రేసింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. హోండా CB1000 Hornet డిజైన్ ఫొటోలు లీక్.. మతి పోగొట్టే ఫీచర్లు
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా భారత్‌లో కొత్త బైక్ కోసం పేటెంట్‌ను నమోదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో CB1000 హార్నెట్ బైక్‌కు పేటెంట్‌ను నమోదు చేసినట్లు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ బైక్ డిజైన్ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. పూర్తి సమాచారం ఈ కథనంలో..
Honda CB1000 హార్నెట్ అనేది 1000 cc సెగ్మెంట్లో సంస్థ రూపొందిస్తున్న మోస్ట్ అవైటెడ్ మోటార్ సైకిల్. ఈ బైక్ 999 cc స్థానంలో ఇన్‌లైన్ 4 సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుందని వెల్లడైంది. కాగా త్వరలో ఈ బైక్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబధించి పేటెంట్ నమోదు చేసుకున్నట్లు తెలుస్తుండగా.. తాజాగా డిజైన్ చిత్రాలు లీక్ అయ్యాయి.

Honda CB 1000 హార్నెట్లో అమర్చిన ఈ కొత్త ఇంజన్ గరిష్ఠంగా 147 bhp శక్తిని మరియు 100 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుందట. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుండగా.. ఈ మరింత శక్తివంతమైన సామర్థ్యానికి సరిపోయేలా బైక్‌కు చాలా కఠినమైన రూపాన్ని అందించినట్లు ఫొటోల ద్వారా తెలుస్తోంది.
అదే సమయంలో Honda CB 1000 లుక్ పూర్తిగా ప్రత్యేకంగా ఉంటుంది. బైక్ చాలా పదునైన మరియు నిర్మాణాత్మక బాడీ ప్యానెల్‌లతో అద్భుతంగా డిజైన్ చేయబడింది. ఈ బైక్ ముందు భాగం దిగ్గజంలా కనిపించడంతో పాటు.. బైక్ డ్యూయల్ సీట్ సెటప్ మరియు లావుగా కనిపించే టైర్లతో హుందాగా ఉంది.

కాగా Honda CB 1000 బైక్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌తో నిర్మించబడినట్లు తెలుస్తోంది. ముందు భాగంలో షోవా ఫోర్క్ మరియు వెనుక వైపు ప్రో లింక్ షాక్ ఉపయోగించగా.. దేశంలో కఠినమైన రహదారులకు అనుకూలంగా ఇవి పనిచేస్తాయి. అలాగే, ఈ రెండూ ప్రీ-లోడ్ మరియు రీబౌండ్ అడ్జస్ట్‌మెంట్‌ను కలిగి ఉంటాయి.
అదేవిధంగా Honda CB 1000 బైక్ బ్రేకింగ్ సిస్టమ్ విషయానికొస్తే.. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, Honda CB 1000 హార్నెట్ బైక్‌లో ముందువైపు డ్యూయల్ డిస్క్ మరియు వెనుక చక్రంలో సింగిల్ డిస్క్ అమర్చారు. ఈ రెండూ బైక్ యొక్క టాప్ స్పీడ్‌ని అతి తక్కువ సమయంలో అదుపులోకి తీసుకువచ్చే కెపాసిటీని కలిగి ఉన్నాయి.

ఇంకా ఫీచర్ల పరంగా ఇందులో 17-అంగుళాల వీల్స్, రైడర్ కంట్రోల్, థొరెటల్-బై-వైర్ సిస్టమ్ వంటి వాటిని ఈ బైక్‌లో సంస్థ అందిస్తోంది. ఇది కాకుండా, హోండా CB 1000 హార్నెట్ బైక్‌లో 5-అంగుళాల TFT స్క్రీన్, మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లను ప్రవేశపెట్టింది.
అటువంటి గొప్ప బైక్‌కు ప్రస్తుతం హోండా భారతదేశంలో పేటెంట్ లైసెన్స్ కలిగి ఉండటం విశేషం. ఇది కాకుండా, హోండా CB 500 హార్నెట్, CBR 500 R మరియు CBR 650 R బైక్ మోడళ్ల కోసం భారతదేశంలో పేటెంట్‌ను నమోదు చేసిన విషయం తెలిసిందే.

కాగా ఇందులో, CB500 హార్నెట్ నేక్డ్ రోడ్‌స్టర్ రకం మోటార్‌సైకిల్ కాగా.. అదే సమయంలో, CBR 500 R పూర్తిగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా అందుబాటులో ఉండనుంది. అయితే, ఈ బైక్‌లు ఎప్పటి నుంచి విక్రయానికి రానున్నాయనే వివరాలపై మాత్రం సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో ఇప్పటికే ఈ బైక్‌లు రైడింగ్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

దేశంలో హోండా ఉత్పత్తులకు చాలా మంచి ఆదరణ లభిస్తుండగా.. ఫోర్ వీలర్ విభాగంలో కూడా సత్తా చాటుతోంది. ఈ దశలో సూపర్ బైక్ ప్రియులను ఆకర్షించేందుకు త్వరలో 1000 సీసీ బైక్ సెగ్మెంట్ పై సంస్థ దృష్టి సారించింది. ఈ బైక్ లాంచ్ అయ్యాక.. భారత మార్కెట్లో గట్టి పోటీ ఇస్తుందని సంస్థ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








