ఆ బైక్‌ కోసం షోరూమ్‌ల వద్ద క్యూ కడుతున్న జనాలు.. ఈ బైక్‌ ఉండని వీధి, కనిపించని రోడ్డు ఉండదు!

ప్రస్తుతం హోండా మోటార్‌ సైకిల్స్‌ మార్కెట్‌లో దుమ్మురేపుతున్నాయి. ఆ కంపెనీ నుంచి స్కూటర్‌ విభాగంలో హోండా యాక్టివా (Honda Activa) టాప్‌లో కొనసాగుతుండంగా.. హోండా షైన్ (Honda Shine) హీరో మోటోకార్ప్‌కి గట్టి పోటీని ఇస్తుంది. ప్రస్తుతం భారతీయ వినియోగదారులలో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహనాలలో ఈ హోండా షైన్‌ ఒకటిగా ఉంది. ఈ షైన్ బైక్‌ రెండు వెర్షన్‌లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ బైక్ 125 సీసీ విభాగంలో ఇప్పటికే టాప్‌లో ఉండగా.. గత ఏడాది హోండా షైన్ 100 సీసీని ఆ కంపెనీ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన బైక్‌ కూడా జెట్‌ స్పీడ్‌లో దూసుకెళ్తుంది. ఈ రెండు బైక్స్‌కి సంబంధించిన ఆగస్టు 2024 నెల సేల్స్‌ రిపోర్ట్‌ వెల్లడైంది. ఆ వివరాలు ఈ కథనంలో..

హోండా షైన్‌ రెండు వెర్షన్లు కలిసి 2024 ఆగస్టులో మొత్తం 1,49,697 యూనిట్లను విక్రయించింది. ఇదే బైక్‌ సేల్స్‌ 2023 ఆగస్టులో కేవలం 1,14,142 యూనిట్లనే సేల్‌ చేసింది. ఈ ఏడాది 35,555 యూనిట్లు ఎక్కువగా సేల్‌ అయ్యాయి. ఆగస్టు 2024లో అమ్ముడైన టాప్‌ 10 మోటార్‌ సైకిల్స్‌లో హోండా షైన్ మూడవ ద్విచక్ర వాహనంగా ఉంది.

Honda Shine Motorcycles August 2024 Sales Report

దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్న టూవీలర్స్‌లో హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత హోండా షైన్ మూడవ స్థానాన్ని ఆక్రమించింది. మేము ఇది వరకే చెప్పినట్లుగా, హోండా షైన్ రెండు వెర్షన్లు కలిపి ఈ మార్క్‌ని సాధించాయి. గత కొద్ది నెలల క్రితం వరకు కూడా హోండా షైన్‌ సేల్‌లో టాప్‌లో కొనసాగింది.

ఈ హోండా షైన్ 125 123.94 సీసీ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 7.9 ps పవర్‌ని, 11 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ హోండా షైన్ 125 వేరియంట్ ధరసు రూ .82,950 నుంచి రూ .86,950 మధ్య ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలే.

Honda Shine Motorcycles August 2024 Sales Report

తక్కువ ధరలో హోండా షైన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే మీరు 100సీసీ వెర్షన్‌ని ఎంచుకోవచ్చు. ఈ హోండా షైన్ 100 బైక్ 98.98 సీసీ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 5.43 ps శక్తిని, 8.05 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 110 సీసీ మోటార్‌ సైకిల్స్‌కి గట్టి పోటీని ఇస్తుంది.

ఈ బైక్‌ ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ హోండా షైన్ 100 ధర రూ.66,600 (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉంది. ఈ బైక్ ఒకే వేరియంట్‌లో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. హోండా షైన్ 100 భారతీయ మార్కెట్‌లోనే అత్యంత చౌకైన మోటార్ సైకిల్‌గా ఉంది. కాబట్టి తక్కువ ధరలో మంచి ఫర్ఫామెన్స్‌ కోరుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా ఉంటుంది.

Shine 125

షైన్ రెండు బైక్స్‌ లీటర్‌కి 55 కి.మీ నుంచి 65 కి.మీ కచ్చితమైన మైలేజీని ‌అందిస్తాయి. అంతే కాకుండా షైన్ బైక్స్‌ కాంబీ బ్రేక్‌ సిస్టమ్‌తో వస్తుంది. ఇది అత్యవసరాల్లో ఉపయోగపడుతుంది. ఇంజిన్‌ స్టార్ట్‌/ స్టాప్‌ బటన్‌, సైడ్‌ స్టాండ్‌ ఇంజిన్‌ కటాఫ్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ బైక్‌ డిజైన్‌, ఫీచర్లు, మైలేజీలో మేటి కావడంతో సేల్స్‌లో సత్తా చాటుతోంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 25, 2024, 7:20 [IST]
English summary
Honda shine bikes august 2024 sales report and specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+