కొత్త హోండా యాక్టివా Vs పాత టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో ఏదీ కొంటే బెటర్‌?.. కీలక తేడాలు ఇవే!

ఇటీవల ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా జనాలు ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. స్కూటర్‌ విభాగంలో కింగ్‌గా కొనసాగుతున్న హోండా యాక్టివా ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో విడుదల అయ్యింది. ఈ మార్కెట్‌ని సైతం ఏలేందుకు ఇటీవలే 'యాక్టివా e' (Activa e), QC 1 ఎలక్ట్రిక్‌ స్కూటర్లను లాంచ్‌ చేసింది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బుకింగ్స్ జనవరి 1, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. వీటి రాక కోసం కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో యాక్టివా ఇ స్కూటర్‌ నేరుగా టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌కి గట్టి పోటీని ఇస్తుంది. ఈ రెండు స్కూటర్ల మధ్య తేడాలు ఇవే..

బ్యాటరీ ప్యాక్స్‌: ముందుగా 'హోండా యాక్టివా ఇ' ఎలక్ట్రిక్ స్కూటర్‌ 1.5 కిలోవాట్ల (కిలోవాట్) సామర్థ్యం కలిగిన రెండు స్వాపబుల్‌ బ్యాటరీ ప్యాక్స్‌తో వస్తుంది. కావున వీటిని ఇంట్లో ఛార్జ్ చేయలేం. ఛార్జింగ్‌ అయిపోగానే దగ్గర్లోని ఛార్జింగ్ స్టేషన్‌కి వెళ్లి బ్యాటరీని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ముందుగా న్యూఢిల్లీ, ముంబయిలో మాత్రమే విక్రయించనున్నారు.

Honda Activa Electric Scooters

టీవీఎస్ ఐక్యూబ్ పవర్‌ఫుల్‌ 3.4 కిలోవాట్ల ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీనిని ఇంట్లోనూ ఛార్చింగ్‌ చేయవచ్చు. ఈ విషయంలో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే ఐక్యూబ్ అనకూలంగా ఉంటుంది. దీనిని 950W ఛార్జర్‌తో 0 నుంచి 80 శాతం ఛార్జింగ్‌ని కేవలం 2 గంటల్లో పూర్తి చేయవచ్చు. దీంతో ఈ స్కూటర్‌పై ఎటువంటి భయం భయం లేకుండా వెళ్లవచ్చు.

రేంజ్ & టాప్ స్పీడ్: కొత్త హోండా యాక్టివా ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌లో 102 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లుగా ఉంది. ఇది 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7.3 సెకన్లలో అందుకుంటుంది. ఇది 22 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

Honda Activa e Price

ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఇ-స్కూటర్ ఫుల్ ఛార్జ్‌పై 100 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 78 కిలోమీటర్లుగా ఉంది. ఇది కేవలం 4.2 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులోని రెండు వేరియంట్లు దాదాపు ఒకే రేంజ్, టాప్ స్పీడ్‌తో వస్తాయి.

ఫీచర్లు: కొత్త హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ TFT-ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ (7.0 ఇంచెస్‌) తో వస్తుంది. బ్లూటూత్‌ కనెక్టివిటీతో మెసెజ్‌, కాల్ అలర్ట్స్‌ని మ్యానేజ్‌ చేయవచ్చు. ఇది ఎకో, స్టాండర్డ్‌, స్పోర్ట్‌ మోడ్స్‌తో వస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్‌లో 5 ఇంచెస్‌ ఫుల్ కలర్ TFT - ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, మొబైల్ ఛార్జింగ్ కోసం USB సాకెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హోండా యాక్టివా పెద్ద ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్‌తో వస్తుంది.

TVS Iqube Electric Scooter

సస్పెన్షన్ సెటప్ & బ్రేకింగ్ సిస్టమ్: హోండా యాక్టివా ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్‌, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌తో వస్తుంది. 160 mm డిస్క్ / 130 mm డ్రమ్ బ్రేక్ ఆప్షన్ కలదు. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వెనక డ్యూయల్ షాక్ సస్పెన్షన్, ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్స్‌ కలవు. ముందు 220 మిమీ డిస్క్, వెనక 130 మిమీ డ్రమ్ బ్రేక్స్‌ కలవు.

ధర: టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ప్రస్తుతం రూ .1.37 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. అయితే హోండా యాక్టివా ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను ఇంకా ప్రకటించలేదు. ఇది కూడా లక్ష రూపాయల కంటే ఎక్కువ ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో ఈ స్కూటర్‌ ధరకు సంబంధించిన ఇతర వివరాలకు సమాధానం దొరుకుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 5, 2024, 12:48 [IST]
English summary
Honda activa e vs tvs iqube electric scooters range and features comparison
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+