హోండా బిగ్‌వింగ్‌ డీలర్షిప్ ఇప్పుడు ఒంగోలులో.. ఇక్కడ ఏ బైకులుంటాయో తెలుసా?

భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా' (HMSI) ఎప్పటికప్పుడు మార్కెట్లో ఆధునిక వాహనాలను లాంచ్ చేయడం మాత్రమే కాకుండా.. దేశీయ విఫణిలో తన ఉనికిని కూడా చాటుకుంటోంది. ఇందులో భాగంగానే తన పరిధిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఈ తరుణంలో కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో కొత్త ప్రీమియం మోటార్‌సైకిల్ సేల్స్ మరియు సర్వీస్ అవుట్‌లెట్, హోండా బిగ్‌వింగ్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

హోండా మోటార్‌సైకిల్ కంపెనీ దేశవ్యాప్తంగా దాని ఉనికిని విస్తరించడం మరియు ప్రీమియం మోటార్‌సైకిల్ మార్కెట్‌ను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఒంగోలులో ప్రారంభమైన ఈ బిగ్‌వింగ్ డీలర్‌షిప్ కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు అనువుగా ఉంటుంది. ఇది కస్టమర్ల అవసరాలను తీర్చనుంది.

BigWing Grand New Dealership Opening Ongole

కంపెనీ తన బిగ్‌వింగ్ నెట్‌వర్క్ విస్తరించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా పలు నగరాల్లో ఇలాంటి బిగ్‌వింగ్ డీలర్షిప్ ప్రారంభించింది. ఇప్పుడు హోండా మోటార్‌సైకిల్ కంపెనీకి భారతదేశం అంతటా 140 కంటే ఎక్కువ టచ్‌పాయింట్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విస్తరణ లాస్ట్ మైల్ కనెక్టివిటీ మరియు కస్టమర్లకు విభిన్న అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త బిగ్‌వింగ్ డీలర్షిప్ ప్రదర్శనలో ఉన్న వాహనాలను హైలైట్ చేయడానికి బ్లాక్ అండ్ వైట్ మోనోక్రోమటిక్ థీమ్‌ను పొందింది. అంతే కాకుండా ఇక్కడ ఉత్పత్తి లేదా దీనికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు అందించడానికి కస్టమర్‌లకు సహాయం చేయడానికి శిక్షణ పొందిన నిపుణులు అందుబాటులో ఉన్నారు. వాహనాలను సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు.

BigWing Grand New Dealership Opening Ongole

ప్రీమియం డిజిటల్ అనుభవం అనేది హోండా బిగ్‌వింగ్ లీనమయ్యే డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా కస్టమర్ భద్రత మరియు సౌకర్యాన్ని నిర్ధారిస్తుంది. వర్చువల్ షోరూమ్ కస్టమర్‌లు ఇంటి నుంచి మొత్తం మోటార్‌సైకిల్ లైనప్, రైడింగ్ గేర్ మరియు యాక్సెసరీలను అన్వేషించడానికి అనుమతిస్తుంది. ఈ విధానంలో కస్టమర్ ప్రత్యేకించి డీలర్షిప్ సందర్శించాలని అవసరం లేదు. కావలసిన వివరాలను ఇంటి నుంచే లేదా ఉన్న చోటు నుంచే తెలుసుకోవచ్చు.

బిగ్‌వింగ్‌ డీలర్షిప్లలో 200 సీసీ నుంచి 1800 సీసీ ఇంజిన్ కెపాసిటీ కలిగిన బైకులు ఉంటాయి. ఇందులో హోండా సీబీ350, హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్, సీబీ300ఎఫ్, సీబీ300ఆర్, ఎన్ఎక్స్500, ఎక్స్ఎల్750 ట్రాన్సల్ప్, ఆఫ్రికా ట్విన్ మరియు గోల్డ్ వింగ్ టూర్ వంటి మోడల్స్ ఉన్నాయి. వీటితో పాటు హార్నెట్ 2.0 మరియు సీబీ200ఎక్స్ కూడా బిగ్‌వింగ్ షోరూమ్‌ల ద్వారా రిటైల్ చేయబడ్డాయి.

నిజానికి హోండా మోటార్‌సైకిల్ యొక్క బిగ్‌వింగ్‌ డీలర్షిప్లలో కొన్ని ప్రీమియంను బైకులు మాత్రమే లభిస్తాయి. అయితే ఇవి కంపెనీ యొక్క సాధారణ డీలర్షిప్లలో లభించవు. కాబట్టి ఈ ప్రీమియం బైకులను గురించి తెలుసుకోవాలనుకునే వారు లేదా కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ బైకుల గురించి ఖచ్చితమైన సమాచారం ఇవ్వడానికి బిగ్‌వింగ్‌ డీలర్షిప్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ అవకాశాన్ని ఒంగోలు మరియు పరిసర ప్రాంత వాసులు ఉపయోగించుకోవచ్చు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 10, 2024, 11:15 [IST]
English summary
Honda bigwing grand new dealership opening ongole in andhra pradesh
Read more on: #honda motorcycles #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+