యాక్టివా EV స్కూటర్ రేంజ్, స్పీడ్ చూస్తే ఆశ్చర్యపోతారు.. మీరు ఊహించని స్థాయిలో పెర్ఫార్మెన్స్
ఇండియాలో పెట్రోల్, డీజిల్ వాహనాల కొనుగోళ్ల కంటే కూడా ఈవీలు ఎక్కువ సంఖ్యలో అమ్ముడు పోతున్నాయి. ఇంధనాల ధరలు అధికంగా ఉండటంతో ప్రజల చూపు క్రమంగా ఈవీలపై మళ్లుతుంది. దీంతో మొన్నటి వరకు పెట్రోల్ బైకులు, స్కూటర్లను అధికంగా మార్కెట్లోకి విడుదల చేసిన కంపెనీలు ఇప్పుడు వరుసగా ఈవీ బైకులు, స్కూటర్లు, కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో దేశీయ దిగ్గజ కంపనీ హోండా మోటార్స్(Honda Motors) నుంచి అత్యంత డిమాండ్ ఉన్న యాక్టివా(Activa) మోడల్ ఇప్పుడు ఈవీలో అందుబాటులోకి వస్తుంది. యాక్టివా పెట్రోల్ వేరియంట్ ఇండియా స్కూటర్ విభాగంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న మోడల్‌గా ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. అయితే ఇప్పటికే ఇతర కంపెనీలు తమ ఫెవరేట్ మోడళ్లను ఈవీలలో తీసుకురాగా, హోండా కంపెనీ సైతం తన ఆల్‌టైమ్ యాక్టివాను ఈవీ మోడల్‌లో లాంచ్ చేసి దేశంలో ఈవీలలో తన మార్కెట్‌ను మరింత పెంచుకోవాలని చూస్తుంది.
యాక్టివా ఈవీ స్కూటర్ మార్కెట్లోకి వస్తుందని సమాచారం రాగానే చాలా మంది దీని డిజైన్, బ్యాటరీ, ఫీచర్ల గురించి ఆన్‌లైన్‌లో తెగ వెతుకుతున్నారు. కంపెనీ దీనికి సంబంధించిన టీజర్‌ను తాజాగా విడుదల చేయగా, యాక్టివా ఈవీ పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ స్కూటర్ బెంగళూరులో నవంబర్ 27న అధికారికంగా లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. రాబోయే ఎలక్ట్రిక్ ఫీచర్లను ఒకసారి కింది కథనంలో చూద్దాం..

యాక్టివా ఈవీ స్కూటర్ పూర్తి ఛార్జింగ్‌పై దాదాపు 104 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఇది చాలా మంచి ఆప్షన్. ఉద్యోగాలకు, షాపింగ్‌లు, కాలేజీలకు వంటి దగ్గరి ప్రయాణాలను ఈ రేంజ్ పరిధి సరిపోతుంది. గరిష్ట వేగం గంటకు 80 కి.మీ. ఇంత రేంజ్ అందించే స్కూటర్లు ప్రస్తుతం ఉన్నప్పటికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన యాక్టివా ఈవీ ఎక్కువ డిమండ్ ఉన్న మోడల్‌గా ఉంది.
ఇది 1.3 కిలోవాట్ (kWh) డ్యూయల్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని తెలుస్తుంది. మోటార్ 6 KW గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది. ఈ స్కూటర్‌లో చాలా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ముందు హ్యాండిల్ బార్‌పై అమర్చిన డిస్‌ప్లేలో 5-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుందని సమాచారం. అదే టాప్ వేరియంట్‌లో మాత్రం 7 అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుందని సమాచారం.

స్కూటర్‌లో స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. రైడింగ్ సమయంలో తెలియని ప్రాంతాలకు వెళ్లడానికి సహాయకరంగా ఉండటానికి ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ సిస్టం బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నగరాల్లో అడ్రస్‌లను కనుక్కొవడం చాలా కష్టం. దీని కోసం స్మార్ట్‌ఫోన్ సహయంతో వెళ్తుంటారు. అందుకే ఈ అవసరం లేకుండానే నేరుగా ముందు డిస్‌ప్లేలో ఉన్న ఫీచర్‌తో రైడర్లు తమకు కావాల్సిన ప్రాంతానికి నేరుగా వెళ్లవచ్చు.
స్కూటీలో అందించిన ఫీచర్లను డిజిటల్ డిస్‌ప్లే ద్వారా యాక్సెస్ చేయవచ్చు. మ్యూజిక్ కంట్రోల్, స్మార్ట్ అలర్ట్‌లు, నోటిఫికేషన్లు, ఫోన్ ఛార్జింగ్, స్మార్ట్ కనెక్టివిటీ కోసం USB ఛార్జర్, బ్లూటూత్, కాల్స్ అలర్ట్, బ్యాటరీ ఇండికేటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్, రైడ్ ట్రిప్ డేటా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది స్పోర్ట్, స్టాండర్డ్ అనే రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది.

పెట్రోల్ స్కూటర్లలో ఉన్న సెస్పన్షన్ కంటే కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ముందు మరింత అధునాత టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను అమర్చారు. దీంతో అన్ని రకాల రోడ్లపై కూడా రైడర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దూసుకుపోతోంది. రైడింగ్‌లో అదనపు భద్రత కోసం డిస్క్ అండ్ డ్రమ్ బ్రేక్‌లను కూడా దీనిలో అందించినట్లు తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








