యాక్టివా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ వచ్చేసింది.. మంచి స్కూటర్‌ మించినా దొరకదు.. దీని రేంజ్ ఎంతంటే!

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలను విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చాలా మంది పెట్రోల్ బైకులు, స్కూటర్లను కాకుండా ఈవీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా(Honda) తన ఫెవరేట్ స్కూటర్ యాక్టివాను ఈవీ వెర్షన్‌లో తీసుకువచ్చింది. యాక్టివా మోడల్‌కు ఇండియాలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దేశంలోని ప్రతి నగరం, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇది కనిపిస్తుంది. గ్రామీణ రోడ్లకు, నగరాల్లో ట్రాఫిక్ మధ్య కూడా రైడ్ చేయడానికి ఇది అత్యుత్తమైన మోడల్‌గా ప్రజలందరి చేత కితాబు అందుకుంది. ఇంత మంచి పేరున్న యాక్టివా ఇప్పుడు ఈవీ విభాగంలో కూడా తన సత్తా చాటడానికి యాక్టివా ఈ(Activa E) పేరుతో వచ్చింది. దీంతో పాటే హోండా మరో ఈవీ స్కూటర్‌ క్యూసీ1 (QC1) ను కూడా వినియోగదారుల కోసం తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది.

గతంలోనే హోండా ఈవీ స్కూటర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించగానే చాలా మంది ఆన్‌లైన్‌లో వీటి గురించి వెతికారు. కొంతమంది అయితే ఏకంగా హోండా షోరూమ్‌ల వద్ద కూడా సంప్రదించారు. ఇంత డిమండ్ ఉన్న యాక్టివా ఈ మోడల్‌తో పాటు QC1 కూడా తాజాగా మార్కెట్లోకి వచ్చాయి. వీటి రాకతో ఇప్పుడు ఈవీ స్కూటర్ల పరంగా కంపెనీల మధ్య గట్టి పోటీ ఎదురుకానుంది.

Honda Ev Scooter Unveiled In India

యాక్టివా ఈ మోడల్‌ను కంపెనీ ఇండియాతో పాటు ఇతర అభివృద్ది చెందుతున్న మార్కెట్ల కోసం తయారు చేసింది. అదే QC1ను దేశీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్స్ 2025 ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభం అవుతాయని కంపెనీ వెల్లడించింది. ధరల వివరాలు కూడా ఇదే సమయంలో వెల్లడించనున్నారు. బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు 2025 మధ్య భాగంలో డెలివరీ చేసే అవకాశం ఉంది.

ఈ రెండు కూడా ఎలక్ట్రిక్ వెర్షన్ అయినప్పటికీ వీటి మధ్య బ్యాటరీ విషయంలో తేడా ఉంది. యాక్టివా ఈ బ్యాటరీని బయటకు తీసి మార్చుకోవచ్చు, అదే QC1 బ్యాటరీ మాత్రం లోపలే స్థిరంగా ఉంటుంది. దీన్ని బయటకు తీయడానికి కుదరదు. ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి యాక్టివా ఈ బాగా ఉపయోగపడుతుంది. అదే QC1 మాత్రం తక్కువ దూర ప్రయాణాలకు ఉపయోగకరంగా ఉంటుంది.

Honda Activa e And QC1 Ev Scooter Unveiled

ఈ యాక్టివా ఇ రెండు 1.5kWh కెపాసిటీ గల స్వాపబుల్ బ్యాటరీలతో వస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 8bhp పవర్, 22Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌లో 102 కి.మీల వరకు రయ్ మంటూ దూసుకుపోతుంది. గరిష్ట వేగం గంటకు 80 కిమీ గా ఉంది. ఈ స్కూటర్‌ కేవలం 7.3 సెకన్లలో 0 నుంచి 60 కిమీ వేగాన్ని అందుకుంటుంది.

ఇది ఎకాన్, స్టాండర్డ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంది. యాక్టివా ఈ డిజైన్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. పెట్రోల్ వెర్షన్ కంటే కొంచె భిన్నంగా ఉంది. ముందు భాగంలో LED హెడ్‌ల్యాంప్, డ్యూయల్ టోన్ సీటు, 7.0-అంగుళాల TFT స్క్రీన్‌, స్మార్ట్ కనెక్టివిటీ, టెయిల్‌లైట్స్ కూడా పూర్తి-LED సెటప్‌ను కలిగి ఉన్నాయి.

Honda QC1 Ev Scooter Unveiled In India

ఇక QC1 మోడల్ విషయానికి వస్తే, ఇది ఫిక్స్‌డ్ బ్యాటరీతో వచ్చింది. దీని సామర్థ్యం 1.5 kWh. ఈ స్కూటర సింగిల్ ఛార్జింగ్‌తో దాదాపు 80 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. గరిష్ట వేగం 50 కి.మీ గా ఉంది. ఇది 5-అంగుళాల LCD ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌ సెటప్‌ను కలిగి ఉంది. USB టైప్-C పోర్ట్,

QC1 5-అంగుళాల LCD ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌ను పొందుతుంది, ఇది కీలకమైన సమాచారాన్ని ప్రదర్శించడం ద్వారా రైడర్ EVతో పరస్పర చర్య చేయడంలో సహాయపడుతుంది. EV అండర్-సీట్ స్టోరేజ్, USB టైప్-C సాకెట్ మరియు మరిన్ని వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది. ఇంకా, LED లైట్లు, సీటు క్రింది భాగంలో 26-లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంది. బ్యాటరీ 4 గంటల 30 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుందని హోండా పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 27, 2024, 14:21 [IST]
English summary
Honda activa e and qc1 unveiled in india bookings start from 2025 january
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+