దేశంలోనే అందరికి ఇష్టమైన బైక్ కొత్త అప్‌డేట్స్‌తో వచ్చింది.. హోండా 2025 యునికార్న్ 160 లాంచ్

దేశీయ దిగ్గజ కంపెనీ హోండా(Honda) ఇటీవల కొద్ది నెలల నుంచి మార్కెట్లో వరుసగా దండయాత్ర చేస్తుంది. వరుసబెట్టి వాహనాలను విడుదల చేస్తుంది. మరికొద్ది రోజుల్లో 2024 ఏడాది ముగుస్తుంది అనగా తన పాత మోడళ్లను సరికొత్తగా అప్‌డేట్ చేస్తూ లాంచ్ చేస్తుంది. కొద్ది రోజుల క్రితం 2025 యాక్టివా(Activa) స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఆ తరువాత మూడు రోజుల క్రితం SP 160 మోడల్‌ను కూడా విడుదల చేసింది. అయితే ఇప్పుడు తాజాగా ఫేవరెట్ మోడల్ అయిన 2025 యునికార్న్ 160(Unicorn 160)) బైక్‌‌ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. 2024 ఏడాదిని ఎప్పటికి గుర్తుంచుకునేలా ఈ అధునాతన మోడళ్లను తీసుకొచ్చింది. హోండా కంపెనీ నుంచి తాజాగా విడుదల అయిన యునికార్న్ 160 బైక్‌ ధర రూ.1.19 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ఇది బేస్ వేరియంట్ ధర మాత్రమే.

పాత యూనికార్న్ మోడల్‌తో పోలిస్తే 2025 మోడల్ ధర రూ.8 వేలు ఎక్కువగా ఉంది. భారత్‌లో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు, వారి రోజువారి అవసరాలకు ఇది సరైన ఆప్షన్ అవుతుంది. అయితే ధర మరింత పెరగడానికి ప్రధాన కారణం కొత్తగా మరిన్ని లేటెస్ట్ ఫీచర్లను అదనంగా జోడించారు. దీంతో ధర కాస్త పెరిగింది. ఇది మూడు కొత్త కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Honda 2025 Unicorn 160 Price

2025 యునికార్న్ 160 ఇంజిన్‌ను తక్కువ కాలుష్యానికి కారణమయ్యే OBD2B ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు. అదే పాత మోడల్‌లో ఇలాంటి ఫీచర్ ఉండదు. ఇంజిన్ పనితీరుతో బైక్ మైలేజ్ కూడా ఎక్కువగానే వస్తుంది. ముందు కొన్ని అప్‌డేట్‌లు చేశారు. అలాగే, క్రోమ్ ట్రిమ్‌తో కొత్త LED హెడ్‌ల్యాంప్‌లను కూడా ఉంటాయి. ఈ కొత్త మార్పులు తప్ప పాత మోడల్‌తో పోలిస్తే 2025 యునికార్న్‌లో పెద్ద మార్పులు ఏవి లేవు.

ఇంజిన్ పనితీరు విషయానికి వస్తే, 162.7 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 13 bhp పవర్, 14.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. ఫీచర్ల పరంగా చూసినట్లయితే పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి. డిజిటల్ క్లస్టర్‌లో సర్వీస్ రిమైండర్, రైడింగ్ స్పీడ్, గేర్‌ పొజిషన్‌ ఇండికేటర్ వంటివి ఉంటాయి.

Honda 2025 Unicorn 160 Details

పాత యూనికార్న్‌కు చెందిన పెరల్‌ సిరెన్‌ బ్లూ కలర్‌ను తొలగించి 2025 మోడల్‌ను పెరల్‌ ఇగ్నియస్‌ బ్లాక్‌, రేడియంట్‌ రెడ్‌ మెటాకిల్‌, మ్యాటీ యాక్సిస్‌ గ్రే మెటాలిక్‌ కలర్ వేరియంట్లలో అందించారు. ఈ బైక్ పొడవు 2,081 మిమీ, వెడల్పు 756 మిమీ, ఎత్తు 1,103 మిమీగా ఉంది. అదే గ్రౌండ్ క్లియరెన్స్ 187 మిమీ, వీల్‌బేస్ 1,335 మిమీగా ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు.

2025 యునికార్న్ 160 దేశీయ మార్కెట్లో అమ్మకాల పరంగా సరికొత్త మైలు రాయిని సాధిస్తుందని కంపెనీ అంచనాలు పెట్టుకుంది. మిడిల్ క్లాస్ వినియోగదారులను ఈ బైక్ కచ్చితంగా ఆకట్టుకుంటుందని మార్కెట్ వర్గాలు సైతం భావిస్తున్నాయి. 2025 ఏడాదిలో ఈ మోడల్ హోండాకు సేల్స్ పరంగా బెస్ట్ బైక్‌గా నిలవనుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, December 27, 2024, 8:30 [IST]
English summary
Honda 2025 unicorn 160 launched in india at rs 1 19 lakh
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+