ఈ బైకులకే ఎక్కువ డిమాండ్.. ఈశాన్య భారతదేశంలో 30లక్షల సేల్స్

దేశీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మరియు అత్యంత నమ్మికయిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా'(HMSI) ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను పరిచయం చేయడం మాత్రమే కాకుండా అమ్మకాల్లో కూడా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది.

హోండా మోటార్‌సైకిల్ కంపెనీ తూర్పు భారతదేశంలో తన 125 సీసీ మోటార్‌సైకిళ్లైన షైన్ 125 మరియు ఎస్పీ125 బైకులను రికార్డ్ స్థాయిలో విక్రయించినట్లు ప్రకటించింది. విక్రయాల సంఖ్య మూడు మిలియన్స్ లేదా 30 లక్షలు. 100 సీసీ కమ్యూటర్ బైక్‌ల నుంచి 125 సీసీ మోటార్‌సైకిళ్ల వైపు ప్రజలు మరలుతున్నారని.. ఈ కారణంగా అమ్మకాలు పెడుతున్నాయని సంస్థ పేర్కొంది.

Honda Shine 125

హోండా మోటార్‌సైకిల్ యొక్క 125 సీసీ బైకులు ఎక్కువగా అమ్ముడైన ఈశాన్య రాష్ట్రాలతో పాటు బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా రాష్ట్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో హోండా బైకులు మంచి అమ్మకాలను పొందుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాల్లో FY2024లో కంపెనీ వాటా 41.5 శాతం ఉంది. ఇందులో కూడా బీహార్ అత్యధికంగా 35 శాతం విక్రయాలను కలిగి ఉంది.

బీహార్‌లో విక్రయించబడిన మొత్తం బైకుల (షైన్ 125, ఎస్పీ125) సంఖ్య 11.55 లక్షలు లేదా 1.15 మిలియన్స్ అని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈశాన్య రాష్ట్రాల్లో హోండా కంపెనీ యొక్క ఈ బైకులకు డిమాండ్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ బైకుల విక్రయాలు పెరుగుతాయని, అమ్మకాల్లో గణనీయమైన పురోగతి తప్పకుండా సాధ్యమవుతుందని భావిస్తున్నాము.

Honda SP125 Sports Edition

హోండా మోటార్‌సైకిల్ ప్రకారం.. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో 1100 కంటే ఎక్కువ సేల్స్ అండ్ సర్వీస్ టచ్‌పాయింట్‌లను కలిగి ఉన్నట్లు సమాచారం. సర్వీస్ టచ్‌పాయింట్‌ల సంఖ్య పెరగడం వల్ల గతంలోకంటే కూడా ఎస్పీ125 బైక్ సేల్స్ రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి. FY2024లో హోండా షైన్ 125 మరియు ఎస్పీ125 మొత్తం సేల్స్ 1207301 యూనిట్లను తెలుస్తోంది. ఈ సంఖ్య గతం కంటే కూడా 8 శాతం ఎక్కువ.

భారతదేశంలో హోండా బైకులు ఎక్కువ అమ్ముడుకావడానికి ప్రధాన కారణం.. సరసమైన లేదా అందుబాటు ధర అనే చెప్పాలి. ధర కొంత తక్కువగా ఉండటమే కాకుండా రోజువారీ వినియోగానికి కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉత్తమ మైలేజ్ అందించడం వల్ల కూడా ఈ బైకులను కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. రానున్న రోజుల్లో హోండా కంపెనీ మరింత మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

Honda Shine 125 Front Profile

భారతదేశంలో హోండా కంపెనీకి చెందిన టూ వీలర్స్ జాబితాలో ప్రధానంగా హోండా షైన్ మరియు ఎస్పీ125 మాత్రమే కాకుండా.. హోండా డియో, యాక్టివా, హోండా యూనికార్న్, హోండా హైనెస్, హోండా సీబీ200ఎక్స్, హోండా హార్నెట్ 2.0, హోండా సీబీ350, హోండా ఎన్ఎక్స్500, హోండా ఆఫ్రికా ట్విన్ మరియు హోండా గోల్డ్ వింగ్ వంటి అనేక మోడల్స్ ఉన్నాయి. రానున్న రోజుల్లో హోండా మరిన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేయనుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, May 18, 2024, 15:00 [IST]
English summary
Honda shine 125 and sp125 bikes sales crossed 30 lakh in eastern india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+