దేశంలో అందరికి యాక్టివా స్కూటర్.. షైన్‌ బైక్‌‌ మాత్రమే కనిపిస్తుందా..! ఒక్క నెలలోనే కొన్ని లక్షల సేల్స్‌..

భారత్‌లో ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థగా ఉన్నటువంటి హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రతినెలా తన వాహనాల విక్రయాల్లో పెరుగుదలను చూస్తుంది. ఈ కంపెనీ టూవీలర్లకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందించే బైక్‌లను, స్కూటర్లను విడుదల చేస్తూ దేశంలో తన మార్కెట్‌ను వేగంగా పెంచుకుంటుంది. ఇదిలా ఉంటే నవంబర్ నెలలో జరిగిన అమ్మకాల వివరాలను కంపెనీ వెల్లడించింది. గత ఏడాదిలో జరిగిన విక్రయాలతో పోలిస్తే, ఇప్పుడు మరింత ఎక్కువ మంది కస్టమర్లు హోండా వాహనాలను కొనుగోలు చేశారు. వీటి డిజైన్లు కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఉండటం, అలాగే ధర కూడా అందరికీ అందుబాటులో ఉండటంతో 2023 ఏడాది నవంబర్ నెల కంటే 2024 ఇదే నెలలో అమ్మకాల్లో వృద్ధి నమోదైంది.

కంపెనీ నుంచి తాజాగా విడుదలైన డేటా ప్రకారం, ఈ ఏడాది నవంబర్‌లో హోండా దేశీయంగా జరిగిన అమ్మకాలతో పాటు+ఎగుమతులు కలిపి మొత్తం 4,72,476 యూనిట్ల టూవీలర్ వాహనాలను విక్రయించింది. ఇది 2023 ఏడాది ఇదే నెలలో జరిగిన 4,47,849 యూనిట్లతో పోలిస్తే, సంవత్సరానికి 5.56 శాతం వృద్ధి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి కంపెనీ కొత్త కొత్త ప్రణాళికలు వేస్తూ, అమ్మకాల పరంగా ఇతర కంపెనీల కంటే దూసుకుపోతుంది.

Honda Sales Report

ఇదిలా ఉంటే, హోండా కంపెనీ నవంబర్ నెలలో మెరుగైన అమ్మకాలను సాధించినప్పటికీ ఇది అక్టోబర్ నెలతో పోలిస్తే మాత్రం తక్కుగానే ఉంది. నెలవారీగా విక్రయాలు 20.91 శాతం తగ్గాయి. అయితే దీనికి ప్రధాన కారణం అక్టోబర్ నెలలో దసరా, దీపావళి పండుగలు ఉండటం వలన వినియోగదారులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడంతో ఈ నెలలో మొత్తం విక్రయాలు భారీగా ఉన్నాయి.

పండుగల సమయంలో కంపెనీ వినియోగదారులను ఆకట్టుకోడానికి భారీ మొత్తంలో తగ్గింపులు, డిస్కౌంట్‌లను అందించడం, అలాగే డీలర్లు కూడా తమ వద్ద ఉన్న స్టాక్‌ను వేగంగా క్లియర్ చేసుకోడానికి వారు ప్రత్యేకంగా అదనపు తగ్గింపు ఆఫర్ ఇవ్వడం వలన అక్టోబర్ మొత్తం కూడా హోండా టూవీలర్లు అత్యధికంగా అమ్ముడుపోయాయి. నవంబర్ నెల వచ్చే సరికి ఫెస్టివల్ తగ్గింపులు లేకపోవడం వలన విక్రయాలు క్షీణించాయి.

Honda Two Wheeler Sales Report

ఎగుమతులు కాకుండా దేశీయంగా అమ్మకాలను చూసినట్లయితే ఈ నవంబర్‌లో విక్రయాలు 4,32,888 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గత ఏడాది ఇదే నెలలో 4,20,677 యూనిట్లతో పోలిస్తే ఏడాది ప్రాతిపదికన 2.90 శాతం వృద్ధి. ముఖ్యంగా ఈ అమ్మకాల్లో హోండా ప్రసిద్ధ మోడల్ అయినటువంటి యాక్టివా(Activa) స్కూటర్, బైక్ విభాగంలో షైన్(Shine)కీలక పాత్ర పోషించాయి.

యాక్టివా ప్రస్తుతం రెండు వేరియంట్లలో లభిస్తుంది. యాక్టివా 125 స్కూటర్ ధర రూ.84,085 నుంచి రూ.92,257గా ఉంది. అదే యాక్టివా 6జీ ధర రూ. 79,624 నుంచి రూ. 84,624 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ రెండు వేరియంట్లు కూడా ప్రస్తుతం హోండా అమ్మకాలను పెంచడానికి ఉపయోగపడ్డాయి. కంపెనీ మొత్తం అమ్మకాల్లో దీని వాటా ఎక్కువగానే ఉంటుంది. దీనితో పాటు షైన్ కూడా కీ రోల్ పోషించింది.

ఈ బైక్ ప్రస్తుతం ఇండియాలో రెండు వేరియంట్లలో లభిస్తుంది. షైన్ 125 ధర రూ.82,551 నుంచి రూ.86,551గా ఉంది. అదే షైన్ 100 ధర రూ. 66,600(ఎక్స్-షోరూమ్‌) కు లభిస్తుంది. మొత్తం ఎగుమతుల గురించి మాట్లాడుకుంటే, 2024 నవంబర్‌లో కంపెనీ 39,861 యూనిట్లను సరఫరా చేసింది. ఇది గత ఏడాది ఇదే నెలలో 27,172 యూనిట్లను ఎగుమతి చేసింది. ఇది ఏడాది ప్రాతిపదికన 46.70 శాతం వృద్ధి.

More from DriveSpark

Article Published On: Thursday, December 5, 2024, 12:11 [IST]
English summary
Honda two wheeler sales 4 72 lakh unit in november 2024
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+