టూవీలర్స్‌లో రారాజు.. దీని రూటే సపరేటు, ఆ కంపెనీలో తోపు బైక్ అంటే ఇదే!
మార్కెట్‌లో హోండా మోటార్‌సైకిల్స్‌కి మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం దేశంలోనే ప్రముఖ బైక్ తయారీ సంస్థల్లో ఇదొకటిగా ఉంది. ఈ కంపెనీ ఇతర సంస్థల వాటితో పోల్చితే బైక్ ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లు ఉండటంతో దేశీయ మార్కెట్‌లో ఈ కంపెనీ విక్రయించే బైక్స్, స్కూటర్లు ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. ప్రస్తుతం ఈ కంపెనీ లైనప్‌లో హోండా యూనికార్న్ (Honda Unicorn)కి మంచి డిమాండ్ ఉంది. ఈ బైక్ చాలా తక్కువ ధరతో భారీ డిజైన్, క్రేజీ లుక్‌ని కలిగి ఉంటుంది. ఈ బైక్‌కి సంబంధించిన గత నెల (ఆగస్టు) సేల్స్ రిపోర్ట్ వెల్లడి అయ్యింది. ఈ సేల్స్‌లో హోండా షైన్ స్థిరంగా రాణించింది. ఈ సేల్స్ వివరాలపై ఓ లుక్కేయండి.
గత నెలలో హోండా యూనికార్న్ అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. హోండా యూనికార్న్ ఆగస్టు 2024 లో 31,451 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఆగస్టులో 31,473 యూనిట్లు సేల్ అయ్యాయి. గత ఏడాది అమ్మకాలతో పోలిస్తే 0.7 శాతం క్షీణించింది. అయితే ఇదేమి తక్కువ కాదు. ఈ నెల పండుగ సీజన్ ఉండటంతో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇక ఈ హోండా యూనికార్న్ 162.71 సీసీ ఎయిర్-కూల్డ్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 12.91 ps గరిష్ట శక్తిని 14.58 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో 5-స్పీడ్ గేర్ బాక్స్ జతచేయబడి ఉంటుంది. మైలేజీలోనూ ఈ బైక్ తోపు అని చెప్పవచ్చు. ఇది లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ ధర రూ. 1.11 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
హోండా యూనికార్న్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, మరెన్నో ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఇంజిన్ కిల్ స్విచ్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్ ఫంక్షనాలిటీ, సింగిల్ ఛానల్ ఏబీఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ హోండా యూనికార్న్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి.

బ్రేకింగ్ కోసం ముందు భాగంలో 240 మిమీ డిస్క్, వెనుక వైపున 130 మిమీ డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. 139 కిలోల బరువు ఉండే ఈ మోటార్ సైకిల్‌లో 13 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్‌ని అమర్చారు. ఈ 187 మిమీ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్, 798 మిమీ సీటు ఎత్తుని కలిగి ఉంటుంది. ఈ బైక్ బజాజ్ పల్సర్ 150, టీవీఎస్ అపాచీ RTR 160 వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.
టీవీఎస్ అపాచీ RTR 160 బైకులో 159.7సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 16.04 ps శక్తిని, 13.85 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. హోండా మోటార్ సైకిల్ నుంచి హోండా యాక్టివా టాప్‌లో కొనసాగుతోంది. అంతే కాకుండా డియో స్కూటర్లు కూడా గట్టి పోటీని ఇస్తున్నాయి. బైక్ అమ్మకాల్లో షైన్ మోడల్ కీలకంగా ఉంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








