యాక్టివా లవర్స్‌కి గుడ్‌న్యూస్‌.. త్వరలోనే ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో మీ ఫేవరెట్‌ స్కూటర్‌.. ఇదిగో వివరాలు

హోండా యాక్టివా స్కూటర్‌కి భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. ఇతర కంపెనీల నుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర కంపెనీ స్కూటర్లతో పోల్చితే వీటిని కొనేందుకు జనాలు ఇష్టపడతారు. స్కూటర్‌ అంటే హోండా యాక్టివా అని జనాలు భావిస్తారు. త్వరలోనే ఈ స్కూటర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల కాబోతుంది. 2025 ఆరంభంలో ఈ స్కూటర్ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది. ఐసీఈ (ఇంజిన్‌) వాహనాల విభాగంలో హోండా స్కూటర్స్ టాప్‌లో ఉన్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ విభాగంలోకి అడుగు పెట్టడంతో ఈ మార్కెట్‌ని కూడా శాసించే అవకాశం ఉంది.

ఈ స్కూటర్‌ యాక్టివా 125 మరియు యాక్టివా 6G మాదిరి డిజైన్‌తోనే రానుంది. ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌కి తగినట్లుగా మార్పులు చేయనున్నారు. ఆ కొత్త పవర్‌ట్రెయిన్‌లో కీలక మార్పులు ఉండనున్నాయి. ఆన్‌లైన్ నివేదికల ప్రకారం, హోండా గుజరాత్, కర్ణాటకలోని తన ఫ్యాక్టరీలలో ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని ఉత్పత్తి చేస్తుంది. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ (K4BA కోడ్ నేమ్‌) డిసెంబర్ 2024 నాటికి కర్ణాటకలోని ప్లాంట్‌లో తొలి ప్రొడక్ట్‌ని ఉత్పత్తి చేయనుంది.

Honda-Electric-Scooter

ముందుగా ఈ స్కూటర్‌ని 2024 ప్రారంభంలోనే విడుదల చేయాలని భావించారు. అయితే కొన్ని సాంకేతిక కారణణాల వల్ల అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం ఉత్పత్తితో పాటు కీలక అప్‌డేట్‌లపై సంస్థ ఫోకస్‌ పెట్టింది. ఈ సరికొత్త స్కూటర్‌తో ఎలక్ట్రిక్‌ రంగాన్ని శాసించాలని భావిస్తోంది. అందుకు తగినట్లుగానే త్వరలో మరిన్ని కీలక అప్‌డేట్‌లను సంస్థ అందించనుంది. అధునాతన ఫీచర్లు స్మార్ట్‌ అప్‌గ్రేడ్స్‌తో ఈ స్కూటర్‌ మరింత ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంది.

2023లో హోండా నిర్వహించిన కంపెనీ ఉత్పత్తుల ఈవెంట్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కి సంబంధించిన ఈ విషయాలను వెల్లడించింది. ఈ స్కూటర్‌ 'ప్లాట్‌ఫారమ్-E' అనే కొత్త ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి రానుంది. రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్‌లో స్వింగ్‌ఆర్మ్-మౌంటెడ్ మోటార్ ఉండే అవకాశం ఉంది. ఈ విధానం తయారీలో ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇకా ఏదైనా పంక్చర్ల విషయంలో వెనుక చక్రాన్ని తొలగించడాన్ని సులభతరం చేస్తుంది.

హోండా యాక్టివా 2024లోని స్మార్ట్ ఫైటర్, స్మార్ట్ కీ వంటి స్మార్ట్ అన్‌లాక్ వంటి ఫీచర్లను ఈ స్కూటర్‌లోనూ చూడవచ్చు. దీని సాయంతో స్కూటర్‌ని పార్క్ చేసిన 20 మీటర్ల దూరం నుంచి స్కూటర్‌ని ఆపరేట్‌ చేయవచ్చు. ఈ రాబోయే కొత్త ఎలక్ట్రిక్ యాక్టివా ఈవీ 3.78 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేయనుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌ ఆప్షన్‌తో రానుంది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల నుంచి 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుంది. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ ధర రూ. 1.10 లక్షలు (సబ్సిడీతో సహా ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. ఏథర్ రిజ్టా, TVS iQube, Hero Vida V1 Pro, Ola S1 Air మరియు బజాజ్ చేతక్ వంటి స్కూటర్లకు గట్టి పోటీని ఇవ్వనుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, May 31, 2024, 15:25 [IST]
English summary
Honda activa electric scooter expected to launch in early 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+