హోండా యాక్టివా ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ బుకింగ్స్‌ తేదీ వెల్లడి.. ముందే బుక్‌ చేసుకుంటే మీకే మంచిది!

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్స్ అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. కొత్త కొత్త స్టార్టప్‌ కంపెనీల రాకతో చాలామంది ఏ స్కూటర్‌ కొనాలో తెలియక తికమక పడుతున్నారు. స్కూటర్‌ విభాగంలో రారాజుగా ఉన్న హోండా నుంచి ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ రాలేదు. తాజాగా హోండా యాక్టివా స్కూటర్‌ని ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో లాంచ్‌ చేసింది. స్కూటర్‌ లవర్స్‌ ముఖ్యంగా యాక్టివాను ఎక్కువగా ఇష్టపడే వారికి ఇది ఓ శుభవార్తే అని చెప్పాలి. టీవీఎస్‌, బజాజ్‌ చేతక్‌ నుంచి టాప్‌ క్లాస్‌ ఈవీ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే యాక్టివా క్రేజ్‌ గురించి మార్కెట్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దీని రాకతో ఇతర కంపెనీల సేల్స్‌ కాస్త పడిపోయే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విభాగంలో స్టార్టప్ కంపెనీలతో రాకతో పాటు టాప్‌ బ్రాండ్స్‌ నుంచి స్కూటర్లు అందుబాటులో ఉండటంతో జనాలు ఏది కొనాలో తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా వచ్చినట్లు హోండా మోటార్‌ సైకిల్‌ ఇండియా హోండా యాక్టివా e (Honda Activa e), హోండా క్యూసీ1 (Honda QC1) రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లను లాంచ్‌ చేసింది. ఈ స్కూటర్ల బుకింగ్, డెలివరీ టైమ్‌లైన్స్‌ విడుదలయ్యాయి.

Honda Activa e and QC1 Electric Scooter Bookings Dates

జనవరి 1 నుంచి ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. అలాగే ఫిబ్రవరి ఆరంభం నుంచే డెలివరీ చేయనున్నారు. ముందుగా మెట్రో నగరాల్లో వీటిని విక్రయించనున్నారు. ఇందుకోసం దేశంలో హోండాకు చెందిన నాలుగు ఫెసిలిటీ సెంటర్లు మనేసర్ (హర్యానా), అల్వార్ (రాజస్థాన్), నర్సాపుర (కర్ణాటక), విఠల్పూర్ (గుజరాత్)లో ఉత్పత్తి చేయనుంది. ఈ సెంటర్ల నుంచి ఏడాదిలో సుమారు 6.2 మిలియన్‌ యూనిట్లను తయారు చేయనున్నారు.

వీటి డిజైన్ విషయానికి వస్తే ముందు, వెనక ఎల్ఈడి కాంబినేషన్ లైట్స్, ఇండికేటర్లను పొందుతుంది. ఈ యాక్టివా స్కూటర్లు పర్ల్ షాలో బ్లూ, పర్ల్‌ మిస్టీ వైట్, పర్ల్ సెరినిటీ బ్లూ, మ్యాట్ ఫాగీ సిల్వర్ మెటాలిక్, పర్ల్ ఇగ్నియస్ బ్లాక్ అనే ఐదు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఫ్లష్‌ ఫిట్టింగ్‌ పిలియన్‌ రైడర్‌ ఫుట్‌రెస్ట్‌ కలవు. ఇతర స్కూటర్ల కంటే ఢిఫరెంట్‌ స్టైలింగ్‌తో ఈ స్కూటర్‌ని ప్రవేశపెట్టారు.

Honda Activa e and QC1 Electric Scooters

ఇందులో యాక్టివా-ఇ రెండు స్వాపబుల్‌ బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్స్‌ (1.5 kWh+1.5 kWh)తో వస్తుంది. ఇందులోని 6 kWh కిలోవాట్ల మాగ్నెటిక్ ఎలక్ట్రిక్ మోటారు 22 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఈ రెండు బ్యాటరీ ప్యాక్స్ కలిపి సుమారు 102 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుందని హోండా క్లెయిమ్ చేస్తుంది. హోండా పవర్ ప్యాక్ ఎక్స్ఛేంజర్స్ వద్ద బ్యాటరీలను స్పాప్‌ చేసుకోవచ్చు.

ఇక హోండా క్యూసీ1 (1.5 కిలోవాట్ల ఫిక్స్‌డ్‌) బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీనిని ఫుల్‌ ఛార్జ్ చేయడానికి సుమారు ఏడు గంటల సమయం పడుతుంది. ఇందులోని BLDC ఎలక్ట్రిక్‌ మోటార్‌ 1.8 కిలోవాట్ల (2.4 bhp)ని, 77 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది గంటకు 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయామిస్తుంది. 0-40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 9.4 సెకన్లు పడుతుంది.

Honda Activa e

ఎంట్రీ లెవల్ యాక్టివా ఇ లిమిటెడ్‌ బ్లూటూత్ ఫంక్షనాలిటీతో వస్తుంది. ఇందులో కేవలం 5 అంగుళాల TFT డిస్ప్లే మాత్రమే ఉంటుంది. అయితే టాప్-స్పెక్(Road Sync Duo) వేరియంట్‌లో మాత్రం టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, నోటిఫికేషన్ అలర్ట్స్‌ని అందించే 7.0-అంగుళాల డిస్ప్లే కలదు. హ్యాండిల్ బార్ వద్ద ఉండే స్విచ్‌ల ద్వారా స్క్రీన్‌ని డే అండ్ నైట్ మోడ్స్‌కి మార్చుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, November 29, 2024, 15:16 [IST]
English summary
Honda activa e and qc1 electric scooters bookings start from january 1
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+