ఆ కంపెనీ టూవీలర్స్‌ మాత్రమే కావాలంటున్న జనాలు.. కేవలం ఒక్క నెలలోనే ఏకంగా 6 లక్షల మంది కొనేశారు!

దేశంలో హోండా మోటార్ సైకిల్ & స్కూటర్ టాప్‌లో కొనసాగుతోంది. ఈ కంపెనీ నుంచి ప్రతి నెలా లక్షలాది ద్విచక్ర వాహనాలను రోడ్లపైకి వస్తున్నాయి. 2024 అక్టోబర్‌లో కూడా లక్షలాది హోండా టూవీలర్స్‌ సేల్‌ అయ్యాయి. ఈ నెలలో సాధారణం కంటే ఎక్కువగా హోండా టూవీలర్స్‌ అమ్ముడయ్యాయి. దేశంలో ప్రస్తుతం హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా ఉంది. ఫస్ట్ ప్లేస్‌లో హీరోమోటోకార్ప్ ఉంది. ప్రతి నెలా భారీ సంఖ్యలో టూవీలర్స్‌ని విక్రయిస్తూ హీరోమోటోకార్ప్‌కి గట్టి పోటీని ఇస్తుంది.

కేవలం అక్టోబర్ 2024లో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మొత్తం 5,97,711 ద్విచక్ర వాహనాలను విక్రయించి రికార్డు నెలకొల్పింది. 2023 అక్టోబర్‌తో పోలిస్తే ఈ సేల్స్‌ 21 శాతం పెరిగాయి. మొత్తం 5,97,711 వాహనాల్లో 5,53,120 వాహనాలు భారత్ లోనే అమ్ముడయ్యాయి. మిగిలిన 44,591 యూనిట్లను ఎగుమతి చేశారు.

Honda Motorcycle Sales

దేశీయంగా ఓవరాల్‌ సేల్‌లో 20 శాతం, విదేశీ ఎగుమతుల్లో 48 శాతం పెరిగాయి. విదేశీ ఎగుమతులు గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది 10,000లకు పైగా పెరిగింది. ఇక హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 2024 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మొత్తం 37,56,088 యూనిట్లను విక్రయించింది. ఇందులో భారత్‌లో మొత్తం 34,34,539 వాహనాలు సేల్‌ అయ్యాయి.

3,21,549 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేశారు. ఇదివరకు ఎప్పుడు లేని విధంగా హోండా టూ వీలర్స్‌ అక్టోబర్ నెలలో భారీ రికార్డులను నెలకొల్పింది. దేశంలోని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గడ్‌, ఉత్తరాఖండ్‌లలో ఎక్కువగా హోండా ద్విచక్ర వాహనాలు సేల్‌ అయ్యాయి. ఇక గత నెలలో కర్ణాటకలో 50 లక్షల అమ్మకాల మార్కును సైతం హోండా టూవీలర్స్‌ దాటింది.

Honda Activa October Sales

గత నెలలో అక్టోబర్‌లో ఫ్లెక్సీ ఫ్యూయల్ ఆప్షన్‌లో CB300F మోటార్‌సైకిల్‌ని లాంచ్ చేసింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి 300సీసీ ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్ ఇదే కావడం విశేషం. దీనిని రూ .1.70 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. తాజాగా హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్ షోరూమ్‌ని కేరళలోని కొచ్చిలో ఆ సంస్థ ప్రారంభించింది.

ఈ కంపెనీ నుంచి యాక్టివా స్కూటర్‌, షైన్‌, యూనికార్న్‌, SP 125, హోండా డియో వంటి టూవీలర్స్‌ ఎక్కువగా అమ్ముడువుతున్నాయి. వీటిలో మోటార్‌సైకిల్స్‌లో హోండా షైన్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఇది 100 సీసీ, 125 సీసీలలో అందుబాటులో ఉన్నాయి. ఇక యాక్టివా ఈ విభాగంలో కింగ్ మేకర్‌గా కొనసాగుతోంది. త్వరలోనే మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్‌ యాక్టివాను కంపెనీ విడుదల చేయనుంది.

Honda Shine October 2024 Sales

కేవలం ద్విచక్ర వాహనాలను విక్రయించడమే కాకుండా, రోడ్డుపై సురక్షితంగా ఎలా డ్రైవ్‌ చేయాలి, ఎలాంటి సేఫ్టీ అంశాలను పాటించాలనే అవగాహన కార్యక్రమాలను హోండా నిర్వహిస్తోంది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) అక్టోబర్ నెలలో దాదాపు 10 నగరాల్లో అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. దీంతో పాటు హోండా భారతదేశంలోని అనేక ప్రాంతాలలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను కూడా నిర్వహిస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, November 9, 2024, 7:20 [IST]
English summary
Honda motorcycle scooter india october 2024 sales increased by 21 percentage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+