెడ్ (లాంగ్ రేంజ్) వేరియంట్ 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 159 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ వేరియంట్‌లో పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిని 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాలు పడుతుంది. మంచి బూట్ స్పేస్ కోసం ఈ రిజ్టా స్కూటర్లను ట్రై చేయవచ్చు.
సెకండ్ జనరేషన్ ఓలా ఎస్1 లైనప్ (34 లీటర్లు): సెకండ్ జనరేషన్ ఓలా ఎస్1 లైనప్ స్కూటర్లు 34 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉన్నాయి. ఓలా ఎస్ 1 ప్రో ప్రారంభ ధర రూ. 1,47,499గా ఉంది. ఇది ఏథర్ స్కూటర్ కంటే కొంచెం ఎక్కువ. బడ్జెట్‌ని బట్టి మీకు నచ్చిన స్కూటర్‌ని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ స్కూటర్లు ఈ విభాగంలో తొలి స్థానంలో ఉన్నాయి.

టీవీఎస్ ఐ-క్యూబ్ (32-లీటర్): టీవీఎస్ ఐ-క్యూబ్ 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీనిని లో వేరియంట్ ధర రూ. 94,999గా ఉంది. ఈ స్కూటర్లను ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 75 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. పార్కింగ్ అసిస్టన్స్, యాంటీ థెఫ్ట్ లాక్, ఇంకా మరెన్నో అధునాతన ఫీచర్లున్నాయి. మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఈ స్కూటర్‌ని నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు.
సింపుల్ 1 (30 లీటర్లు): సింపుల్ ఎనర్జీ తయారు చేసిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సుమారు 30 లీటర్ల బూట్ స్పేస్‌ని కలిగి ఉంది. ఇది 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది పూర్తి ఛార్జ్ చేస్తే లీటరుకు 151 కిలోమీటర్ల నుంచి 160 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇందులోని శక్తిమంతమైన మోటారును ఉపయోగించారు. ఇందులోనూ పూర్తి స్మార్ట్ అప్‌గ్రేడెడ్ ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








