హోండా షైన్, యాక్టివా టూవీలర్స్‌పై అదిరిపోయే ఆఫర్లు.. ఘోరంగా తగ్గిన డౌన్ పేమెంట్ ధర!
భారత్‌లో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) టూవీలర్స్‌కి డిమాండ్ కాస్త ఎక్కువే అని చెప్పాలి. ఆ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న బైక్, స్కూటర్లు నంబర్ వన్ పొజీషన్‌లో ఉన్నాయి. దేశీయ మార్కెట్‌లో సరసమైన ధరలో అద్భుతమైన ఫీచర్లతో పలు టాప్ క్లాస్ బైక్స్, స్కూటర్లను ఆ సంస్థ విక్రయిస్తోంది. దీంతో ఈ స్కూటర్లను కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడి కొంటున్నారు. ఆ కంపెనీ నుంచి హోండా యాక్టివా (Honda Activa), హోండా షైన్ (Honda Shine)లు మంచి డిమాండ్‌ని కలిగి ఉన్నాయి.
హీరో మోటోకార్ప్ సేల్స్‌కి హోండా షైన్ బైక్ పెద్ద గండి కొట్టిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎక్కువగా సేల్ అవుతున్న టాప్ టూవీలర్స్‌లో ఇది ఒకటిగా ఉంది. ఇక హోండా యాక్టివా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు టూవీలర్స్‌పై కంపెనీ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. వీటిపై తగ్గింపుతో పాటు ఉచిత సర్వీస్ ప్యాకేజీని హోండా మోటార్స్ అందిస్తుంది. ఆ వివరాలు మీ కోసం..

ఈ కంపెనీ నుంచి హోండా షైన్ తక్కువ ధరలో మంచి మైలేజీ ఫ్యాన్సీ లుక్‌ని కలిగి ఉంటుంది. ఈ బైక్ కొనుగోలుపై 5 శాతం (రూ.5000 వరకు) క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ని కంపెనీ ప్రకటించింది. దీనితో పాటు ఏడాది వరకు ఉచిత సర్వీస్ ప్యాకేజీ అందిస్తున్నట్లు తెలిపింది. అంతే కాకుండా ఈ బైక్‌ని కేవలం రూ.1100 డౌన్ పేమెంట్ చెల్లించి మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.
షైన్ మోటార్ సైకిల్ మాదిరిగానే పాపులర్ హోండా యాక్టివా స్కూటర్‌పై కూడా 5 శాతం (రూ.5000 వరకు) క్యాష్‌బ్యాక్, ఏడాది ఉచిత మెయింటెనెన్స్ ప్లాన్, దీంతో పాటు 6 ఏళ్ల (3+3) వారంటీ అందిస్తుంది. ప్రస్తుతం హోండా షైన్ 100 సీసీ, 125 సీసీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. హోండా షైన్ 100 ధర రూ .66,600 (ఎక్స్-షోరూమ్).

షైన్ 100 లోని 98.98 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది లీటర్‌కి 68 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. హోండా షైన్ 125 ధర వేరియంట్లను బట్టి రూ .81,550 నుంచి రూ .85,550 (ఎక్స్-షోరూమ్) మారుతూ ఉంటుంది. ఇందులోని 123.94 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ కలదు.
హోండా షైన్ 125 లీటరుకు 55 కిలోమీటర్ల కచ్చితమైన మైలేజీని ఇస్తుంది. ఇందులో అనలాగ్ ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, కాంబీ బ్రేక్ సిస్టమ్ ఇంకా మరెన్నో ఫీచర్లతో వస్తుంది. ఈ బైక్ మార్కెట్‌లో హీరో మోటోకార్ప్‌కి చెందిన 125 సీసీ విభాగంలోని అన్ని బైక్స్ గట్టి పోటీని ఇస్తుంది. ఈ విభాగంలో హోండా షైన్ కంపెనీకి కీలక బైక్‌గా ఉంది.

ఇక స్కూటర్ విభాగంలో ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే హోండా యాక్టివా స్కూటర్ కూడా అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది. కొత్త హోండా యాక్టివా 125 ధర రూ .83,084 నుంచి రూ .92,257 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది 124 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
ఈ పండుగ సీజన్‌లో ప్రధాన టూవీలర్స్ ధర తగ్గింపు కలిసి వస్తుందని కంపెనీ భావిస్తుంది. కంపెనీ మొత్తం సేల్స్‌లో కీలకంగా ఉండే ఈ టూవీలర్స్ ఆఫర్ ప్రకటనతో మంచి మార్కెట్ జరిగే అవకాశం ఉందని కంపెనీ యోచిస్తోంది. తగ్గిన ధరలు తక్షణమే అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ ఆఫర్ ప్రైజ్ ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుందో కంపెనీ ప్రకటించలేదు.


Click it and Unblock the Notifications








