హోండా CB350 ADV డిజైన్ ఫొటోలు లీక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌కు గట్టి పోటీగా స్పెసిఫికేషన్లు.!!
అడ్వెంచర్ మోటార్ సైకిళ్ల పట్ల యూత్‌కి విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే అడ్వెంచరస్ బైక్‌లకు దేశంలో డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్, కేటీఎం, హీరో, జావా మోటార్‌సైకిళ్లు బ్రాండ్‌ల పట్ల యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో వీటికి గట్టి పోటీ ఇచ్చేందుకు హోండా CB350 ADV తో సిద్ధమవుతోంది.
సరైన ADV ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్ విభాగంలోకి ఇది హోండా CB350 ప్రవేశించనుంది. లుక్స్ పరంగా దాదాపుగా ఇది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450ను పోలి ఉంటుంది. ముఖ్యంగా RE హిమాలయన్ 450, హీరో ఎక్స్‌ట్రీమ్ 440కి ఈ బైక్ సవాల్ విసరనుంది. ఇందుకు సంబంధించిన డిజైన్ చిత్రాలు లీక్ అయి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

అయితే గతంలో హోండా కొత్త CB350 క్లాసిక్ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 నే పోలి ఉండేది. కానీ ఈసారి హోండా CB350 ADV మాత్రం ఫైనల్ ప్రొడక్షన్-స్పెక్ మోటార్‌సైకిల్ ఖచ్చితంగా హిమాలయన్ నుండి భిన్నంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. లీకైన ఫొటోలను నిశితంగా పరిశీలిస్తే హోండా సీబీ350 ADVలో పెద్ద విండ్‌స్క్రీన్, లగేజ్‌ను తీసుకెళ్లేందుకు సైడ్ గార్డ్‌లు, హెడ్‌లైట్ గార్డ్ ఇంకా మరిన్ని ఫీచర్లను చూడవచ్చు.
Honda CB350 ADVలో వెనుక సబ్‌ఫ్రేమ్‌లో ఫ్లాట్ పిలియన్ సీటు ఎత్తుగా ఉండటాన్ని చూడవచ్చు. రైడర్ సౌకర్యం కోసమే ఇలా ఎత్తుగా సెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకా పిలియన్ గ్రాబ్రెయిల్‌లో లగేజ్ రాక్ కూడా విశేషం అంతే కాకుండా హ్యాండిల్‌బార్‌పై కూడా రైడర్ నకిల్ గార్డ్‌లు ఉన్నట్లుగా ఫొటోల ద్వారా తెలుస్తోంది.

హోండాలో ఛాసిస్ కోసం సింగిల్ అప్-స్వీప్ట్ ఎగ్జాస్ట్‌తో ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను క్రెడిల్ చేస్తున్నట్లుగా డిజైన్ ఫొటోల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా RSU టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లను కలిగి ఉండటాన్ని చూడవచ్చు. ఇవి ఫోర్క్ గైటర్‌లను కూడా కలిగి ఉంటాయి. ఇంకా వెనుక వైపున, హోండా CB350 ADV ట్విన్ షాక్ అబ్జార్బర్‌లతో వస్తుందని ఊహించవచ్చు.
కాగా రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 USD టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో-షాక్ సెటప్‌తో వస్తుంది. కాగా లీక్ అయిన ఒకే 2D చిత్రం ఆధారంగా అన్ని స్పెసిఫికేషన్లను చెప్పలేం. అయితే ఫ్రంట్ వీల్ సుమారు 19-అంగుళాలు ఉన్నట్లుగా డిజైన్ ఫొటోలు చూస్తే తెలుస్తుంది. కాగా హిమాలయన్ మాదిరిగా ఇందులో 21-అంగుళాలు వీల్స్ లేవు.
హోండా వీల్స్‌ను వైర్-స్పోక్ రకం మరియు ట్యూబ్‌లెస్ డ్యూయల్-పర్పస్ టైర్‌లను అందించగలదు. అయితే వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే హోండా CB350 ADV వెర్షన్‌ను గట్టి పోటీగా తీసుకురావచ్చని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం, CB350 348cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 20.78bhp మరియు 30Nm ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
ఈ నేపథ్యంలో త్వరలో రాబోయే CB350 ADV.. మార్కెట్లో గట్టి పోటీని కలిగి ఉంది. హిమాలయన్, యెజ్డీ అడ్వెంచర్, హీరో ఎక్స్‌ట్రీమ్ 440 వంటి మంచి ప్రత్యర్థులను కలిగి ఉండటంతో.. హోండా ఈ బైక్‌ను మరిన్ని అంచనాలతో మరింత పనితీరుతో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 2025లో ఈ బైక్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








