ఒక్క ఏడాదిలో 3 లక్షల మంది కొనేశారు!.. అమ్మకాల్లో అదరగొట్టిన బైక్ ఇదే..
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ ''హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా'' (HMSI) ఇటీవల షైన్ 100 యొక్క మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశీయ విఫణిలో హోండా షైన్ 100 ఏకంగా 3 లక్షల కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడైన సందర్భంగా కంపెనీ షైన్ 100 ఫస్ట్ యానివెర్సరీ జరుపుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీ షైన్ 100 మెగా డెలివరీ ఈవెంట్ నిర్వహించింది. తక్కువ ధర వద్ద మంచి పనితీరుని అందించే ఈ బైకును ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఈ కారణంగానే షైన్ 100 గొప్ప అమ్మకాలను పొందగలిగింది.

షైన్ 100 ఫస్ట్ యానివెర్సరీ సందర్భంగా కంపెనీ అనేక నగరాల్లో మెగా డెలివరీ ఈవెంట్ నిర్వహించింది. 100 - 110 సీసీ విభాగంలో గొప్ప అమ్మకాలు పొందిన ఈ బైక్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ తన బైకుల విక్రయాల కోసం దేశ వ్యాప్తంగా 6000 టచ్‌పాయింట్‌లను ఏర్పాటు చేసింది. సర్వీస్ నెట్‌వర్క్‌ను కూడా కంపెనీ ఎప్పటికప్పుడు విస్తరిస్తూ కస్టమర్లకు చేరువవుతోంది.
హోండా షైన్ 100 ఫస్ట్ యానివెర్సరీ సందర్భంగా, హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ అండ్ సీఈఓ 'సుత్సుము ఒటాని' (Tsutsumu Otani) మాట్లాడుతూ.. షైన్ 100 ఎంతోమంది ప్రజలను ఆకర్శించడంలో విజయం పొందింది. ఈ బైకుపై కస్టమర్లు కూడా అపారమైన నమ్మకాన్ని కలిగి ఉన్నారు.. వినియోగదారులకు నమ్మదగిన ఉత్పత్తులను అందించడానికి కంపెనీ ఎప్పుడు ముందుంటుందని అన్నారు.

ఈ సందర్భంగా హెచ్‌ఎంఎస్‌ఐలో సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ 'యోగేష్ మాథుర్' మాట్లాడుతూ.. షైన్ 100 అత్యుత్తమ డిజైన్, మంచి మైలేజ్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతే కాకుండా మార్కెట్లోని ఇతర బైకులతో పోలిస్తే ఈ బైక్ ధర కొంత తక్కువే. షైన్ ప్రజల్లో సంపాదించినా మద్దతు గురించి ఆయన హైలెట్ చేశారు. రాబోయే రోజుల్లో ఈ బైక్ మరిన్ని గొప్ప అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము పేర్కొన్నారు.
హోండా షైన్ 100 ప్రారంభ ధర భారతీయ మార్కెట్లో రూ.64900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ అందిస్తున్న ఈ బైక్ 100సీసీ ఓబీడీ2 కంప్లైంట్ పీజీఎం-ఎఫ్ఐ ఇంజిన్ కలిగి స్మార్ట్ పవర్ టెక్నాలజీని పొందుతుంది. ఇది 7.28 Bhp పవర్ మరియు 8.05 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువ మంది ఈ బైక్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

దేశీయ మార్కెట్లో అత్యంత నమ్మికయిన కొత్త హోండా షైన్ 100 బైక్ కోసం కంపెనీ ప్రత్యేకంగా 10 సంవత్సరాల వారంటీ ప్యాకేజ్ అందిస్తోంది. ఇందులో 3 సంవత్సరాలు స్టాండర్డ్ వారంటీ, 7 సంవత్సరాలు ఆప్షనల్ వారంటీ లభిస్తాయి. ఈ బైక్ చూడతనికి సింపుల్ డిజైన్ కలిగి, వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇవన్నీ అమ్మకాలు పెరగటానికి దోహదపడ్డాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








